Kids

పిల్లలను ప్రశాంతంగా ఐస్‌క్రీం తిననివ్వండి…కరోనా రాదు!

COVID19 Does Not Spread Through Ice Cream

కరోనా వైరస్‌ వ్యాప్తి గురించిన బోలెడన్ని అవాస్తవ సందేశాలు సామాజిక మాధ్యమాల్లో సంచరిస్తూనే ఉన్నాయి. వాటిలో ఐస్‌క్రీమ్‌ తినడం వల్ల కరోనా సోకుతుందనే సందేశం ఒకటి! నిజం ఏంటంటే…. కరోనా వ్యాప్తి గురించిన అవాస్తవ సమాచారాలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ, అసలైన నిజాలను వెల్లడించే ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ఓ సందేశాన్ని అర్థం లేనిదని కొట్టిపారేసింది. ఐస్‌క్రీమ్‌, చల్లని పదార్థాలు తినడం వల్ల కరోనా తేలికగా సోకుతుందనే అపోహలను విస్తరిస్తున్న సామాజిక సందేశం అవాస్తవమని, అలాంటి అపోహలను నమ్మవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని సమర్థించే ఆధారాలు ఎక్కడా లేవని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.