Agriculture

రెండు నెలలు అధిక వర్షాలు

రెండు నెలలు అధిక వర్షాలు

ఆగ‌స్టు, సెప్టెంబ‌ర్‌లో అధిక వ‌ర్షాలు కుర‌వ‌నున్నాయి. ఈ విష‌యాన్ని భార‌తీయ వాతావ‌ర‌ణ‌శాఖ చెప్పింది.

రుతుప‌వ‌నాల వ‌ల్ల సెప్టెంబ‌ర్‌లోనూ 104 శాతం అధిక వ‌ర్షం కురిసే ఛాన్సు ఉంద‌ని అధికారులు చెప్పారు. 

జూలై 30 వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా 44.7 శాతం వ‌ర్షాలు కురిసిన‌ట్లు ఐఎండీ వెల్ల‌డించింది.

స‌మృద్ధిగా వ‌ర్షాలు కుర‌వ‌డం వ‌ల్లే.. రైతులు అధిక స్థాయిలో విత్త‌నాలు నాటిన‌ట్లు అంచ‌నా వేస్తున్నారు.

వ‌ర్షాకాలం రెండ‌వ అర్థ‌భాగంలో కావాల్సినంత వ‌ర్షాలు కుర‌వ‌నున్న‌ట్లు ఐఎండీ శుక్ర‌వారం తెలిపింది. 

సెప్టెంబ‌ర్‌లో సుమారు 20 శాతం వ‌ర్షాలు అధికంగా కుర‌వ‌నున్న‌ట్లు ఐఎండీ అంచ‌నా వేసింది.

జూలైలో ఆశించినంత‌గా వ‌ర్షాలు కుర‌వ‌కున్నా.. సెప్టెంబ‌ర్‌లో అధిక వ‌ర్షాలు ప‌డే ఛాన్సు ఉంద‌ని ఐఎండీ డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ మృత్యుంజ‌య మ‌హాపాత్ర తెలిపారు.