Movies

ఆమె ఇష్టం అది

బాలీవుడ్‌ నటి శ్రద్ధాకపూర్‌ త్వరలోనే ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టనున్నారని గతకొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. తన చిన్ననాటి స్నేహితుడు, ప్రముఖ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్‌ రోహన్‌ శ్రేష్ఠాతో ఆమె ప్రేమలో ఉన్నారని బీటౌన్‌లో టాక్‌. ఈ నేపథ్యంలో వీరిద్దరూ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. సదరు వార్తలపై తాజాగా శ్రద్ధాకపూర్‌ తండ్రి శక్తికపూర్‌ స్పందించారు. రోహన్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు శ్రద్ధా ఇప్పటి వరకూ తనతో చెప్పలేదని.. పెళ్లి విషయంలో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాను అభ్యంతరం చెప్పనని అన్నారు.