DailyDose

TNI నేటి తాజా వార్తలు 1-Dec-2021

TNI నేటి తాజా వార్తలు 1-Dec-2021

* తిరుమల

తిరుమల రెండవ ఘాట్ రోడ్డు తాత్కాలికంగా మూసివేత.

లింక్ ఘాట్ రోడ్డు సమీపంలో విరిగి పడ్డ కొండ చరియలు.

కొండచరియలు తొలగించే పనిలో టీటీడీ విజిలెన్స్,ఇంజనీరింగ్,అటవిశాఖధికారులు.

ఓ ఆర్టీసీ బస్సును తృటిలో తప్పిన ప్రమాదం.

భారీగా ట్రాఫిక్ జామ్ ఇబ్బంది పడుతున్న భక్తులు.

ప్రత్యామ్నాయ చర్యల్లో టీటీడీ.

* భద్రాద్రి కొత్తగూడెం.

మావోయిస్టుల వారోత్సవాలు నేపథ్యంలో డిజిపి మహేందర్ రెడ్డి పర్యాటన.

మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో రహస్యంగా చర్ల మండలం చెన్నాపురం లో పర్యటించిన డిజిపి మహేందర్ రెడ్డి.

సారపాక ఐటిసి గెస్ట్ హౌస్ లో భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్‌ ఎస్ పిలతో సమావేశం.

వారోత్సవాలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత పెంచాలి.

సరిహద్దు ప్రాంతాలలో అనుమానితులను, మావోయిస్టు కార్యకలాపాలు కు చెక్ పెట్టేందుకు సూచనలు చేసి డిజిపి.

తెలంగాణ, చత్తీస్‌గఢ్ అంధ్రా సరిహద్దులలో నిఘా పెంచాలంటూ సూచనలు.

మావోయిస్టుల పై ఉక్కుపాదం మోపెందుకు సమీక్షా సమావేశం.

రహస్యంగా సాగుతున్న డిజిపి మహేందర్ రెడ్డి టూర్.

రేపటి నుండి ఈనెల 8 వరకు వారోత్సవాలు.

ఇప్పటికీ ఏజెన్సీ లోకి ఆర్ టిసి బస్సులు నిలిపివేత.

ప్రజాప్రతినిధులు అనుమతులు లేకుండా పర్యటించోద్దంటూ పోలీసులు సూచనలు.

ఏజెన్సీ లో హై ఆలర్ట్.

* బాధను ఎలా వ్యక్తపరచాలో మాటలు రావడం లేదు: జూ.ఎన్టీఆర్

హైదరాబాద్: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి నటుడు జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పించారు. ఫిలింఛాంబర్‌లో సిరివెన్నెల పార్ధివదేహాన్ని సందర్శించి అంజలి ఘటించారు. అనంతరం జూ.ఎన్టీఆర్ మాట్లాడుతూ. బాధను ఎలా వ్యక్తపరచాలో కూడా మాటలు రావడం లేదని. అలాంటి మాటలను వర్ణించడంలో కూడా ఆయనే అని తెలిపారు. తెలుగు జాతి, భాష బతికున్నంత కాలం ఆయన సాహిత్యం బతికి ఉంటుందన్నారు. తెలుగు చలన చిత్రసీమకు ఆయన ఆశీస్సులు ఉండాలని అన్నారు. ఆయన పాటలు రాబోయే తరాలకు బంగారు బాటలని చెప్పారు. సిరివెన్నెల సీతారామాశాస్త్రి ఆత్మకు శాంతి కలగాలని జూనియర్ ఎన్టీఆర్ ఆకాంక్షించారు.

* ఏపీ కంటే తెలంగాణ నుంచే ఎక్కువ ధాన్యం సేకరించాం: పార్లమెంటులో కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్ వివరణ లోక్ సభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం ధాన్యం సేకరణపై ప్రశ్నించిన టీఆర్ఎస్ ఎంపీలు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చిన కేంద్ర మంత్రి తెలంగాణ ఖరీఫ్ సీజన్ టార్గెట్ ఇప్పటికే నిర్ణయమైపోయిందని వెల్లడి కేంద్ర సహాయమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి లోక్ సభలో నేడు ధాన్యం సేకరణ అంశంపై వివరణ ఇచ్చారు. ఓ ప్రశ్నకు బదులిస్తూ 2020-21లో ఏపీ నుంచి 56.67 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించామని, తెలంగాణ నుంచి 94.53 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించామని వెల్లడించారు. 2019-20లో ఏపీ నుంచి 55.33 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించామని, తెలంగాణ నుంచి 74.54 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించామని తెలిపారు. 2018-19లో ఏపీ నుంచి 48.06 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించామని, తెలంగాణ నుంచి 51.90 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించామని మంత్రి వివరించారు. ఏపీ కంటే తెలంగాణ నుంచే ఎక్కువ బియ్యం సేకరించామని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ఎంపీల ప్రశ్నకు ఆమె ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2020-21 ఖరీఫ్ సీజన్ లో 521.89 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. ఖరీఫ్ లో తెలంగాణ నుంచి 40 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణకు ఇప్పటికే నిర్ణయం జరిగిపోయిందని స్పష్టం చేశారు. యాసంగికి సంబంధించి సీజన్ మొదలయ్యాకే ఎంత సేకరించాలన్న టార్గెట్ నిర్ణయిస్తామని తెలిపారు. 

* ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిలో నిర్వహించిన ప్రపంచ ఎయిడ్స్ డే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు.

ప్రజలను చైతన్యం చేయడం కోసం డిసెంబర్ 1 న ఎయిడ్స్ దినోత్సవంగా జరుపుతున్నారు.

అవగాహన పెరగటం వల్ల 90 శాతం మరణాలు తగ్గాయి.

ఎయిడ్స్ బాధితులను చిన్న చూపడం వద్దు. ఇప్పటికీ వివక్ష చాలా తగ్గింది. ఇంకా తగ్గాలి.

గాలి ద్వారా, ముట్టుకుంటే ఎయిడ్స్ రాదు. అవగాహన పెరగాలి.

తెలంగాణ ఏర్పడక ముందు రాష్ట్రంలో ఎయిడ్స్ శాతం 0.7, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక చేపట్టిన నిరోధక చర్యల వల్ల 0.7 నుండి 0.4 శాతానికి తగ్గింది.

ప్రభుత్వం 167 ఐసీటీసీ కేంద్రాలు నెలకొల్పడం జరిగింది. 22 ప్రభుత్వ ఎ. ఆర్. టి చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేశాం.

ఎయిడ్స్ రోగులకు ప్రభుత్వం ఉచితంగా మందులు అందిస్తోంది.

హెచ్. ఐ. వీ వ్యాధిగ్రస్థులకు నెలకు ఆసరా పెన్షన్ తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నది.

సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఎయిడ్స్‌, షుగర్ వ్యాధిగ్రస్థులకు ప్రత్యేక డయాలసిస్ కేంద్రాలు హైదరాబాద్, వరంగల్ లో ఏర్పాటు చేస్తున్నాం.

ఎయిడ్స్ కంట్రొల్,చికిత్స, అవగాహన కోసం ప్రభుత్వం 50 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నది.

హై రిస్క్ గ్రూప్ వారిని కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం.

ఎయిడ్స్ పై పోరాటంలో స్వచ్ఛంద సంస్థల పాత్రల కీలకమైంది. ప్రభుత్వం, ఎన్జీవోలు, ప్రజలు అందరు కలిసి ఎయిడ్స్ మహమ్మారిని తరిమేయాలి. బాధితులను అందరం కలిసి కాపాడుకోవాలి.

చెస్ట్ ఆసుపత్రి పరిసరాల్లో ఏర్పాటు చేసే 1000 పడకల సూపర్ స్పషాలిటీ ఆసుపత్రికి ముఖ్యమంత్రి త్వరలో శంకుస్థాపన చేస్తారు.

హైదరాబాద్ నలువైపులా నిర్మించే మొత్తం 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు సీఎం త్వరలో శంకుస్థాపన చేస్తారు.

సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించి ప్రజలకు ఉచితంగా కార్పొరేట్ ఆసుపత్రి సేవలు అందించాలన్నదే సీఎం కేసీఆర్ ఆశయం.

ఇక్కడి టిబీ వార్డుల్లో తిరిగి వైద్యులు, రోగులతో మాట్లాడాను. పేషంట్లు వైద్యం, అందిస్తున్న ఆహారం, వసతుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

చెస్ట్ ఆసుపత్రి, ఎర్రగడ్డ పరిసరాల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించే ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి హరీశ్ రావు.

* ఉత్తరాంధ్ర పరిసర జిల్లాలకు తుపాను ముప్పు ముంచుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈనెల 4 నాటికి తుపానుగా మారి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు ఉభయగోదావరి జిల్లాలపై పెను ప్రభావం చూపే అవకాశముంది. డిసెంబర్‌ 3, 4 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతోపాటు.. గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

దక్షిణ ధాయ్‌లాండ్‌ పరిసర ప్రాంతాల్లో మంగళవారం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశలో ప్రయాణించి గురువారం నాటికి వాయుగుండంగా బలపడనుంది. శుక్రవారం (డిసెంబర్‌ 3) బంగాళాఖాతంలో తుపానుగా మారనుంది. తర్వాత ఇది వాయువ్య దిశగా ప్రయాణించి.. మరింత బలపడుతూ నాలుగో తేదీ నాటికి ఉత్తరాంధ్ర – ఒడిశా తీరాలను చేరే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ స్టెల్లా తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు.

* వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర వర్సెస్‌ తెలంగాణ ప్రభుత్వంగా మారిపోయింది పరిస్థితి. యాసంగిలో వరి కొనే పరిస్థితి లేదని కేంద్రం తేల్చేయడంతో.

ప్రత్యామ్నాయ పంటలపై ఫోకస్‌ పెట్టాలని రైతులకు సూచిస్తోంది తెలంగాణ సర్కార్‌. మరోవైపు. ప్రతీ గింజా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. కేంద్రం కొనదు కానీ, రాష్ట్ర నేతలు ఇలా మాట్లాడడం ఏంటి? అంటూ టీఆర్ఎస్‌ మండిపడుతోంది.. ఈ తరుణంలో. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారిపోయాయి. యాసంగిలో రైతులు వరి సాగు చేస్తే మంచి ధరకు కొనుగోలు చేయించే బాధ్యత తనదేనంటూ ప్రకటించారు టీఆర్ఎస్‌ పార్టీకి చెందిన మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు.

మిర్యాలగూడతో పాటు నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో రైతులు యాసంగిలో సన్న ధాన్యం పండిస్తే. మంచి ధరకు మిల్లర్లతో పంటను కొనుగోలు చేయించేలా చూస్తానంటూ భరోసా ఇచ్చారు టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే భాస్కర్‌రావు. ఈ విషయంలో ఎవరు ఏం చెప్పినా అయోమయానికి గురికావాల్సిన అవసరం లేదని సూచించిన ఆయన. వరి సాగు కోసం నాగార్జునసాగర్‌ ఎడమకాల్వకు నీటిని కూడా విడుదల చేయిస్తానని హామీ ఇచ్చారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లపై ఇప్పటికే రైస్‌ మిల్లర్లతో చర్చించామని తెలిపారు. మరోవైపు. మెట్టపంటలు అవకాశం ఉన్న రైతులు మాత్రం ప్రత్యామ్నాయ పంటలు పండించాలని కోరారు ఎమ్మెల్యే. ఇక, కాంగ్రెస్‌, బీజేపీ నేతలపై మండిపడ్డ భాస్కర్‌రావు. ఏనాడై నా రైతులు పొలాల్లో నాట్లు వేయడం, కోతలు కోయడం చూశారా? అంటూ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ఓవైపు ఇప్పటికే మార్కెట్లకు చేరిన పంటను కొనడంలేదని విమర్శలు ఉన్నాయి. కల్లాలు, రోడ్లపై కూడా ఎక్కడపడితే అక్కడ వరి ధాన్యం దర్శనమిస్తోంది. కేంద్ర, రాష్ట్రాల వైఖరితో వరి కొనుగోళ్లలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే భాస్కర్‌రావు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

* ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కి రాయలసీమ వరద బాధితుల సహాయార్థం సౌతాఫ్రికా టీడీపీ అధ్యక్షులు పారా రామకృష్ణ మరియు ఎన్‍ఆర్‍ఐ టీడీపీ కౌన్సిల్ మెంబర్ బండారు వంశీ కృష్ణ రూ.1.25 లక్షలు ఇవ్వడం జరిగింది

ఎన్‍ఆర్‍ఐ టీడీపీ కౌన్సిల్ మెంబర్ శ్యామ్ ప్రసాద్ కోడూరి ఆధ్వర్యంలో ఆయన సతీమణి మణి కోడూరి, అరివిల్లి రమేశ్, ఆస్ట్రేలియా సిడ్నీ నుంచి రూ.5.32 లక్షలు తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు.

ఆస్ట్రేలియా( మెల్బోర్నీ) నుంచి టీడీపీ కౌన్సిల్ మెంబర్స్ దేవేంద్ర పర్వతనేని, రామకృష్ణ అన్నే , ధరణేష్ ఎడ్లపల్లి రూ.1.75 లక్షలు పార్టీకి ఇచ్చారు.

ఈ చెక్కులను ఎన్‍ఆర్‍ఐ విభాగం నేతలు కె.బుచ్చిరాంప్రసాద్, చప్పిడి రాజశేఖర్ , మాజీ శాసనసభ్యులు బోడె ప్రసాద్ చేతుల మీదుగా టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి అందజేయడం జరిగింది.

* పత్రికా ప్రకటన.

యుద్ధ ప్రాతిపదికన ఘాట్ రోడ్డు మరమ్మతులు

నేటి సాయంత్రానికి ఢిల్లీ ఐఐటి నిపుణుల రాక

డౌన్ ఘాట్ రోడ్ ద్వారా రాకపోకలు

ధ్వంసమైన ఘాట్ రోడ్డుప్రాంతాలను పరిశీలించిన టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళే అప్ ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడి ఘాట్ రోడ్డు భారీగా ధ్వంసమైందని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి తెలిపారు.

బుధవారం తెల్లవారుజామున 5 – 40 గంటల సమయంలో భారీ ఎత్తున కొండచరియలు విరిగిపడి రక్షణ గోడలు, రోడ్లు ధ్వంసమయ్యాయి. టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఈ ప్రాంతాలను పరిశీలించారు. నాలుగు చోట్ల భారీ ప్రమాదం జరిగిందని, శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దయవల్ల ఎవరూ గాయపడలేదని అధికారులు వివరించారు. అనంతరం చైర్మన్ అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా శ్రీ వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. గత 30 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో ఇటీవల కురిసిన వర్షాలకు తిరుమల ఘాట్ రోడ్ల లో కొండ చరియలు విరిగిపడుతున్నాయని తెలిపారు. ఉదయం 5 – 45 గంటల సమయంలో ఆర్టీసీ బస్సు తిరుమలకు వెళుతుండగా భారీ శబ్దం, పొగ రావడంతో డ్రైవర్ బస్సు నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చైర్మన్ చెప్పారు. అప్ ఘాట్ రోడ్డులో మరో ఐదారు చోట్ల కొండ చరియలు విరిగిపడే ప్రమాదం గుర్తించామన్నారు. వీలైనంత త్వరలో రోడ్డు మరమ్మతులు చేసి, గట్టి రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని చైర్మన్ చెప్పారు. ఢిల్లీ ఐ ఐ టి నుంచి నిపుణుల బృందం బుధవారం సాయంత్రానికి తిరుపతి కి చేరుకుంటుందన్నారు. టీటీడీ ఇంజినీరింగ్, విజిలెన్స్ అధికారులతో కలిసి వారు ఘాట్ రోడ్ల పరిశీలన చేస్తారన్నారు. కొండ చరియలు విరిగిపడకుండా ఎలాంటి జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలనే విషయం పై వారు పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి రెండు, మూడు రోజుల్లో నివేదిక సమర్పిస్తారని ఆయన వివరించారు. ఆ తరువాత భవిష్యత్ లో కూడా ఇలాంటి సంఘటనలు జరక్కుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఘాట్ రోడ్డు మరమ్మతులు పూర్తి అయ్యే వరకు డౌన్ ఘాట్ రోడ్డులోనే వాహనాల రాకపోకలు అనుమతిస్తామని అన్నారు.

ఆన్లైన్లో దర్శనం టికెట్లు బుక్ చేసుకుని వాహనాల ద్వారా తిరుమలకు వచ్చే భక్తులు భారీ వర్షాల దృష్యా తమ ప్రయాణం వాయిదా వేసుకుంటే ఆరు నెలల్లోగా దర్శనం తేదీ మార్పు చేసుకునే అవకాశం ఉందని శ్రీ సుబ్బారెడ్డి చెప్పారు. నడకదారిలో తిరుమలకు వెళ్ళే భక్తులకు మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదని ఆయన తెలిపారు.

జెఈవో శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి,చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఈ శ్రీ జగదీశ్వరరెడ్డి, ఈఈ శ్రీ జగన్మోహన్ రెడ్డి, ఈ ఈ శ్రీ సురేంద్ర రెడ్డి, డి ఎఫ్ ఓ శ్రీ శ్రీనివాసులు రెడ్డి ఇతర అధికారులు ఛైర్మన్ వెంట ఉన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.

* ఇండ‌స్ట్రీలో మ‌రో విషాదం. రోడ్డు ప్రమాదంలో యువ హీరో సోద‌రుడు మృతి.

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో వ‌రుస విషాదాలు అభిమానుల‌ని శోక‌సంద్రంలోకి నెడుతున్నాయి.

ఇటీవ‌ల క‌రోనాతో శివశంకర్ మాస్టర్ క‌న్నుమూయ‌గా, కొద్ది రోజుల‌కే లెజండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్త‌మించారు. వీరికి ముందు కూడా త‌క్కువ స‌మ‌యంలో ప‌లువురు ప్ర‌ముఖుల‌ని ఇండ‌స్ట్రీ కోల్పోయింది. ఈ విషాదాల నుంచి ఇంకా తేరుకోకముందే మరో టాలీవుడ్ యంగ్ హీరో ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.

ఎస్ఆర్ కల్యాణ మండపం చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన హీరో అబ్బవరం కిరణ్ సోదరుడు రామాంజులు రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్టు తాజా సమాచారం. కడప జిల్లా చెన్నూరు వద్ద రోడ్డు ప్రమాదం జరగగా, తీవ్రంగా గాయపడిన రామాంజులు రెడ్డి కన్నుమూశాడు. అబ్బవరం రామాంజులు రెడ్డి సంబేపల్లె మండలం దుద్యాల గ్రామంలో నివసిస్తున్నాడు.

యువ నటుడు కిరణ్‌ అబ్బవరం విష‌యానికి వ‌స్తే సినిమాల విషయంలో జోరు ప్రదర్శిస్తున్నాడు. వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్తున్నాడు. ‘రాజావారు రాణిగారు’, ‘ఎస్‌ఆర్‌ కల్యాణమండపం’ చిత్రాలతో మెప్పించిన ఈయ‌న ప్రస్తుతం ‘సమ్మతమే’, ‘సెబాస్టియన్‌ పీసీ 524’ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవ‌ల‌ రమేశ్‌ కాడూరి దర్శకత్వం వహిస్తున్న షూటింగ్ మొద‌లు పెట్టాడు.

* సుదీర్ఘ విరామం అనంతరం విజయవాడలో సినిమా థియేటర్లు ఇప్పుడిప్పుడే తెరుచు కుంటున్నాయి. బస్టాండ్ లోని వై స్క్రీన్స్ రెండేళ్ల తరువాత శుక్రవారం నుంచి తిరిగి ప్రారంభించడానికి సిద్ధమైంది. నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమాతో ఈ స్క్రీన్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు వై స్క్రీన్ అధినేత యార్లగడ్డ రత్నకుమార్ తెలిపారు.

కోవిడ్ నేపధ్యంలో దేశ వ్యాప్తంగా దాదాపు రెండేళ్ల పాటు అన్ని రంగాలు మూటపడిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సినిమా రంగం తీవ్రంగా నష్టపోయింది. కోవిడ్ తొలిదశ తరువాత సినిమా హాళ్లు తిరిగి ప్రారంభం అయ్యేలోపు రెండో విడత కోవిడ్ విజృంభించడంతో ఇప్పటి వరకు థియేటర్లు తెరుచుకోలేదు. నెల రోజుల నుంచి ప్రభుత్వ ఆదేశాలతో 100శాతం సీటింగ్ కెపాసిటీ తో సినిమా హాళ్లు తెరుచుకోగా మరికొన్ని ఇప్పుడిప్పుడే ప్రారంభానికి సిద్ధమయ్యాయి. విజయవాడ బస్టాండ్ లోని వై స్క్రీన్స్ గురువారం నుంచి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించినా ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్ట్రీ అకాల మరణంతో ఆయన నివాళిగా ఒక రోజు అనంతరం శుక్రవారం నుంచి థియేటర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు సంస్థ అధినేత యార్లగడ్డ రత్నకుమార్ తెలిపారు.

* నేను భువనేశ్వరిపై పొరపాటున వ్యాఖ్యలు చేశాను.

చంద్రబాబు సతీమణికి క్షమాపణ చెబుతున్నా.

ఎమోషన్ లో ఒక పదం తప్పుగా దొర్లినమాట వాస్తవం.

నా వ్యాఖ్యలకు నేను బాధపడుతున్నా.

టీడీపీలో నాకు అందరికంటే ఆత్మీయురాలు భువనేశ్వరి.

భువనేశ్వరిని నేను అక్కా అని పిలుస్తా.

కులం నుంచి వెలివేస్తారనే భయంతో క్షమాపణ చెప్పలేదు. నేను మనస్ఫూర్తిగానే క్షమాపణ చెబుతున్నా.

చంద్రబాబును కూడా క్షమాపణ కోరుతున్నా.

ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.