NRI-NRT

ఒమన్ ప్రవాసులకు కొత్త నిబంధనలు

Oman Imposes New Travel Restrictions - Oman Telugu NRI NRT News

గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో గల్ఫ్ దేశం ఒమన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఒమన్ వచ్చే ట్రావెలర్స్‌కు కొత్త రూల్ తీసుకొచ్చింది అక్కడి సర్కార్. 7 రోజుల ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ తప్పనిసరి చేసింది. అది కూడా ప్రయాణికులు తమ సొంత ఖర్చులతో ఈ ఏడు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలి. దీనికోసం ముందుగానే హోటల్ రూమ్ బుక్ చేసుకున్నాకే దేశంలో అడుగు పెట్టాలని సంబంధిత అధికారులు ప్రయాణికులకు తెలియజేశారు. ఈ మేరకు ఒమన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ.. విమానయాన సంస్థలకు ప్రత్యేక సర్క్యూలర్ జారీ చేసింది. టికెట్ బుక్ చేసేటప్పుడు ప్రయాణికులు ముందే 7 రోజుల హోటల్ రిజర్వేషన్ కలిగి ఉంటేనే వారిని విమానం ఎక్కేందుకు అనుమతి ఇవ్వాలని పేర్కొంది. అలాగే ప్రయాణికులు ఈ ఏడు రోజుల్లో రెండుసార్లు పీసీఆర్ టెస్టు చేయించుకోవడం తప్పనిసరి అని సుప్రీం కమిటీ వెల్లడించింది. వీటికి అయ్యే ఖర్చులను కూడా ప్రయాణికులే భరించాలని పేర్కొంది.