DailyDose

పోలీసులకు చుక్కలు చూపించిన కూకట్‌పల్లి న్యాయవాది-నేరవార్తలు

పోలీసులకు చుక్కలు చూపించిన కూకట్‌పల్లి న్యాయవాది-నేరవార్తలు

* ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను అరెస్ట్ చేసిన ఖమ్మం రూరల్ పోలీసులు…అంతర్ జిల్లా దొంగల ఇద్దరు పాత నేరస్థులైన భరత్ కుమార్ శర్మ,మహేష్ గా గుర్తించిన పోలీసులు….!! ఖమ్మం రూరల్ మండలం తో పాటు నిజామాబాద్,హైదరాబాద్ కీసర లో పలు దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు అంతర్ జిల్లా దొంగలు… రూ.14 లక్షల విలువచేసే 27 తులాల బంగారం, వెండి రికవరీ చేసిన ఇద్దరు దొంగలను అరెస్టు చేసి రిమాండ్ తరలించిన ఖమ్మం రూరల్ పోలీసులు….ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వివరాలు వెల్లడించిన ఖమ్మం రూరల్ ACP.

* చిత్తూరు జిల్లా, మదనపల్లి నియోజకవర్గం నిమ్మనపల్లి మండలం, బండ్లపై గ్రామం.మదనపల్లి నియోజకవర్గం నిమ్మనపల్లి మండలం, బండ్లపై గ్రామం జాతరలో విషాద సంఘటన…జాతరలో ఆహారం విషతుల్యం కావడంతో వందమంది ఆసుపత్రిపాలు.

* కూకట్‌పల్లి కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న నిఖిలేష్‌ బైకుపై వెళ్తుండగా ట్రాఫిక్‌ పోలీసులు ఆపారు. ఆ బైక్‌పై ₹1635 చలానా పెండింగ్‌ ఉందని, చెల్లించాలని కోరారు. నిరాకరించిన యజమాని వాహనాన్ని పోలీసులు సీజ్‌ చేశారు. ప్రవేశం లేని పైవంతెనపై ప్రయాణించారని, ప్రమాదకర డ్రైవింగ్‌, ఆదేశాల ఉల్లంఘన పేరిట మొత్తంగా ₹1635 జరిమానా చెల్లించాలనడంతో లాయర్‌ అవాక్కయ్యారు. నో ఎంట్రీకి కేవలం రూ.135 జరిమానా వేయాల్సింది ఇంత ఎలా రాశారు? చిర్రెత్తుకొచ్చిన ఆ న్యాయవాది హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేశారు. విచారించిన హైకోర్టు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్ట ప్రకారం వాహనం సీజ్‌ చేయకూడదని పేర్కొంది. తిరిగివ్వాలని ఆదేశించింది.

* గుంటూరు..కొత్త పేట పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించే కానిస్టేబుల్ బాలిక తో అసభ్యప్రవర్తన.ఏ టి అగ్రహారంలో పదవ తరగతి చదివే బాలి క అసభ్య గా ప్రవర్తించాడని దిశ పోలీస్ స్టేషన్లో తల్లి దండ్రులు పిర్యాదు.కానిస్టేబుల్ రమేశ్ పై విచారణ చేసి సస్పెండ్ చేసిన ఎస్పీ అరి ఫ్ హాఫిజ్.చట్టం దృష్టిలో అందరూ సమానులే ఎస్పీ అరి ఫ్ హాఫిజ్.