Movies

వచ్చే ఏడాది వ్యాపారవేత్తతో వివాహం

Kajal Agarwal To Marry Business Man Next Year

అందుకే ఆ విషయంలో..దశాబ్దకాలంగా సుదీర్ఘమైన కెరీర్‌తో దూసుకెళ్తున్న యువ హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు. 2005‌లో సినీ రంగంలోకి ప్రవేశించిన కాజల్ తన తొలి సినిమా హిట్టు కావడంతో కెరీర్ పరంగా వెనుకకు చూసుకోలేని పరిస్థితి ఎదురైంది. ఇటీవల కాలంలో కుర్ర హీరోయిన్ల తాకిడి పరిశ్రమకు ఎక్కువ కావడం, అలాగే సక్సెస్ రేట్ తగ్గడంతో కాజల్ కెరీర్ ఇంతకు ముందున్నంత వేగంగా ముందుకెళ్లడం లేదు. గత కొద్దికాలంగా పెళ్లి గురించి వార్తలు వచ్చినా అంతగా ప్రాధాన్యం దక్కలేదు. కానీ తాజాగా ఆమె కుటుంబ సభ్యులు పెళ్లికి ప్రయత్నాలు చేస్తున్నారనే విషయం మీడియాలో ఆసక్తికరంగా మారింది. వివరాల్లోకి వెళితే.. సన్నిహిత వర్గాలు తెలిపిన ప్రకారం.. పెద్దలు కుదిర్చిన పెళ్లికి కాజల్ అగర్వాల్ సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఓ వ్యాపార వేత్తను వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నారనే విషయాన్ని వెల్లడిస్తున్నారు. కెరీర్ పీక్స్‌లో ఉండగానే జీవితంలో సెటిల్ కావాలనే నిర్ణయాన్ని తీసుకొన్నట్టు సమాచారం. పెద్దల సూచన మేరకు కాజల్ కూడా సిద్ధపడినట్టు తెలుస్తున్నది. ఇప్పటికే కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్ మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు తల్లిగా మారిన విషయం తెలిసిందే. పెళ్లి విషయం పక్కన పెడితే.. కొన్నాళ్లుగా కాజల్ నిర్మాతగా మారేందుకు ప్లాన్ చేస్తున్నది. సొంతంగా ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించాలని ప్రయత్నాలు చేస్తున్నది. తన బ్యానర్‌కు KA ఫిల్మ్స్ అనే పేరును కూడా ఖరారు చేసినట్టు సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా కాజల్ ఇటీవల వెల్లడించారు.