Fashion

హెన్నా పొడితో నెయిల్ పాలిష్

చేతి వేళ్లు ఎంత అందంగా ఉన్నా నెయిల్‌పాలిష్ పెడితే ఆ లుక్కే వేరు. నెయిల్‌పాలిష్ వాడ‌కూడ‌దు అందులో కెమిక‌ల్స్ క‌లుపుతారు. వేళ్ల‌ను నోటిలో పెట్టుకున్న‌ప్పుడు రంగు క‌డుపులో చేరిపోతుంద‌ని హెచ్చ‌రిస్తుంటారు. అలాంట‌ప్పుడు కుడిచేతికి పెట్టుకోకుండా ఎడ‌మ‌చేతికి అయినా నెయిల్‌పాలిష్ పెట్టుకొని సంబ‌ర‌ప‌డిపోతుంటారు మ‌హిళ‌లు. మ‌రి కెమిక‌ల్స్ లేకుండా మీరే త‌యారు చేసుకోవ‌చ్చు క‌దా. హా.. అలా ఎలా త‌యారు చేసుకుంటారు అనుకుంటున్నారా? నెయిల్‌పాలిష్‌ను కూడా ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకోండి.

కావాల్సిన‌ పదార్థాలు :

హెన్నా పౌడర్ లేదా మెహందీ : 1 టీస్పూన్

బెల్లం : 50 గ్రా.

లవంగాలు – 20 గ్రాములు

త‌యారీ :
ముందుగా బెల్లాన్ని పొడిగా చేసుకోవాలి. త‌ర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో బెల్లం పౌడ‌ర్‌ను వేయాలి. పౌడ‌ర్ మ‌ధ్య‌లో కొంచెం గ్యాప్ ఉంచి అందులో ల‌వంగాల‌ను పెట్టాలి. ఈ బౌల్ మీద మ‌రొక బౌల్‌తో క‌ప్పి ఉంచి స్ట‌వ్ మీద పెట్టి వేడి చేయాలి. వేడి త‌గిలిన త‌ర్వాత బెల్లం కొంచెం క‌రుగుతుంది. ఆవిరి బ‌య‌ట‌కు వ‌స్తుంటుంది. ఇలా మొత్తం బెల్లం ఆవిరికి క‌రిగిపోతుంది. క‌రిగిన త‌ర్వాత ఇందులో హెన్నా పౌడ‌ర్‌ను క‌లుపాలి. ఈ మిశ్ర‌మం చ‌ల్లారిన త‌ర్వాత‌ గోర్ల‌కు అప్లై చేసుకోవ‌చ్చు. కాట‌న్ బాల్ ఉప‌యోగించి అచ్చం నెయిల్‌పాలిష్ ఎలా అయితే పెట్టుకుంటాయో అలానే పెట్టుకోవ‌చ్చు. ఈ నెయిల్‌పాలిష్ చాలారోజుల‌పాటు ఉంటుంది. అలానే దీనివ‌ల్ల ఎలాంటి అనారోగ్యాల‌కు గుర‌వ్వ‌రు.