Business

గ్రామ పంచాయతీ ఇంటర్నెట్‌కు ₹6వేలకోట్లు

Indian rural internet development scheme gets 6000crore rupees

గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్‌ అనుసంధానతను మరింత పెంచేందుకు ‘భారత్‌నెట్‌’ ప్రోగ్రామ్‌లో భాగంగా 2020-21కిగాను ప్రభుత్వం రూ.6 వేల కోట్లు కేటాయించింది. అంగన్వాడీలు, ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, చౌకధరల దుకాణాలు, తపాలా కార్యాలయాలు, పోలీసు స్టేషన్లు సహా దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలకు డిజిటల్‌ అనుసంధానతను కల్పించడమే తమ లక్ష్యమని సీతారామన్‌ తెలిపారు. భారత్‌నెట్‌ ద్వారా అందించే ‘ఫైబర్‌ టు ది హోమ్‌(ఎఫ్‌టీటీహెచ్‌)’తో ఈ ఏడాదే లక్ష గ్రామ పంచాయతీలను అనుసంధానించనున్నట్లు చెప్పారు. ప్రైవేటురంగ సంస్థలు దేశవ్యాప్తంగా డేటా సెంటర్‌ పార్కులను ఏర్పాటుచేస్తారు.