Videos

వెంకీ వేట వీడియో

Venky Mama Trailer Released

‘గోదావరిలో ఈత నేర్పా, బరిలో ఆట నేర్పా, ఇప్పుడు జాతరలో వేట నేర్పిస్తా.. రారా అల్లుడు’ అంటున్నారు విక్టరీ వెంకటేష్‌. ఆయన, నాగ చైతన్య కథానాయకులుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్‌ ‘వెంకీ మామ’. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ సినిమా ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. యాక్షన్‌తోపాటు సరదా సన్నివేశంతో రూపొందించిన ఈ వీడియో అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి కేఎస్‌ రవీంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చైతన్యకు జోడీగా రాశీ ఖన్నా, వెంకీకి జోడీగా పాయల్‌ రాజ్‌పుత్‌ నటిస్తున్నారు. తమన్‌ బాణీలు అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.