DailyDose

ఏపీలో కొత్తగా 425 కరోనా కేసులు-TNI బులెటిన్

ఏపీలో 425 కరోనా కేసులు-TNI బులెటిన్

* కరోనా పరీక్షల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా కీలక సమాచారం మీడియా బులెటిన్‌లో ఉండాలని సూచించింది. వైద్యులకు పీపీఈ కిట్లు, మాస్కులు, రక్షణ పరికరాలు ఇవ్వడం లేదంటూ దాఖలైన పిటిషన్‌పై బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం మరోసారి ఇవాళ కూడా విచారణ నిర్వహించింది. దీనికి రాష్ట్ర పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు, గాంధీ సూపరింటెండెంట్‌ రాజారావు హాజరయ్యారు. 

* ఈ రోజు జిల్లాలో 30 కరోనా పాజిటివ్ కేసులు నమోదు…విజయవాడ నగరంలో 22 కరోనా పాజిటివ్ కేసులు నమోదు..జిల్లా లోని వివిధ ప్రాంతాల్లో 6, క్వెరంటెన్ లో 2 కేసులు నమోదు..విజయవాడ లో కృష్ణలంక లో 3, ఊర్మిళ నగర్ లో 2, వైఎస్సార్ కాలనీ లో 2, గొల్లపూడి లో 2, కొత్తపేటలో 3, న్యూ అర్ అర్ అర్ పేట లో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదు..జిల్లాలోని మచిలీపట్నంలో 2, ఉయ్యూరులో 2, ఉతుకురులో 2, క్వారంటెన్ లో ఉన్నవారిలో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.

* కరోనా వైరస్ కారణంగా.. పట్టణాల నుంచి స్వస్థలాలకు చేరి ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న వలస కూలీలే లక్ష్యంగా కేంద్రం నూతన పథకాన్ని ప్రారంభించనుంది. గ్రామీణ భారతంలో జీవనోపాధి అవకాశాలను మెరుగుపరిచే ఉద్దేశంతో రూపొందించిన గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ అభియాన్ కార్యక్రమాన్ని జూన్ 20 వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించనున్నారు.

కరోనా మహమ్మారిని నిరోధించేందుకు సిద్ధం చేసిన కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ ప్రయోగ పరీక్షలను ప్రారంభించనున్నట్లు రష్యా ఆరోగ్య శాఖ బుధవారం తెలిపింది. మాస్కోకు చెందిన గమలేయ పరిశోధన సంస్థ అభివృద్ధి చేసిన రెండు రకాల టీకాలు(లిక్విడ్‌ అండ్‌ పౌడర్‌)ను రెండు గ్రూపులుగా విభజించి 38 మంది చొప్పున వాలంటీర్లపై ప్రయోగించనున్నట్లు పేర్కొంది.

* ఉత్తర్‌ ప్రదేశ్‌లో గత 24 గంటల్లో 630 కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 5,659కి పెరిగింది. ఇప్పటివరకు 9,638 మంది రికవరీ అవ్వగా, 488 మంది చనిపోయారు.

* హిమాచల్‌ ప్రదేశ్‌లో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 586 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో 368 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఆరుగురు మృతి చెందారు.

* ఉత్తరాఖండ్‌లో ఈ రోజు మధ్యాహ్నం 2.30 వరకు కొత్తగా 57 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధరణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,079కి చేరింది.

* అసోంలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 82 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,777కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,111 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 2654 మంది డిశ్ఛార్జి అయ్యారు. ఇప్పటివరకు తొమ్మిది మంది చనిపోయారు.

* కరోనా మహమ్మారిని నిరోధించేందుకు సిద్ధం చేసిన కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ ప్రయోగ పరీక్షలను ప్రారంభించనున్నట్లు రష్యా ఆరోగ్య శాఖ బుధవారం తెలిపింది. మాస్కోకు చెందిన గమలేయ పరిశోధన సంస్థ అభివృద్ధి చేసిన రెండు రకాల టీకాలు(లిక్విడ్‌ అండ్‌ పౌడర్‌)ను రెండు గ్రూపులుగా విభజించి 38 మంది చొప్పున వాలంటీర్లపై ప్రయోగించనున్నట్లు పేర్కొంది.

* ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 425 కరోనా కేసులు.. రెండు మరణాలు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రానికి సంబంధించినవి 299 కేసులు కాగా.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 126 మందికి కరోనా నిర్ధరణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 7,496కి చేరింది. మొత్తం 13,923 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 92గా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.