DailyDose

TNI నేటి నేర వార్తలు 1-Dec-2021

TNI నేటి నేర వార్తలు 1-Dec-2021

* వివేకానంద జూనియర్ కళాశాలలో అక్రమ కట్టడాలను ఆపాలి.

వరంగల్ (కాశిబుగ్గ) : స్వామి వివేకానంద జూనియర్ కళాశాలలో అక్రమంగా పెట్రోల్ బంక్ కట్టడం ఆపాలి. ట్రస్ట్ వారు విద్య విధానం కోసం చేసిన తీర్మానన్ని కాలరస్తూ కళాశాల కాంపౌండ్ లో రెండు ఇంటి నెంబర్ లతో ఒకటి కాలేజ్, ఒకటి ప్రైవేట్ కి ఇంటి నెంబర్లు కేటయించి అనుమతి తీస్కొని రావడం జరిగింది. ఏయిడెడ్ కళశాలలో పెట్రోల్ బంక్ నిర్మించడం గురించి గతంలో 2019 లో ఆపిన తర్వాత మళ్ళీ అదే విధంగా నిర్మాణాలు చేపడుతున్నారు ప్రభుత్వ భూములను ఆక్రమించడం సరికాదు కళాశాల భూములలో పెట్రోల్ బంక్ నిర్మించాడమే మీ వైఖరి మారాలి.అధికార పార్టీ అండదండలతో అక్రమ కట్టడాలను నిర్మించడం ఆపాలని ఏబీవీపీ నాయకులు మరియు విద్యార్థులు కళాశాల సమస్యను పట్టించుకోని MLA దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ స్టేట్ హాస్టల్ సెల్ కన్వీనర్ భరత్ వీర్ జిల్లా కన్వీనర్ ఛత్రపతి శివాజీ మరియు గణేష్,అఖిల్ రెడ్డి,రాజేశేఖర్, కుమార్, నర్సింగ్ రావ్, అరుణ్ ,వినయ్, సాయి, వినిత్, రాజకుమార్, సాయి తేజ తదితరులు పాల్గొన్నారు.

* ఫీజుల పేరుతో విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న కాలేజీల పై చర్యలు తీసుకోవాలి.

కర్నూలు జిల్లా ఆదోనిలో సీమ విద్యార్థి సంఘం(SVS) ఆధ్వర్యంలో ఆర్.డి.ఓ ఆఫీస్ దగ్గర ఫీజుల పేరుతో ఒత్తిడి పెడుతున్న నేషనల్ మరియు సాయి కాలేజీలలపై చర్యలు తీసుకోవాలని నిరసన వ్యక్తం చేసి,సీమ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకుడు నవీన్ కుమార్ మాట్లాడుతూ ఫీజుల నియంత్రణ చట్టాలు ఎన్ని వచ్చిన విద్యార్థుల పై ఫీజుల ఒత్తిడి తగ్గడం లేదు,ఎగ్జామ్ ఫీజు కట్టాలి అంటే కాలేజీ ఫీజు మొత్తం చెల్లించాలని లేకపోతే విద్యార్థులను క్లాసుల నుండి బహిష్కరితున్నారు. ఇలాగే పై అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తే సీమ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కార్పొరేట్ విద్యాసంస్థల జీతగాళ్లుగా పని చేస్తున్న ఆర్.ఐ. ఓ ఆఫీస్ ముట్టడిస్తామని అన్నారు.కనీస సదుపాయాలు లేని కళాశాలలైన సాయి మరియు నేషనల్ కళాశాలకు ప్రభుత్వ అధికారులు పర్మిషన్ ఎలా ఇచ్చారని సీమ విద్యార్థి సంఘం నాయకులు వాపోయారు.ఇప్పటికైనా అక్షలరాలతో వ్యాపారం చేస్తున్న కళాశాలల గుర్తింపు రద్దు చేయాలని ఆర్.డి.ఓ ఆఫీస్ ఇంఛార్జి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అన్నారు.

* వరంగల్ జిల్లా:- నర్సంపేట విద్యార్థులతో చెలగాటమా ఖబర్దార్ ABVP వరంగల్ జిల్లా కన్వీనర్ తేజవత్ శ్రీకాంత్.

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎబివిపి వరంగల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రీయింబర్స్మెంట్ బాకాయల విడుదల కై నర్సంపేట పట్టణం లోని అమరవీరుల స్తూపం వద్ద భారీ ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వరంగల్ జిల్లా కన్వీనర్ తేజావత్ శ్రీకాంత్ పాల్గొని మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థులు నిరుద్యోగులు అంటే లెక్క లేదు కనీసం వారిని పట్టించుకున్న పాపాన పోవడం లేదు గత మూడు సంవత్సరాలుగా విద్యార్థులకు స్కాలర్షిప్లు ఫీజు రీయింబర్స్మెంట్ రాకా అనేక ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్ మాత్రం ఫామ్హౌస్లో పండగ చేసుకుంటున్నారు ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు 3816కోట్లు ఉండటం సిగ్గుచేటు ఉద్యమ కారుని ఉద్యమ నేత అని చెప్పుకునే కేసీఆర్ గారు కనీసం విద్యార్థుల సాధకబాధకాలు పట్టించుకోక పోవడం దారుణం చదువులు పూర్తి చేసుకున్న విద్యార్థులు స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ రాక వారి సర్టిఫికెట్లు వారు తీసుకొని పై చదువులు చదవలేక ఇంటిదగ్గర ఉండలేక తీవ్ర ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు తెలంగాణ లో అనేకం ఉన్నాయి తన బిడ్డ ఎంపీ ఎలక్షన్ లో ఓడిపోతే వెంటనే ఎమ్మెల్సీలు చేసి తన సడ్డకుని కొడుకు
ను రాజ్యసభకు పంపి కుటుంబాన్ని కాపాడుకుంటున్న కేసీఆర్ తెలంగాణ సమాజం ఎటువైపు వెళ్ళాలి తెలంగాణలో విద్యారంగం తీవ్రమైన వివక్షకు గురవుతోంది ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి.

పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రియెంబర్స్మెంట్ను విడుదల చేయాలి అని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా నానాటికి నిరుద్యోగం పెరిగిపోతుంది తెలంగాణ రాష్ట్రం కోసం అనేక మంది విద్యార్థుల బలిదానం చేసుకుంటే తెలంగాణలో విద్యా రంగాన్ని నిర్లక్ష్యం చేయడం అత్యంత దారుణమైన విషయం తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల ఉసురు కేసీఆర్ కి తప్పక తగులుతుంది స్కాలర్షిప్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు బడుగు బలహీన వర్గాల విద్యార్థుల విద్యకు దూరం చేయడమే అనే వాపోయారు రాష్ట్రంలో వైన్ షాపులకు రిజర్వేషన్ కల్పించాలని కేసీఆర్ కి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలిఅనే లేకపోవడం శోచనీయం ఒక ఉప ఎన్నిక కి వందల కోట్లు ఖర్చు చేస్తున్న కేసీఆర్ విద్యార్థులకు స్కాలర్షిప్లు విడుదల చేయడంలో ఎందుకు అలసత్వం వహిస్తున్నారు అని ప్రశ్నించారు.

ఈ కార్యక్రమంలో ఏబీవీపీ వరంగల్ జిల్లా ఎస్ ఎఫ్ డి సి కన్వీనర్ కోరే రాజు ఏబీవీపీ వరంగల్ జిల్లా ఎస్ ఎఫ్ ఎస్ కన్వీనర్ రామగిరి సాయి కిరణ్ ఏబీవీపీ వరంగల్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ వెంకన్న బొచ్చు రాజేష్ అవినాష్ దుగ్గొండి ఖానాపూర్ మండల కన్వీనర్లు గజ్జల దేవేందర్ తేజావత్ హేమంత్ గణేష్ శిరీష అనూష స్వప్న సుమలత తదితరులు పాల్గొన్నారు.

తేజవత్ శ్రీకాంత్ (విద్యార్థి సంఘం నాయకుడు)

* అమరావతి బహుజన జెఎసి పోతుల బాలకోటయ్య మీడియా పాయింట్స్ హోదా ద్రోహులను వదలబోం.

ఇస్తామన్న వాళ్లను, తెస్తామన్న వాళ్లను ప్రజాక్షేత్రంలో నిలదీస్తాం.

హోదా ముగిసిన అధ్యాయం ఎప్పటికీ కాదు.

ఏపీకి ప్రత్యేక హోదా ఎగ్గొట్టేందుకే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం సిఫార్సులను అడ్డు పెట్టిందని అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ఆరోపించారు. బుధవారంఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్ సభలో మరోమారు హాదా ముగిసిన అధ్యాయంగా చెప్పటం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడేళ్ళగా హోదా ఇవ్వని వాళ్ళను, గంపగుత్తగా ఎంపీలను గెలిపిస్తే హోదా తెస్తామన్న వాళ్ళను ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబెడతామని హెచ్చరించారు. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలొస్తాయని, పరిశ్రమలొస్తే ఉద్యోగాలు వస్తాయని పాదయాత్రలో చెప్పిన ముఖ్యమంత్రి అధికారంలోకి రాగానే హోదా మాట మరిచారన్నారు. హోదా వస్తే రాష్ట్ర ఆర్థిక బాగుతో పాటు దళిత బహుజన కులాలకు అధిక మేళ్ళు జరుగుతాయని, ఉపాధికల్పన జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అధికారంలోకి రాకముందు ఒక మాట,అధికారంలోకి వచ్చాక మరో మాట చెప్పే రాజకీయపార్టీలకు దళిత బహుజన కులాలే గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.గతంలో హోదా కోసం పగలూ, రేయి వేషాలేసుకొని మాట్లాడిన మేధావులు, పూనకం రాయుళ్ళు ఏమయ్యారు? అని ప్రశ్నించారు. వారి అడ్రస్ లు వెతికి పట్టుకొని మరీ త్వరలోనే స్పష్టమైన కార్యాచరణతో ప్రశ్శిస్తామని హెచ్చరించారు.

* అమరావతి

ఏపీ సీఎస్ కి ఉద్యమ కార్యాచరణ నోటీసు ఇచ్చిన ఉద్యోగుల సంఘాలు.

బండి శ్రీనివాసరావు ,ఏపీ జేఏసీ అధ్యక్షడు కామెంట్స్.

సీఎస్ కి ఉద్యమ కార్యచరణ నోటీస్ ఇచ్చాము.

నెలరోజులుగా ప్రభుత్వ పెద్దలతో చుట్టు తిరిగి అలసిపోయాము.

మాకు ఇవ్వాల్సి పిఆర్సీ ,డీఏలు వంటి 45 డిమాండ్స్ ఇవ్వాలని వేడుకున్నాము.

ప్రభుత్వ పెద్దల మాటలు మూటలుగానే అయ్యాయే తప్పా అమలు కాలేదు.

మేము ప్రకటించిన కార్యాచరణ యధావిధంగా అమలు చేస్తాం.

ఈ నెల 7నుండి మా ఉద్యమం ప్రారంభం అవుతుంది.

ఇది కేవలం ప్రభుత్వ తప్పిదమే.

పిఆర్సీ నివేదిక ఇప్పటికీ ఇవ్వలేదు.

55శాతం ఫిట్మెంట్ ఇవ్వాల్సిందే.

మేము దాచుకున్న 1600కోట్లు ఇవ్వమని ఆడిగినా ఇవ్వడం లేదు.

బొప్పారాజు, వెంకటేశ్వర్లు ఏపీ అమరావతి జేఏసీ అధ్యక్షుడు కామెంట్స్.

5పేజీల ఉద్యమ కార్యాచరణ ను సీఎస్ కు ఇచ్చాము.

నవంబర్ నెలాఖరుకు అన్ని సమస్యలు పరిష్కారిస్తామని సజ్జలతో పాటు మిగతా ప్రభుత్వ పెద్దలు చెప్పారు.

మూడేళ్ళుగా ప్రభుత్వానికి అన్ని విధాల సహకరించాము.

కరోన కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బంది పడినప్పుడు ఉద్యోగులుగా సహకరించాము.

కరోన సమయంలో మా జీతాల్లో కోత విధించిన సమయంలో కూడా సహకరించాము.

కారుణ్య నియామకాల్లో ప్రభుత్వం మాట తప్పింది.

ఉద్యోగుల రోడ్డు మీదకు రావడానికి పూర్తిగా ప్రభుత్వమే కారణం.

పిఆర్సీ నివేదిక ఎందుకు బహిర్గతం చేయడం లేదు.

పీఆర్సీ నివేదికలో ఏమైనా లొసుగులు ఉన్నాయా? అనే అనుమానం కలుగుతుంది.

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నాము.

జీతాల గురించి,ఉద్యోగులను కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి.

ప్రభుత్వానికి ,ఉద్యోగుల మద్య దూరం పెంచేలా ఆర్థిక మంత్రి వ్యాఖ్యలు ఉన్నాయి.

రాష్ర్ట వ్యాప్తంగా ఉద్యోగులను సంఘటితం కావాలి.

రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో ప్రాంతీయ సభలు పెట్టబోతున్నాము.

పోరాటం ద్వారా ఉద్యోగుల సమస్య పరిష్కారం అవుతుంది.

సిఎం జగన్ మోహన్ రెడ్డి ఉద్యోగులు సమస్యల పై స్పందిస్తారని ఎదురు చూస్తున్నాము.

* ఏపీలో సినిమా థియేటర్లపై బాదుడుకు రంగం సిద్ధం.

థియేటర్ల ఫైర్ పర్మిషన్ ను ఐదేళ్ల కాలానికి ఒకేసారి ఇవ్వాలని నిర్ణయం.

ఇప్పటి వరకు ఏటా నిర్ణీత మొత్తం కట్టి రెన్యువల్ చేయించుకుంటున్న థియేటర్ యజమానులు.

తాజాగా ఐదేళ్లకు రెన్యువల్ ఫీజును ఒకేసారి కట్టించుకుని అనుమతులు ఇవ్వాలనే అంశంపై కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.

రెన్యువల్ ఫీజును కూడా పెంచుతారనే ఆందోళనలో థియేటర్ యజమానులు.

* గుంటూరు రూరల్ పోలీస్

ది.01.12.2021 తేదీ బుధవారం గుంటూరు రూరల్ జిల్లా పోలీస్ కార్యాలయములో నిర్వహించిన డయల్ యువర్ ఎస్పీ ౼ 8688405050 కార్యక్రమము లో పాల్గొని,ప్రజల సమస్యలను స్వీకరించి,వాటిని సత్వరమే పరిష్కరించాలని పోలీస్ అధికారులను ఆదేశించిన గుంటూరు రూరల్ ఎస్పీ శ్రీ విశాల్ గున్ని ఐపీఎస్ గారు,.

ఈ సందర్భముగా ఎస్పీ గారు మాట్లాడుతూ.

★ ఈ రోజు డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమములో ఫోన్ కాల్స్ ద్వారా ప్రజల నుండి 8 సమస్యలు స్వీకరించడం జరిగినదని,వీటిలో ఒకటి అర్బన్ జిల్లా నుండి కాగా,మిగిలిన 7 రూరల్ జిల్లా నుండి రావడం జరిగినదని తెలిపారు.

★ ప్రజల నుండి డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమానికి విశేష స్పందన వస్తుందని,రూరల్ జిల్లా నుండి కాకుండా ఇతర జిల్లాలు,రాష్ట్రాలు మరియు దేశాల నుండి కూడా ఫోన్ కాల్స్ వస్తున్నాయని తెలిపారు.

★ ఈ రోజు ఎక్కువగా నగదు లావాదేవీలు,పొలం తగాదాలు మరియు కుటుంబ తగాదాలకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించడం జరిగినదని తెలిపారు.

★ ప్రజల సమస్యలను పరిష్కరించడానికి క్షేత్రస్థాయిలో రూరల్ జిల్లా పోలీస్ వారు నిరంతరం అందుబాటులో ఉంటారని,ప్రజలు ఎప్పుడైన వారికి ఉన్న సమస్యలను పోలీస్ వారి దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు.

★ ప్రజలు తమ సమస్యలను తెలుపుకునే విధంగా రూరల్ జిల్లా పోలీస్ వారి ఆధ్వర్యములో వాట్సాప్ హెల్ప్ లైన్ (whatsapp help line) – 8866268899, ప్రతి బుధవారం డయల్ యువర్ ఎస్పీ ౼ 8688405050 కార్యక్రమము,ప్రతి సోమవారం స్పందన కార్యక్రమము,24 గంటలు డయల్ 100 వీటితో పాటు ఫేస్ బుక్,ట్విట్టర్ మరియు ఇంస్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలను కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగినదని తెలిపారు.

★ ప్రతి బుధవారం నిర్వహించే డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమములో నేరుగా ఎస్పీగారితో మాట్లాడి, తమ సమస్యను విన్నవించుకోవాలనుకునే వారు 868840505 అనే నెంబర్ కి మాత్రమే ఫోన్ కాల్ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.

★ ఈ కార్యక్రమములో ఎస్పీ గారితోపాటు,స్పందన సీఐ శ్రీనివాసరావు గారు, కమ్యూనికేషన్ సీఐ శ్రీమతి సుజాత గారు, IT కోర్ సీఐ సత్యనారాయణ గారు మరియు ఎస్సై రవి కృష్ణ గారు,ఎస్సై మూర్తి గారు,ఇతర సిబ్బంది మరియు మీడియా మిత్రులు పాల్గొన్నారు.

* కార్తీక దీపం పెడుతుండగా మాంగళ్య చైన్ చోరి.

కళ్యాణదుర్గం పట్టణం పులవాండ్ల వీధి కి చెందిన చంద్రకళ అను మహిళా తన ఇంటి ముందు కార్తీక దీపం పెడుతుండగా గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలోని 4 తులాల మాంగళ్య చైన్ ను ఎత్తుకెళ్లిన గుర్తుతెలియని దుండగులు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు.