Movies

లాఠీ పట్టుకోవడానికి రెడీ

kareena as police officer in angrez medium

‘హిందీ మీడియం’ (2017) సీక్వెల్‌ ‘అంగ్రేజీ మీడియం’ సినిమా కోసం బాలీవుడ్‌ బ్యూటీ కరీనా కపూర్‌ ఖాకీ డ్రెస్‌ వేసి లాఠీ పట్టుకున్న సంగతి తెలిసిందే. ఆఫీసర్‌గా కరీనా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లే టైమ్‌ దగ్గరైంది. ఈ నెల 15న ఆమె ముంబైలో చార్జ్‌ తీసుకోనున్నారని తెలిసింది. కెరీర్‌లో తొలిసారి పోలీస్‌ పాత్ర చేస్తున్నారు కరీనా కపూర్‌. ‘అంగ్రేజీ మీడియం’ చిత్రానికి హోమి ఆదజానియా దర్శకత్వం వహిస్తున్నారు. ఇర్ఫాన్‌ఖాన్‌ ఇందులో హీరోగా నటిస్తున్నారు. అయితే కథ పరంగా ఇర్ఫాన్‌కు కరీనా జోడీగా నటించడం లేదని తెలిసింది. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో మొదలైంది. ఆ తర్వాత ముంబైలో ఓ వారం రోజుల షెడ్యూల్‌ను పూర్తి చేసి, ఆ తర్వాత షూటింగ్‌ షెడ్యూల్‌ కోసం లండన్‌ ఫ్లైట్‌ ఎక్కుతారట ఈ టీమ్‌. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్నారు.