DailyDose

నేటి మీ రాశిఫలం-మార్చి 21 2020

Daily Horoscope Astrology In Telugu Today - March 21 2020

తిథి:

బహుళ ఏకాదశి ఉ.7.37, కలియుగం-5121 ,శాలివాహన శకం-1941

నక్షత్రం:

శ్రవణం సా.6.19

వర్జ్యం:

రా.10.35 నుండి 12.17 వరకు

దుర్ముహూర్తం:

ఉ.8.24 నుండి 9.12 వరకు, తిరిగి మ.12.24 నుండి 1.12 వరకు

రాహు కాలం:

ఉ.10.30 నుండి 12.00 వరకు ,విశేషాలు: సర్వేషాం ఏకాదశి

మేషం:

(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా నుండుట మంచిది. ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోతారు. నూతన వ్యక్తుల పరిచయమేర్పడుతుంది. ప్రయాణాలవల్ల లాభాన్ని పొందుతారు. తలచిన కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు.

వృషభం:

(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) ఇతరులచే గౌరవింపబడే ప్రయత్నంలో సఫలమవుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా లేనందున మానసికాందోళన చెందుతారు. ప్రతి పని ఆలస్యంగా పూర్తిచేస్తారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా నుండుట మంచిది. విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

మిథునం:

(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభమేర్పడే అవకాశముంటుంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.

కర్కాటకం:

(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) ఆకస్మిక ధనలాభముంటుంది. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఇతరులకు ఉపకారం చేయుటకు వెనుకాడరు. ఋణబాధలు తొలగిపోతాయి. శత్రుబాధలుండవు.

సింహం:

(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) బంధు, మిత్రులతో కలుస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో, ఋణబాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యముంటుంది. శతృబాధలు దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది.

కన్య:

(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటవుతుంది. అనారోగ్య బాధలు స్వల్పంగా వున్నాయి. వేళ ప్రకారం భుజించుటకు ప్రాధాన్యమిస్తారు. చంచలంవల్ల కొన్ని ఇబ్బందులెదురవుతాయి. మనోనిగ్రహానికి ప్రయత్నించాలి. పిల్లలపట్ల ఏ మాత్రం అశ్రద్ధ పనికిరాదు.

తుల:

(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) కోపాన్ని అదుపులో నుంచుకొనుట మంచిది. మానసికాందోళన తొలగించుటకు దైవధ్యానం అవసరం. శారీరక అనారోగ్యంతో బాధపడతారు. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా నుండవు. వృధా ప్రయాణాలెక్కువవుతాయి. ధనవ్యయం తప్పదు.

వృశ్చికం:

(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. మానసిక చంచలంతో ఇబ్బంది పడతారు. సోమరితనం ఆవహిస్తుంది. కొన్ని మంచి అవకాశాలను కోల్పోతారు. ఆర్థిక పరిస్థితిలో మార్పులుండవు.

ధనుస్సు:

(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) వృత్తి, ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి వుంటుంది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశాలుంటాయి. ఏ విషయంలోను స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్తపడుట మంచిది.

మకరం:

(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. అనారోగ్య బాధలు తొలగుటకు డబ్బు ఎక్కువ ఖర్చు చేస్తారు. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవదర్శనం ఉంటుంది. స్ర్తిలు మనోల్లాసాన్ని పొందుతారు.

కుంభం:

(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) మనస్సు చంచలంగా వుంటుంది. బంధు, మిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్తపడుట మంచిది. అకాల భోజనంవల్ల అనారోగ్య బాధలనుభవిస్తారు. ఆకస్మిక కలహాలకు అవకాశముంటుంది. చెడు సహవాసానికి దూరంగా నుండుటకు ప్రయత్నించాలి.

మీనం:

(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) చంచలం అధికమవుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. స్ర్తిలతో తగాదాలేర్పడే అవకాశాలుంటాయి. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రయాణాలుంటాయి.

#########################################
#########################################

పంచాంగము ? 21.03.2020

సంవత్సరం: వికారి

ఆయనం: ఉత్తరాయణం

ఋతువు: శిశిర

మాసం: ఫాల్గుణ

పక్షం: కృష్ణ బహుళ

తిథి: ద్వాదశి ఉ.09:05 వరకు
తదుపరి త్రయోదశి

వారం: శనివారం (మంద వాసరే)

నక్షత్రం: ధనిష్ట రా.08:31 వరకు
తదుపరి శతభిషం

యోగం: సిధ్ధ ప‌.12:21 వరకు
తదుపరి సద్య

కరణం: తైతిల ఉ.07:56 వరకు
తదుపరి వణిక

వర్జ్యం: రా.తె.04:20 – 06:05

దుర్ముహూర్తం: 06:19 – 07:50

రాహు కాలం: 09:21 – 10:52

గుళిక కాలం: 06:19 – 07:50

యమ గండం: 01:54 – 03:25

అభిజిత్ : 11:59 – 12:47

సూర్యోదయం: 06:19

సూర్యాస్తమయం: 06:27

వైదిక సూర్యోదయం: 06:22

వైదిక సూర్యాస్తమయం: 06:23

చంద్రోదయం: రా.04:30

చంద్రాస్తమయం: సా.04:08

సూర్య సంచార రాశి: మీనం

చంద్ర సంచార రాశి: మకరం

దిశ శూల: తూర్పు

చంద్ర నివాసం: దక్షిణం

☘ శని ప్రదోషం