Movies

నాగకన్య

laxmi raai as nagakanya

దాదాపు 40 ఏళ్ల క్రితం వచ్చిన కమల్‌హాసన్‌ చిత్రాల్లో ‘నీయా’ ఒకటి. ఈ రొమాంటిక్‌ హారర్‌ థ్రిల్లర్‌ అప్పట్లో మంచి హిట్‌. ఇన్నేళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘నీయా 2’ రూపొందింది. తెలుగు వెర్షన్‌ టైటిల్‌ ‘నాగకన్య’. జై హీరోగా, వరలక్ష్మీ శరత్‌ కుమార్, రాయ్‌ లక్ష్మి, కేథరిన్‌ థెరిస్సా ప్రధాన పాత్రలలో ఎల్‌. సురేష్‌ దర్శకత్వంలో రూపొందింది. ఈ చిత్రం తెలుగు హక్కులను లైట్‌ హౌస్‌ సినీమ్యాజిక్‌ అధినేత కె.ఎస్‌. శంకర్‌ రావు దక్కించుకున్నారు. ఈ నెల 10న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా కె.ఎస్‌.శంకర్‌ రావు మాట్లాడుతూ– ‘‘హారర్‌ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం థ్రిల్‌కి గురి చేసే విధంగా ఉంటుంది. ముఖ్యంగా మనిషి పాముగా మారే సన్నివేశాలు, పాము చేసే విన్యాసాలు హైలైట్‌గా ఉంటాయి. కథ డిమాండ్‌ మేరకు గ్రాఫిక్స్‌కి భారీగా ఖర్చు పెట్టడం జరిగింది. ఈ సమ్మర్‌లో పిల్లలు, పెద్దలకు మంచి ఎంటర్‌టైనర్‌ అవుతుంది. దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు’’ అన్నారు.