DailyDose

అంతర్రాష్ట్ర గంజాయి ముఠా పట్టివేత-నేరవార్తలు

అంతర్రాష్ట్ర గంజాయి ముథా పట్టివేత-నేరవార్తలు

* బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో సీబీఐ విచార‌ణ ఇంకా కొన‌సాగుతున్న‌ద‌ని కేంద్ర హోంశాఖ స‌హాయ‌మంత్రి కిష‌న్‌ రెడ్డి తెలిపారు. 

* ఎమ్యెల్సీలు శివనాథరెడ్డి, పోతుల సునీత లపై పార్టీ ఫిరాయింపుల క్రింద అనర్హత వేటు వేయాలని మండలి ఛైర్మన్ షరీఫ్ ను కలిసి కోరిన టిడిపి ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న.

* కర్నూలు జిల్లా నంద్యాల లో ఘోరం…ఆల్రెడీ చనిపోయిన వ్యక్తికి ట్రీట్ మెంట్.నంద్యాల ప్రైవేట్ ఆస్పత్రిలో ఠాగూర్ సినిమా స్టోరీ అల్లిన డాక్టర్లుకాలు ఆపరేషన్ కోసం హాస్పిటల్లో చేరిన నాగరాజుచనిపోయిన వ్యక్తికి సన్ రైజ్ హాస్పిటల్ లో చికిత్స..చనిపోయిన వ్యక్తికి చికిత్స ఆనందిస్తూ డబ్బులు గుంజిన సన్ రైజ్ హాస్పిటల్ డాక్టర్లు…గత రెండు రోజుల నుంచి చని పోయిన నాగరాజుకు హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్న డాక్టర్లులబోదిబోమంటున్న బాధితులు..నంద్యాల టూ టౌన్ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదుస్టేషన్ వద్ద బాధితుల ఆందోళన..

* ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలో జరిగిన శిరోముండనం ఘటన మరవకముందే మరో ఘటన చోటుచేసుకుంది.పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో తీసుకున్న అప్పు తీర్చలేదంటూ ఓ యువకుడిని కారులో బలవంతగా తీసుకెళ్లి శిరోముండనం చేసిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది.జంగారెడ్డిగూడెం ఎస్సై కుటుంబరావు తెలిపిన వివరాల ప్రకారం….జిల్లాలోని తాడేపల్లిగూడేనికి చెందిన అలక అభిలాష్‌(23) జంగారెడ్డిగూడేనికి చెందిన యర్రసాని విజయ్‌బాబు వద్ద మూడు నెలల క్రితం రూ.30 వేలు అప్పుగా తీసుకున్నాడు.

* ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌ బాధిత కుటుంబాన్ని కలిసి పరామర్శించిన ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్‌) నేత సంజయ్‌ సింగ్‌పై ఒక వ్యక్తి ఇంకు చల్లాడు. దీంతో అక్కడ కొంత సేపు కలకలం రేగింది.

* అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు.రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ వివరాలను మీడియాకు వివరించారు.వారణాసికి చెందిన ప్రధాన నిందితుడు వివేక్‌ అలియాస్‌ అలోక్‌గా గుర్తించినట్లు తెలిపారు.అతనికి ఒడిశాకు చెందిన మహదేవ్‌, హర్యానాకు చెందిన కంటైనర్‌ ఓనర్‌ ఇమ్రాన్‌ సహకరిస్తున్నారని పేర్కొన్నారు.వివేక్‌, ఇమ్రాన్‌ కుమ్మక్కై.. మహ్మద్‌ రంజాన్‌, శశికాంత్‌ గౌతమ్‌రావు లారీ డ్రైవర్‌, క్లీనర్లుగా నియమించుకొని గంజాయిని హైదరాబాద్‌ మీదుగా ఉత్తరప్రదేశ్‌, హర్యానకు తరలిస్తున్నారని పేర్కొన్నారు.కంటైనర్‌ నుంచి 1010 కిలోల గంజాయితో పాటు రూ.నాలుగు వేల నగదు, రెండు మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.పట్టుకున్న గంజాయి విలువై రూ.1.30 కోట్ల విలువ ఉంటుందని పేర్కొన్నారు.