DailyDose

పరువు హత్య చేసింది మేనమామే-నేరవార్తలు

పరువు హత్య చేసింది మేనమామే-నేరవార్తలు

* జ‌మ్ముక‌శ్మీర్‌లో సీఆర్‌పీఎఫ్ జ‌వాన్లు, ఉగ్ర‌వాదుల మ‌ధ్య ఎదురుకాల్పులు కొన‌సాగుతున్నాయి.ద‌క్షిణ క‌శ్మీర్‌లోని షోపియాన్‌లో ఉన్న మినీ సెక్ర‌టేరియ‌ట్ ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్ గ‌స్తీ బృందంపై ఉగ్ర‌వాదులు దాడిచేశారు.దీంతో అప్ర‌మ‌త్త‌మైన జ‌వాన్లు మినీ సెక్ర‌టేరియ‌ట్ ప్రాంతాన్ని జ‌వాన్లు చుట్టుముట్టాయి.ఆ ప్రాంతంలో గాలింపు ముమ్మ‌రం చేశారు. అద‌న‌పు బ‌ల‌గాల‌ను ఆ ప్రాంతానికి త‌ర‌లిస్తున్నారు. 

* వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం వై.శాఖాపూర్ గ్రామంలో ఆస్తుల తగాదాలలో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు పెద్దగా మారి పరశురాముడు(32) అనే వ్యక్తి… శాంతన్న(55), రామకృష్ణ (24)ఇద్దరి పై దాడి చేయగా వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా ఇద్దరు మృతి చెందినట్లు సి రాఘవేంద్ర రెడ్డి తెలియజేశారు.

* మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు కామెంట్స్…నిన్న గచ్చిబౌలి పీయస్ ల కిడ్నాప్ కేసు నమోదు చేశాం…చందానగర్ తారానగర్ లో అవంతి రెడ్డి, హేమంత్ కుమార్ లు ఉండేవారు..అవంతి రెడ్డి బీటెక్ చదవగా, హేమంత్ డిగ్రీ కంప్లీట్ చేసి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాడు…ఇద్దరూ నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు..జూన్ నెల 11 వ తేదీన పెద్దలను కాదని పెళ్లి చేసుకున్నారు..కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు లో మ్యారేజ్ చేసుకున్నారు..చందానగర్ పోలీసులు అమ్మాయి, అబ్బాయి తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు…కౌన్సిలింగ్ అయిన తర్వాత హేమంత్, అవంతి రెడ్డి లు గచ్చిబౌలి లోని టీఎన్జీవో కాలనీలో నివాసం ఉంటున్నారు…నిన్న మీతో మాట్లాడలంటు గచ్చిబౌలి లోని హేమంత్ నివాసానికి వచ్చిన అవంతిక కుంటుంబ సభ్యులు…మూడు కార్ల లో అవంతిక ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు…చందానగర్ కీ వెల్లాలని వారిని కారులో తీసుకేళ్లుతుండగా అనుమానం రావడంతో తప్పించుకునెందుకు ప్రయత్నంచిన అవంతిక, హేమంత్…కారులో నుంచి తప్పించుకుని అత్తమామలకు ఫోన్ చేసిన అవంతిక…మరో కారులో హేమంత్ తీసుకుని పోయిన అవంతిక మేనమామ యుగంధర్ రెడ్డి, మరికొందరు…హేమంత్ తల్లిదండ్రులు చందానగర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే అప్రమత్తం అయిన గచ్చిబౌలి పోలీసులు…గోపన్ పల్లిలో నిన్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్న గచ్చిబౌలి పోలీసులు…అర్ధరాత్రి అవంతిక మేనమామ యుగందర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా హేమంత్ ను సంగారెడ్డి లో హత్య చేసి పడేసిన్నట్లు ఒప్పుకున్నాడు..మొత్తం 13 మందిని అదుపులోకి తీసుకున్నాం… మరోకరు పరారిలో ఉన్నారు.

* నగరంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ వ్యవసాయ, కార్మిక సంఘాలు, వివిధ పక్షాలకు చెందిన నేతలు నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంవర్‌రోడ్‌లో ప్రదర్శనగా వస్తున్న రామకృష్ణ, మధు, నారాయణ, మాజీ మంత్రి వడ్డేలను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తాము శాంతియుతంగా నిరసన తెలుపుతున్నప్పటికీ తమను అరెస్ట్ చేయడం అన్యాయమని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

* ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టి ఏసీబీకి చిక్కిన మల్కాజిగిరి ఏసీపీ నరసింహారెడ్డిపై వేటు పడింది.అతడిని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ డీజీపీ మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.నరసింహారెడ్డి స్థానంలో మల్కాజిగిరి ఏసీపీగా మాదాపూర్‌ ఏసీపీ శ్యాంప్రసాదరావును నియమించారు.ఇంటెలిజెన్స్‌లో డీఎస్పీగా పనిచేస్తున్న రఘునందన్‌రావును మాదాపూర్‌ ఏసీపీగా నిమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.ఏసీబీ కేసులో ఇప్పటికే అరెస్టయిన నరసింహారెడ్డిని ప్రభుత్వం సస్పెండ్‌ చేసే అవకాశముంది.దాదాపు 25 ప్రాంతాల్లో ఏసీబీ ఏకకాలంలో సోదాలు నిర్వహించి ఏసీపీ నరసింహారెడ్డి అక్రమాస్తులను గుర్తించింది.