Agriculture

కిలో ఉల్లిపాయలు ₹80

One Kilo Onions Priced At 80 Rupees In India-Telugu Agricultural News

తెలుగు రాష్ట్రాల్లో ఉల్లిగడ్డల ధర సామాన్యులను కలవర పెడుతోంది.

రోజురోజుకి పెరుగుతున్న ధరలు ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు.

హైదరాబాద్​ మలక్‌పేట్‌ మార్కెట్‌లో నాణ్యమైన ఉల్లిగడ్డల టోకు ధర క్వింటా 6 వేల రూపాయలకు చేరింది. గత నెలలో గరిష్ఠ ధర 1971 రూపాయలు ఉండేది.

ఈ నెలలో ఏకంగా 201 శాతం అదనంగా పెరిగింది. ఇక చిల్లర ధరలను వీధికో తీరుగా అమ్ముతున్నారు.

కిలోకు రూ.80
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలకు మహారాష్ట్ర నుంచి వచ్చే నాణ్యమైన పెద్ద ఉల్లిగడ్డల ధర 60 రూపాయలు పలుకుతోంది.

చిన్నగా ఉండి అంతగా నాణ్యత లేని వాటిని కూడా కిలో 30 రూపాయలకు అమ్ముతున్నారు.

దేశవ్యాప్తంగా ముఖ్య నగరాల్లో చిల్లర కిలోకు 80 రూపాయలకు చేరిందని జాతీయ ఉద్యాన మండలి తాజా నివేదికలో స్పష్టం చేసింది.

ఉల్లి ధరల మంటతో విదేశాల నుంచి లక్ష టన్నుల దిగుమతి చేయడమే గాక వాటి నిల్వకు నాణ్యత ప్రమాణాలను సడలించింది.

ధర పెరిగినా.. డిమాండ్ తగ్గలేదు
ఖరీఫ్‌ సీజన్‌లో సాగుచేసిన ఉల్లి పంట వర్షాలకు దెబ్బతినడం వల్ల 10 లక్షల టన్నుల వరకు దిగుబడి తగ్గిందని అంచనా.

ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలకు గుజరాత్‌, మహారాష్ట్రల నుంచి ఉల్లి దిగుమతి అవుతోంది. క్వింటా ధర ఆరు వేలకు చేరినా డిమాండ్‌ మాత్రం తగ్గలేదు.

దేశవ్యాప్తంగా ఉల్లిగడ్డల ధరలు
హైదరాబాద్‌రూ. 60
ముంబయిరూ.80
త్రివేంద్రంరూ.78
అమృతసర్‌రూ.70
పట్నారూ.70