DailyDose

బంజారాహిల్స్ లో భారీ చోరీ-నేరవార్తలు–08/27

Huge Theft In Banjara Hills - Telugu Crime News Today-08/27

* బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 2లో భారీ చోరీ జరిగింది. బిల్డర్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఇంట్లో 4 కోట్ల విలువైన సొత్తు చోరీ చేశారు దుండగులు.. యజమాని ఇంట్లో ఉన్న సమయంలోనే నగదు, వజ్రాలు, బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. ఇంటి యజమాని ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్‌ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు.
*హైదరాబాద్ విమానాశ్రయంలో ఇండిగో విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో టైరుల్లో నుండి పొగలు వెలువడాయి. అప్రమత్తమైన పైలట్, ఎయిర్ పోర్టు అధికారులు ప్రమాద బారినుండి విమానాన్ని కాపాడారు.
*తూర్పుగోదావరి జిల్లాలో తెదేపా నేతపై వైకాపాకు చెందిన కొంతమంది కార్యకర్తలు కత్తితో దాడికి పాల్పడ్డారు. శంఖవరం మండలం కత్తిపూడిలో ఈ ఘటన చోటుచేసుకుంది. తెదేపా నేత శివపై దుండగులు కత్తితో దాడి చేయడంతో ఆయన చేతికి గాయాలయ్యాయి.
* నేటి కాలంలో వివాహ వేడుక ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. జీవితాంతం గుర్తు పెట్టుకోవాల్సిన అందమైన జ్ఞాపకం కావడంతో పెళ్లి వేడుకలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ప్రస్తుత కాలంలో ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ చాలా సర్వ సాధరణమయ్యింది. ఉన్నత కుటుంబాల నుంచి మధ్యతరగతి ప్రజల వరకు ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకోసం భిన్నమైన పద్దతులను అనుసరిస్తున్నారు. అయితే ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ ఓ అధికారి పాలిట సమస్యగా పరిణమించింది. ప్రీ వెడ్డింగ్‌ షూట్‌లో భాగంగా కాబోయే భార్య దగ్గర నుంచి లంచం తీసుకుంటున్నట్లు తీసిన వీడియో కాస్తా ఓ పోలీసు అధికారి కొంపముంచింది.
* క్యూనెట్‌ స్కామ్‌లో 70 మందిని అరెస్ట్ చేసి వారిపై 38 కేసులు నమోదు చేసినట్లు సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ కేసుకు సంబంధించి బెంగుళూరులో రూ. 2.7 కోట్ల నగదును సీజ్‌ చేసినట్లు, క్యూనెట్‌ను ప్రచారం చేసిన సినీ ప్రముఖులకు నోటిసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు.
* ప్రభుత్వ ఉద్యోగులపై టీడీపీ నేత కూన రవికుమార్‌ చేసిన వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూన రవికుమార్‌ మరో చింతమనేని ప్రభాకర్‌లా మారాడని.. ఉద్యోగులను భయబ్రాంతులను గురిచేసిన రవికుమార్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.
* 26 మంది బంగ్లాదేశ్‌కు చెందిన పౌరులను బార్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ అరెస్టు చేసింది. గోనా ఫీల్డ్‌ ఏరియాలో భారత్‌ – బంగ్లాదేశ్‌ బార్డర్‌లో భారత్‌లోకి చొరబడటానికి నిందితులు యత్నించారు. 26 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు.
* ఆన్ లైన్ డేటింగ్ పేరుతో యువకులను ట్రాప్చేసి, బ్లాక్మెయిలింగ్కు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠా గుట్టు రట్టయింది. కాల్ సెంటర్ ఏర్పాటు చేసి యువతులతో ఆకట్టుకునేలా మాట్లాడిస్తూ యువకులకు గాలం వేస్తున్న వెస్ట్ బెంగాల్ కు చెందిన ముగ్గురు సభ్యుల ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 38 సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్, బాధితుల డేటాతో కూడిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సీసీఎస్ జాయింట్ సీపీ అవినాశ్ మహంతి వెల్లడించారు.
* కలకాలం కలిసి జీవితాన్ని పంచుకుందామనుకున్న భర్తను భార్యే చంపించిన ఘటన షాపూర్‌నగర్‌లో జరిగింది.
* క‌శ్మీర్‌కు ప్ర‌త్యేక హోదా క‌ల్పించే ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు త‌ర్వాత తొలిసారి మిలిటెంట్లు దాడి చేసిన ఘ‌ట‌న న‌మోదైంది.
* ఉత్తరప్రదేశ్‌లోని షాహజాన్‌పూర్ జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. రెండు టెంపోలను ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
* హైదరాబాద్‌ నగరంలోని కూకట్‌పల్లి భాగ్యనగర్‌ కాలనీలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కుమార్తెను కన్న తల్లే బస్సు కిందకే తోసేసింది. బస్సు డ్రైవర్‌ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. ఆ తర్వాత మళ్లీ చిన్నారిని రోడ్డుపై విసిరేసింది. చిన్నారిని స్థానికులు కాపాడారు. కసాయి తల్లిని స్థానికులు చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.
* ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో ప్రేమోన్మాది ఘాతుకానికి ఓ యువతి బలైంది. ప్రేమించిన యువకుడే దారుణంగా హత్య చేశాడు.
*ఉత్తర‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. షాజహాన్‌పూర్ జిల్లాలో రెండు టెంపోలను ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో  మంది ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
* కృష్ణా జిల్లా కంచికచర్లలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని పేరకలపాడులో ఈతకు వెళ్లిన ముగ్గురు అన్నదమ్ములు మృత్యువాత పడ్డారు.
*విశాఖ నౌకాశ్రయంలోని జెట్టీ వద్ద సోమవారం సాయంత్రం చోటుచేసుకున్న విద్యుత్తు ప్రమాదంలో రూ.60 కోట్ల విలువైన హార్బర్ మొబైల్ క్రేన్ (హెచ్.ఎం.సి.) పూర్తిగా దగ్ధమైంది.
*మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితులకు నార్కో అనాలసిస్ పరీక్షలు ముగిశాయి.
*రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖకు రూ.20.08 కోట్ల వస్తు,సేవల పన్ను (జీఎస్టీ) ఎగవేసిన వ్యాపారి కౌశిక్ శక్తి బాబూరాంను వాణిజ్య పన్నుల శాఖ అరెస్టు చేసింది.
*చెన్నై విమానాశ్రయంలో 7 కిలోల బంగారం, రూ.కోటి విలువైన మత్తు పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
*ఓబుళాపురం మైనింగ్ కేసులో నిందితుడైన గాలి జనార్దన్రెడ్డికి బెయిలు మంజూరుకు జరిగిన ప్రయత్నాలపై ఏసీబీ నమోదుచేసిన కేసులో సాక్షిగా సీబీఐ కోర్టు మాజీ న్యాయమూర్తి బి.నాగమారుతీ శర్మ సోమవారం ఏసీబీ కోర్టు ముందు హాజరయ్యారు.
*అనంతపురం జిల్లా గుత్తి మండలం జక్కలచెరువు రైల్వేస్టేషన్ వద్ద సోమవారం రైలులో నుంచి ఓ విద్యార్థిని గుర్తుతెలియని వ్యక్తులు కిందకు తోసేశారు. ఈ ఘటనలో విద్యార్థి రెండు కాళ్లనూ కోల్పోయాడు.
* వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఓ వ్యక్తి తన భార్య తల నరికి దాంతో నేరుగా పోలీసుస్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన ఒడిశాలోని పూరీ జిల్లా అస్తరంగా ఠాణా పరిధిలోని రాయబెరాహ గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
*రైలు ఢీకొంటే మనిషి బతకడం కష్టం. కానీ ఇలాంటి అరుదైన ఘటన పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని కుందనపల్లి రైల్వేగేటు వద్ద సోమవారం జరిగింది.
* పాఠాలు నేర్పాల్సిన గురువు బాట తప్పాడు. కూతురు లాంటి విద్యార్థినిపై కన్నేశాడు. పదే పదే ఆమెతో అసభ్యంగా ప్రవర్తించే ప్రయత్నం చేశాడు. చివరకు గ్రామస్థులు అతడి బుద్ధిని పసిగట్టి, పట్టుకుని పాఠశాల గేటుకే కట్టేశారు. ఈ ఘటన ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లాలో చోటుచేసుకుంది. కతామేట పంచాయతీలోని ఓ పాఠశాలలో బలిమెలకు చెందిన విద్యార్థిని ఆరోతరగతి చదువుతోంది. అందులో పనిచేసే ఉపాధ్యాయుడు అశిమ్‌కుమార దెవురి ఈనెల 23న ఆ అమ్మాయిని ఇంటికి పిలిచాడు. తలుపులు మూసేసి అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. మర్నాడు పాఠశాల మోటారు స్విచ్‌ వేసేందుకు వెళ్తే అక్కడికివచ్చి పట్టుకున్నాడు. ఆమె తప్పించుకుని, తోటి విద్యార్థినులకు విషయం చెప్పింది. ఆదివారం ఈ విషయాన్ని విద్యార్థిని గ్రామస్థులకు తెలిపింది. దీంతో గ్రామస్థులు సోమవారం పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయుడిని గేటుకు కట్టేశారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేస్తామని సర్పంచి, గ్రామస్థులు చెప్పారు.