NRI-NRT

సిలికానాంధ్ర సంజీవినిలో కొరోనా ఐసోలేషన్ వార్డు ప్రారంభం

Isolation Ward Inaugurated At SiliocnAndhra Sanjeevini

Government of Andhra Pradesh requested to use Ravi Prakash SiliconAndhra Sanjivani Hospital in Kuchipudi for isolation and treatment of Corona positive or suspected patients. The officials said that ours is the best facility in a rural area in the entire state of Andhra Pradesh.

ఈరోజు పామర్రు నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ మొవ్వ మండలం కూచిపూడి గ్రామంలో సిలికానాంధ్ర సంజీవని హాస్పటల్లో ఐసోలేషన్ వార్డ్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచాన్ని గడగడ వణికిస్తున్న కరోనా వైరస్ పట్ల మనమందరం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు ఈ నెల 31 వరకు అందరం ఇళ్లకే పరిమితం అవ్వాలని చెప్పారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజలందరూ ఇళ్లకే పరిమితం అవ్వాలని,24 గంటలు వైద్య బృందం అందుబాటులో ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, అధికారులు, హాస్పటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.