Movies

భారతీయ థియేటర్ కళకు ఆద్యుడు…పృధ్వీరాజ్ కపూర్

Remembering the legacy of prudhvi raj kapoor

పృథ్వీరాజ్‌ కపూర్‌.. భారతీయ థియేటర్‌ ఆద్యుడుగా, బాలీవుడ్‌లో పేరొందిన కళాకారుడుగా కీర్తిగడించిన వాడు. కపూర్‌ వంశ పితామహుడు. 1906 నవంబర్‌ 3న పాకిస్థాన్‌లోని లయల్‌పూర్‌ వద్ద ఉన్న సముంద్రిలో జన్మించాడు. భారతీయ మొదటి టాకీ సినిమా ‘ఆలం ఆరా’ (1931) చిత్రంతో వెండితెరపై మెరిశాడు. వీరి వంశంలోని ఐదు తరాలు సినిమా రంగంలో నటించాయి. పృథ్వీరాజ్‌ కపూర్‌ నటించిన చిత్రాల్లో ‘ఆలం ఆరా’, ‘విద్యాపతి’, ‘సికిందర్‌’, ‘ఆవారా’, ‘ఆనంద్‌ మఠ్‌’, ‘పర్దేశీ’, ‘మొఘల్‌ ఎ ఆజం’ ‘కల్‌ ఆజ్‌ ఔర్‌ కల్‌’ తదితర చిత్రాలు పృథ్వీరాజ్‌ కపూర్‌ కెరీర్‌లో ఆణిముత్యాలుగా నిలిచాయి. వీరు చిత్ర సీమకు చేసిన సేవలకు గానూ భారత ప్రభుత్వం నుంచి 1949లో రాష్ట్రపతి మెడల్, 1969లో పద్మభూషన్‌ పురస్కారం, 1972లో దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డులు అందుకున్నారు. 29 మే 1972లో తుదిశ్వాస విడిచారు.