DailyDose

ధర్మానకు షాకిచ్చిన సీబీఐ-నేరవార్తలు

CBI Includes Dharmana Prasada Rao In Vanpic Scam

*వైకాపా సీనియర్ ఎమ్మల్యే మాజీ మంత్రి అయిన ధర్మాన ప్రసాదరావుకు సీబీఐ గట్టి షాక్ ఇచ్చింది వైఎస్ హయాంలో కీలక మంత్రిగా పని చేసిన ధర్మాన ప్రస్తుతం వైకాపా ఎమ్మెల్యేగా ఉన్నారు. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ధర్మనపై కూడా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఇందులోని వాన్ పిక్ కేసులో అప్పటి మంత్రిగా పని చేసిన ధర్మాన ప్రసాదరావు పై విచారమ చేపట్టడానికి సీబీఐ రెడీ అయ్యింది ధర్మాన పై అవినీతి నిరోధక చట్టం కింద ఉన్న ఆరోపణల పై విచారణ చేపట్టవచ్చని సీబీఐ తాజాగా పేర్కొంది ఈమేరకు ధర్మానను విచారణ చేపట్టవచ్చని సీబీఐ తాజాగా పేర్కొంది.
* కృష్ణాజిల్లా ఉయ్యూరు ఫ్రిడ్జ్ పేలి వివాహిత సజీవదహనం.మండలపరిది కాటూరు గ్రామంలో మాటూరి నాగభూషణం భార్య జాన్సీ (30) కొట్లో ప్రిడ్జ్ పేలి సజీవ దహనం.
* తమిళనాడు పోలీసులు జిహాదీ ఉగ్రవాదుల ముఠా గుట్టు రట్టు చేశారు. 8మంది ఉగ్రవాదులను అరెస్టు చేశారు.
* అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం గ్యాంగ్‌ సభ్యుడు, పరారీలో ఉన్న గ్యాంగ్‌స్టర్‌ ఇజాజ్‌ లక్డవాలాను ముంబయి పోలీసులు అరెస్ట్‌ చేశారు.
* అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్, ఇరాక్‌ల మధ్య వైరం ఇంకా ముదురుతుంది. పరస్పరం ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూనే ఉన్నారు. తాజాగా బుధవారం రాత్రి ఇరాక్ రాజధాని బాగ్దాద్‌పై మరో రెండు రాకెట్ల దాడి జరిగింది.
* ఓ పేపర్ ప్రింటింట్ ప్రెస్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందారు. గురువారం పొద్దున ఢిల్లీలోని పత్ పర్ ఘంజ్ ఏరియాలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ఇందులో 35ఫైర్ టెండర్స్ పాల్గొన్నాయి. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
* గుజరాత్‌లోని సూరత్‌లో గురువారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. ఎల్పీజీ సిలిండర్లతో వెళ్తున్న వెళ్తున్న మినీ ట్రక్కు బోల్తా పడింది. దీంతో ఆ వాహనంలోని సిలిండర్లు ఒకదాని తర్వాత మరొకటి పేలిపోయాయి. సిలిండర్లు వరుసగా పేలడంతో మంటలు చెలరేగాయి.
* హైదరాబాద్‌ నగరంలోని జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో అడ్మిన్‌ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సుధీర్‌రెడ్డి ఏసీబీకి చిక్కారు. ఓ సివిల్‌ కేసు సంబంధించిన సెటిల్‌మెంట్‌ వ్యవహారంలో రూ.50వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు.
* గంజాయి సరఫరా చేసే ఘరానా మోసగాళ్ల ఆగడాలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయి. చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మల్లో గంజాయి నింపి, రవాణా చేస్తున్నారు.
* ఢిల్లీకి సమీపంలోని నోయిడాలో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సెక్టార్‌ 24లో ఉన్న ఈఎస్‌ఐ ఆస్పత్రిలో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దీంతో అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది.. రోగులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
* శేరిలింగంపల్లి సర్కిల్‌ -20 కార్యాలయంలో ఏసీబీ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ యాదయ్య, అసిస్టెంట్‌ సాయి కలిసి ఓ వ్యక్తి నుంచి రూ. 15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
* అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం గ్యాంగ్‌ సభ్యుడు, పరారీలో ఉన్న గ్యాంగ్‌స్టర్‌ ఇజాజ్‌ లక్డవాలాను ముంబయి పోలీసులు అరెస్ట్‌ చేశారు.
* అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన ముగ్గురు డిగ్రీ విద్యార్థినులు నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు వారి అవసరాల నిమిత్తం నగరానికి చెందిన మహేశ్ అనే వడ్డీ వ్యాపారి వద్ద రూ.20 వేలు అప్పు తీసుకున్నారు. వడ్డీ వ్యాపారి నుంచి వత్తిళ్లు అధికమవడంతో బుధవారం రాత్రి ముగ్గురు విద్యార్థినులు తమ ఇళ్ల నుంచి అనంతపురం ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకుని నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. చికిత్స కోసం వారిని అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న సీఐ బాషా ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
* ఏడేళ్ల క్రితం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న నలుగురు దోషుల్లో ఒకడైన వినయ్‌ శర్మ నేడు సుప్రీంకోర్టులో క్యురేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. ఉరిశిక్ష ముందు దోషులకు ఉన్న చిట్టచివరి న్యాయపరమైన అవకాశం ఇదే కావడం గమనార్హం.
* కిలీ పత్రాలతో మంత్రిగా పేర్కొంటూ ప్రభుత్వ గెస్ట్‌ హౌస్‌లో ఉన్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఘటన గోవాలో చోటుచేసుకుంది.
* సరైన పత్రాలు లేవని తన కారును అధికారులు స్వాధీనం చేసుకోవడంతో పోర్షే 911 స్పోర్ట్స్‌ కార్‌ యజమాని పన్నులు, వడ్డీ, జరిమానా కలిపి రూ. 27.68 లక్షలు చెల్లించి తన కారును తీసుకువెళ్లారు. ఈ మొత్తాన్ని అహ్మదాబాద్‌ ప్రాంతీయ రవాణా కార్యాలయం(ఆర్టీవో)లో చెల్లించిన కారు యజమాని రంజిత్‌ దేశాయ్‌ సిటీ ట్రాఫిక్‌ పోలీసుల స్వాధీనంలో ఉన్న తన కారును తీసుకువెళ్లారు. గడిచిన ఏడాది నవంబర్‌లో ఈ కారును ట్రాఫిక్‌ పోలీసులు సీజ్‌ చేశారు. నవంబర్‌ 28న హెల్మెట్‌ క్రాస్‌రోడ్‌ వద్ద నెంబర్‌ ప్లేట్లు లేని కారణంగా కారును ట్రాఫిక్‌ పోలీసులు నిలిపివేశారు.
* చనిపోయిన ఎస్సై… ఇదివరకు స్పెషల్ టాస్క్ ఫోర్స్‌ లో పనిచేశారు. నిందితులకూ, ఎస్సైకీ మధ్య ఏమైనా సంబంధాలున్నాయా అన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది. బుధవారం రాత్రి తమిళనాడుకు చెందిన స్పెషల్ సబ్ ఇన్‌స్పెక్టర్‌ విల్సన్‌(58)ను ఇద్దరు దుండగులు కాల్చి చంపారు. తమిళనాడులోని పదంతలుమూడు చెక్‌పోస్ట్‌ దగ్గర ఈ దారుణం జరిగింది.
* అనంతపురంలో నిద్రమాత్రలు మింగి ముగ్గురు విద్యార్థినుల ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అర్ధరాత్రి బస్టాండ్‌లో అపస్మారకస్థితిలో ఉన్న విద్యార్థినుల గుర్తించిన స్థానికులు చికిత్సకోసం విద్యార్థినులను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
*భార్యను హత్య చేయడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తిని చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
*అనుమానాస్పదస్థితిలో ఓ వివాహిత మృతి చెందింది. అయితే భర్త, అత్తమామలే చంపేసి ఉంటారని మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
*దేశరాజధాని ఢిల్లీని వరుస అగ్నిప్రమాదాలు వెంటాడుతున్నాయి. ఈరోజు ఉదయం పట్పార్ గంజ్ ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ప్రస్తుతం ఘటనా స్థలంలో 32 ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపు చేస్తున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
*వికారాబాద్ జిల్లా పరిగి మండలం సుల్తాన్పూర్ గేట్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ ఏఎస్సై సాయిలు మృతి చెందారు.
*హెలికాప్టరులో ఆయుధాలను తీసుకువెళుతుండగా ప్రమాదవశాత్తూ కుప్పకూలడంతో మిలటరీ విభాగానికి చెందిన ఇద్దరు పైలట్లు మరణించిన ఘటన ఆఫ్ఘనిస్థాన్ దేశంలో జరిగింది.
*ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో ప్రత్యేక జోనల్ కమిటీ (ఎస్జడ్సీ) సభ్యుడు బెల్లం నారాయణస్వామి, ఆయన భార్య పూల్బత్తిలను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.
*కల్వర్టు నిర్మాణంలో ప్రమాణాలు పాటించలేదు.. సూచికలూ ఏర్పాటు చేయలేదని.. ఇదే తన తల్లి మృతికి కారణమైందంటూ ఓ యువకుడు జాతీయ రహదారుల సంస్థ(ఎన్హెచ్ఏఐ)పై కేసు పెట్టిన వైనమిది. వరంగల్ రూరల్ జిల్లా దామెర మండల పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది
*వేధింపుల భర్తకు దూరంగా నివసిస్తున్న ఇద్దరు పిల్లల తల్లిని ఫేస్బుక్ ద్వారా పరిచయం చేసుకుని మోసం చేసిన యువకుడ్ని బుధవారం మల్కాజిగిరి పోలీసులు అరెస్టు చేశారు.
*త్వరలో జరగనున్న పురపాలిక ఎన్నికల్లో తనకు టికెట్ కేటాయించకపోవడంపై ఓ మాజీ కౌన్సిలర్ మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మెదక్ జిల్లాలో జరిగింది. తెరాసకు చెందిన మాజీ కౌన్సిలర్ జ్యోతికృష్ణ తనకు టికెట్ కేటాయించకపోవడంతో మెదక్ పార్టీ కార్యాలయం ఎదుట బుధవారం కిరోసిన్ పోసుకున్నాడు. ఇది గమనించిన కార్యకర్తలు ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు జ్యోతికృష్ణను అదుపులోకి తీసుకున్నారు.
*జేఎన్యూలో విద్యార్థులపై దాడి ఘటనలో ముసుగు ధరించిన వ్యక్తులను సంబంధించి పోలీసులకు కీలక ఆధారాలు లభించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. త్వరలోనే పోలీసులు ఈ కేసును ఛేదిస్తారని పేర్కొన్నారు.
* రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సమత హత్యాచార కేసు విచారణ ఆదిలాబాద్లోని ప్రత్యేక న్యాయస్థానంలో కొనసాగుతోంది. పోలీసులు ఛార్జిషీట్లో పొందుపరిచిన సాక్షుల విచారణ ఇప్పటికే పూర్తి కాగా, నిందితులు షేక్బాబు, షేక్ షాబొద్దీన్, షేక్ మగ్దూం తరఫున సాక్షులను ప్రవేశ పెట్టేందుకు న్యాయస్థానం రెండు రోజులు అనుమతిచ్చింది.
*పని ఒత్తిడి, అనారోగ్యం, సరెండర్ చేశారనే కారణాలతో మనస్తాపానికి గురై ఓ గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన నల్గొండ జిల్లా నకిరేకల్లో బుధవారం చోటుచేసుకుంది.
*ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు ఢీ కొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 32 మంది ప్రయాణికులు గాయపడ్డారు. చిత్తూరు జిల్లా, చంద్రగిరి మండలంలోని కాశిపెంట్ల గ్రామ సమీపంలో బుధవారం వేకువజామున పూతలపట్టు-నాయుడుపేట జాతీయ మార్గంలో ఈ దుర్ఘటన జరిగింది.
*తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ అధికారి.. తనను తాను ఐపీఎస్ అధికారిగా పేర్కొంటూ ప్రోటోకాల్ దర్శనానికి దరఖాస్తు చేయగా తిరుమల వన్టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
*మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి ఈనెల 20కి వాయిదా వేశారు. వివిధ వ్యాజ్యాల్లో ప్రతివాదులుగా ఉన్న కేంద్ర హోంశాఖ, సీబీఐ, తెదేపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తదితరులకు నోటీసులు జారీ చేశారు