DailyDose

ప్రజలారా…సరుకుల కోసం ఆందోళన చెందకండి-తాజావార్తలు

Telugu Breaking News Roundup Today-YS Jagan Requests Not To Panic

* కరోనా ప్రభావం నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా మార్చి 31వరకు విద్యాసంస్థలు, థియేటర్లు, మాల్స్‌, పెద్ద ప్రార్థనా మందిరాల మూసివేత కొనసాగుతుందని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. ఆ తర్వాత పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణలో భాగంగా తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. కరోనా గురించి ప్రజలు ఆందోళన చెందవద్దని.. జాగ్రత్తలు తీసుకోవాలని జగన్‌ సూచించారు. వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు ప్రజల్లో అవగాహన పెంచాలని, అపోహలు తొలగించాలని అధికారులను ఆయన ఆదేశించారు.

* కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయాన్ని మూసివేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో), ప్రధాని మోదీ సూచనల మేరకు ఎన్టీఆర్‌ భవన్‌కు సందర్శకులు, కార్యకర్తలకు అనుమతి నిలిపివేస్తున్నట్లు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. కార్యకర్తలు కరోనా వైరస్‌ పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఏదైనా సమాచారం ఉంటే వాట్సాప్‌, ఫోన్ల ద్వారా అందించాలని సూచించారు. కార్యాలయ సిబ్బంది కూడా ఇంటి నుంచే పని చేయాలని ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. ప్రజా శ్రేయస్సు కోసం తెదేపా ఎప్పుడూ ప్రజలతో మమేకమవుతుందని చంద్రబాబు చెప్పారు.

* తెలంగాణ సీఎం కేసీఆర్‌ రేపు కరీంనగర్‌లో పర్యటించనున్నారు. ఇటీవల కరీంనగర్‌లో ఇండోనేషియా నుంచి వచ్చిన బృందం పర్యటించింది. వారిలో కొందరికి కరోనా వైరస్‌ సోకినట్లు తేలడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరీంనగర్‌లో యుద్ధ ప్రాతిపదికన కరోనా వ్యాప్తి నిరోధక చర్యలు చేపట్టింది. అక్కడి పరిస్థితిని సీఎం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పలు సూచనలు చేశారు. ఈ క్రమంలో కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలపై కరీంనగర్‌లో సమీక్ష నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. ఈ నేపథ్యంలో రేపు ఆయన అక్కడ పర్యటించి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.

* మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో శుక్రవారం బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఆ రాష్ట్ర రాజకీయాలు ఉత్కంఠగా మారాయి. మధ్యాహ్నం 2గంటలకు శాసనసభలో బలపరీక్ష జరగనుంది. ఇప్పటికే గురువారం సాయంత్రం సీఎం కమల్‌నాథ్‌ మాట్లాడుతూ.. రెబల్‌ ఎమ్మెల్యేలతో రహస్యంగా చర్చలు జరిపినట్లు.. ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని ధీమా వ్యక్తం చేశారు. కానీ రెబల్‌ ఎమ్మెల్యేల్లో మిగిలిన 16 మంది రాజీనామాలు సైతం నిన్న స్పీకర్‌ ఆమోదించడంతో పరిస్థితులు తారుమారయ్యాయి. తాజా పరిస్థితుల ప్రకారం.. బలపరీక్షకు ముందే కమల్‌నాథ్‌ సీఎం పదవి నుంచి వైదొలగే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనిపై సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ను ప్రశ్నించగా.. కొద్దిసేపు ఓపిక పట్టండి.. సీఎం విలేకరుల సమావేశం నిర్వహిస్తారంటూ సమాధానం ఇచ్చారు.

* కరోనా వైరస్‌ విషయంలో ప్రజలు సమాయత్తం కాకుంటే ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా విజయవంతం కాలేమని తెలంగాణ వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. కోఠిలోని కమాండ్‌ కంట్రోల్‌ రూంలో వైద్యఆరోగ్య శాఖ అధికారులు, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ) సహా వివిధ వైద్య సంఘాల ప్రతినిధులతో మంత్రి సమీక్షించారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన మరిన్ని చర్యలపై ప్రధానంగా చర్చించారు. ఇప్పటివరకు నమోదైన 18 పాజిటివ్‌ కేసుల్లో ఎవరికీ ప్రాణాపాయం లేదని ఈటల స్పష్టం చేశారు. ఇలాంటి అత్యయిక పరిస్థితులు ఉత్పన్నమైన సమయంలో వైద్యులు, సదుపాయాలు ఎన్ని అందుబాటులో ఉన్నా ప్రజలు అర్థం చేసుకొని నివారణ చర్యలు ఆచరించకపోతే పరిణామాలు మరింత తీవ్రంగా ఉంటాయని ఈటల హెచ్చరించారు.

* కరోనా ప్రభావం నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా మార్చి 31వరకు విద్యాసంస్థలు, థియేటర్లు, మాల్స్‌, పెద్ద ప్రార్థనా మందిరాల మూసివేత కొనసాగుతుందని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. ఆ తర్వాత పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణలో భాగంగా తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. నిత్యావసర వస్తువుల కోసం ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. కరోనా సాకుతో నిత్యావసరాల ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కలెక్టర్‌ కన్వీనర్‌గా జిల్లాస్థాయిలో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తామన్నారు. సామాజిక దూరం అమలుపై తప్పనిసరిగా పర్యవేక్షణ చేయాలని అధికారులకు ఆయన సూచించారు.

* తెలంగాణ సీఎం కేసీఆర్‌ రేపు కరీంనగర్‌లో పర్యటించనున్నారు. ఇటీవల కరీంనగర్‌లో ఇండోనేషియా నుంచి వచ్చిన బృందం పర్యటించింది. వారిలో కొందరికి కరోనా వైరస్‌ సోకినట్లు తేలడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరీంనగర్‌లో యుద్ధ ప్రాతిపదికన కరోనా వ్యాప్తి నిరోధక చర్యలు చేపట్టింది. అక్కడి పరిస్థితిని సీఎం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పలు సూచనలు చేశారు. ఈ క్రమంలో కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలపై కరీంనగర్‌లో సమీక్ష నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. ఈ నేపథ్యంలో రేపు ఆయన అక్కడ పర్యటించి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.

* కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించే క్రమంలో వైద్య నిపుణులు సూచించిన అన్ని ముందు జాగ్రత్త చర్యలను పాటించాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్ర ప్రజలకు సూచించారు. ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు తమ నివాసాల్లోనే ఉండాలని.. అనవసరమైన ప్రయాణాలను విరమించుకోవాలని గవర్నర్‌ సూచించారు. జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు కలిగిన వ్యక్తులెవరైనా తమ చేతులను తరచుగా శుభ్రం చేసుకోవాలని, అదేవిధంగా ముసుగుతో ముఖాన్ని కప్పి ఉంచుకోవాలని పేర్కొన్నారు. ప్రధాని పిలుపు మేరకు ఆదివారం ‘జనతా కర్ఫ్యూ’కు సిద్ధంగా ఉండాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు.

* ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే అతలాకుతలం చేస్తూ మానవాళి మనుగడకే సవాల్‌ విసురుతోంది కొవిడ్‌-19. బలహీనులమని భయపడుతున్న మనకిప్పుడు ఓ బలం అవసరం. అదే సంకల్పం, సంయమనం. ఇక స్వీయ నిర్బంధం ఇప్పుడు చేయాల్సిన మొదటి రిపేరు. ప్రధాని మోదీ సూచించిన ప్రజల చేత ప్రజల కోసం ప్రజలే చేయాల్సిన ‘జనతా కర్ఫ్యూ’ వెనుక శాస్త్రీయత చాలానే ఉందంటున్నారు నిపుణులు. మున్ముందు తీసుకోబోయే చర్యలకూ ఇదో మేలి మలుపని అంటున్నారు. ఇటలీలోనైతే మరణ మృదంగమే మోగుతోంది. వైరస్‌ పుట్టిన చైనాలో కన్నా ఎక్కువ మరణాలు అక్కడ నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది.

* ప్రపంచంలో అత్యంత ఘోరమైన నేరాల్లో ఒకటైన నిర్భయ కేసులో ఎట్టకేలకు దోషులకు శిక్ష అమలైంది. దోషులైన ముకేశ్‌ సింగ్‌, పవన్‌ గుప్త, వినయ్‌ శర్మ, అక్షయ్‌ ఠాకూర్‌ను తిహాడ్‌ జైలులో ఈరోజు ఉదయం 5:30గంటలకు ఉరి తీశారు. ఇలా నలుగురికీ ఒకేసారి మరణ దండన విధించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. దీంతో ఉరిశిక్ష సమంజసమేనా.. కాదా.. అన్న చర్చ మరోసారి తెరపైకి వచ్చింది.

* కరోనా వైరస్‌ దేశంలో వేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ఠ చర్యలు చేపడుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రాత్రి జాతినుద్దేశించి మాట్లాడుతూ.. కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఈ నెల 22న ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటలకు వరకూ అందరూ ఇంట్లోనే ఉండి స్వచ్ఛందంగా ‘జనతా కర్ఫ్యూ’ను పాటించాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పలువురు బాలీవుడ్‌ సెలబ్రిటీలు ‘జనతా కర్ఫ్యూ’కు మద్దతుగా స్పందిస్తున్నారు.

* దాదాపు నాలుగు రోజుల పతనాల తర్వాత దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు భారీ లాభాల్లో ట్రేడింగ్‌ను ముగించాయి. సెన్సెక్స్‌ 1,627.73 పాయింట్లు లాభపడి 29,915 వద్ద ముగిసింది. నిఫ్టీ 482 పాయింట్లు లాభపడి 8,745.45 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 75.04 వద్ద కొనసాగుతోంది. కొవిడ్ -‌19కు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం సీరియస్‌గా చర్యలు చేపట్టడం, టెక్నికల్‌ సపోర్ట్‌, అమెరికా మార్కెట్లు సానుకూలంగా ఉండటం వంటి కారణాలతో సూచీలు ర్యాలీ తీశాయి.

* కరోనా వ్యాప్తి నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబయి సహా మరికొన్ని నగరాల్లో దుకాణాలు, కార్యాలయాలు పూర్తిగా మూసివేయాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలు సైతం 25 శాతం మంది ఉద్యోగులతో పనిచేయనున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని ప్రముఖ నగరాలైన పుణె, నాగ్‌పూర్‌కూ ఈ ఆదేశాలు వర్తించనున్నాయి. మార్చి 31 వరకు ప్రతి ఒక్కరూ ఈ ఆదేశాల్ని పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. నిత్యావసర వస్తువులు అమ్మే దుకాణాలు, అత్యవసర సేవలకు మాత్రం దీని నుంచి మినహాయింపునిచ్చారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని సూచించారు.

* దక్షిణాది కథానాయిక అమలాపాల్‌ తన ప్రియుడు భవిందర్ సింగ్‌ను వివాహం చేసుకున్నారు. పెళ్లిలో తీసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ పలువురు అభిమానులు ఈ ఫొటోలను షేర్‌ చేస్తున్నారు. దర్శకుడు ఎ.ఎల్‌ విజయ్‌తో విడాకుల తర్వాత తన జీవితంలోకి ఓ వ్యక్తి వచ్చాడని అమలాపాల్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ఆయన ఎవరో మాత్రం వెల్లడించలేదు.