NRI-NRT

తానా సభల్లో ప్రాంతీయ సమావేశాలకు సన్నాహాలు

తానా సభల్లో ప్రాంతీయ సమావేశాలకు సన్నాహాలు - District NRIs Meet At 22nd TANA 2019 Conference In Washington DC

ఎల్లుండి నుండి వాషింగ్టన్ డీసీలో ప్రారంభం కాబోతున్న తానా 22వ మహాసభల్లో వివిధ జిల్లాలకు చెందిన ప్రవాసులు ప్రాంతీయ సమావేశాల పేరిట ఒకేచోట జేరి ఊసులాడనున్నారు. కృష్ణా, చిత్తూరు, ఖమ్మం, గోదావరి జిల్లాలకు చెందిన ప్రవాసులు ఈ సభలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలకు ఆయా జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులను ఆహ్వానించి సత్కరించనున్నారు. తమ ప్రాంతానికి ప్రత్యేకమైన వంటకాలను ఈ సందర్భంగా వారు అతిథులకు అందించనున్నారు.