NRI-NRT

ఒమాన్‌లో కేసీఆర్ జన్మదిన వేడుకలు

ఒమాన్‌లో కేసీఆర్ జన్మదిన వేడుకలు

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన మరియు కోటివృక్షార్చన కార్యక్రమాన్ని ఒమాన్ ఎన్నారై తెరాస ఆధ్వర్యంలో నిర్వహించారు. టీఆరెస్ ఎన్నారై ఒమాన్ శాఖ అధ్యక్షుడు మహిపల్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ సారథ్యంలో తెలంగాణాకు ప్రపంచ ఖ్యాతి లభించిందని అన్నారు. రాష్ట్రాన్ని దేశంలోనే వ్యవసాయంలో అగ్రగామిగా నిలిపారాని కొనియాడారు. ఉపాధ్యక్షుడు షేక్ అహ్మద్, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, వీరేందర్, అజయ్,లక్ష్మణ్, జాగృతి నాయకులు మమత, సుజన తదితరులు పాల్గొన్నారు.