NRI-NRT

తెలంగాణా జాగృతి ఖతార్ ఆధ్వర్యంలో రాఖీ వేడుకలు

Telangana Jagruthi Qatar Conducts Rakhi Celebrations-తెలంగాణా జాగృతి ఖతార్ ఆధ్వర్యంలో రాఖీ వేడుకలు

తెలంగాణ జాగృతి ఖతార్ ఆధ్వర్యంలో దోహా లోని ఇండియన్ కల్చరల్ సెంటర్ లో రాఖీ పండుగ సంబరాలు జరిగాయి.ఈ సంధర్భంగా ఖతర్ జాగృతి సభ్యులు నందిని అబ్బగౌని, స్వప్న చిరంశెట్టి గారు హజరైన వారందరికీ రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ జాగృతి ఖతార్ అధ్యక్షురాలు నందిని అబ్బగొని, ప్రధాన కార్యదర్శి వినాయక్ చెన్న గారు మాట్లాడుతూ
వృత్తి రీత్యా ,ఉపాధి కోసం సముద్రాలు దాటి ఊరుని, కుటుంబాన్ని , తోబుట్టువులను వదిలి, ఏళ్ళు కు ఏళ్ళు రాఖీ పండుగకి నోచుకోని గల్ఫ్ అన్నల కోసం ఈ చిన్ని ప్రయత్నం అన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి ఆధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి #GiftaHelmet పిలుపు మేరకు అన్నలు చెల్లెళ్ళకు ఎలాగైతే రక్షణ గా ఉంటారో అదే విధంగా అన్నల రక్షణ కోసం అందరు ఆడ పడుచులు తమ అన్నల తమ్ముళ్ల రక్షణ కోసం వారు శిరశ్రానం ధరించేల చూడాలని, కోరారు, అదే కాక తమ నిర్మాణ పన్నుల్లో ఇతరత్ర ప్రమాదం పొంచి ఉన్న చోట తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని కోరారు.

ఈ కార్యక్రమంలో జాగృతి ఖతార్ కార్యవర్గ సభ్యులు ఎల్లయ్య తాళ్ల పెళ్లి, రాజేష్ కుమార్, ప్రవీణ్ మోతే,గడ్డి రాజు, నవీన్ అల్లే, రమేష్ పిట్లా, నర్సయ్య ఇతరులు పాల్గొని అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.