Business

ఫిక్సెడ్ చేసేవారికి బ్యాంకుల శుభవార్త – TNI వాణిజ్యం 11/02/2022

ఫిక్సెడ్ చేసేవారికి బ్యాంకుల శుభవార్త – TNI వాణిజ్యం 11/02/2022

*టాటా సన్స్ పగ్గాలు మరోసారి ఆయనకే
టాటా సన్స్ ఛైర్మన్గా ఎన్ చంద్రశేఖరన్ను కొనసాగిస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటన జారీ చేసింది. ఫిబ్రవరి 20తో ఆయన పదవీ కాలం ముగియనుండగా.. ఆ తర్వాత కూడా ఆయన ఈ పదవిలో కొనసాగుతారని స్పష్టం చేసింది. టాటా సన్స్ ఛైర్మన్గా ఎన్ చంద్రశేఖరన్ మరోసారి నియమితులయ్యారు. ఐదేళ్ల కాలానికి ఆయన్ను ఛైర్మన్గా నియమిస్తున్నట్లు టాటా సన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. ఛైర్మన్గా చంద్రశేఖరన్ పదవీ కాలం ఫిబ్రవరి 20తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన కాంట్రాక్టును పొడిగిస్తున్నట్లు తాజాగా సంస్థ ప్రకటించింది.టాటా-మిస్త్రీ కుటుంబానికి చెందిన వారు కాకుండా వేరే వ్యక్తి ఆ సంస్థ ఛైర్మన్గా ఉండటం చంద్రశేఖరన్తోనే ప్రారంభమైంది. బోర్డు మెంబర్ల మద్దతుతో రెండోసారి ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు. శుక్రవారం నిర్వహించిన సమావేశంలో బోర్డు సభ్యులంతా ఆయన పనితీరును సమీక్షించి, ఛైర్మన్గా కొనసాగించాలని నిర్ణయించారని సంస్థ తన ప్రకటనలో పేర్కొంది.

*మార్కెట్లపై అమెరికా ద్రవ్యోల్బణం దెబ్బ.. రూ.3.39 లక్షల కోట్లు ఆవిరి!
అమెరికాలో ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ఠానికి చేరింది. ఈ ప్రభావం భారతీయ స్టాక్మార్కెట్ల మీద పడింది. దీంతో సూచీలు నేల చూపులు చూశాయి. ఈ భారీ నష్టాలకు రూ. 3.39లక్షల కోట్లు మదుపరుల సంపద ఆవిరైంది.అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలతో దేశీయంగా అన్ని రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ నష్టాలు చవిచూస్తున్నాయి. తొలుత ప్రతికూలంగా ప్రారంభమైన సూచీలు గంట గంటకు కనిష్ఠాలను చేరుతున్నాయి. ఓ దశలో బీఎస్ఈ సెన్సెక్స్ 1,000 పాయింట్లకు పైగా పతనమైంది. దీంతో మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో నమోదిత సంస్థల మార్కెట్‌ విలువ ఈరోజు భారీగా పడిపోయింది. సుమారు రూ.3.39 లక్షల కోట్లు ఆవిరైనట్లు నిపుణులు చెప్తున్నారు. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.33 వద్ద చలిస్తోంది.అమెరికాలో ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ఠానికి చేరింది. దీంతో వడ్డీరేట్ల పెంపును ఫెడ్‌ మరింత వేగంగా పెంచనుందన్న సంకేతాలు వెలువడ్డాయి. ఫలితంగా గురువారం అక్కడి మార్కెట్లు భారీ నష్టాల్ని చవిచూశాయి. అక్కడి నుంచి సంకేతాలు అందుకున్న ఆసియా మార్కెట్లు సైతం నేడు ప్రతికూలంగా ట్రేడవుతున్నాయి. దేశీయంగా చూస్తే మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 100 సూచీ 0.63 శాతం కుంగగా.. స్మాల్‌ క్యాప్‌ సూచీ 0.61 శాతం పడింది. బీఎస్‌ఈలో మెజారిటీ షేర్లు నష్టాల్లో చలిస్తున్నాయి.

* నాలుగు దశాబ్దాల తర్వాత.. స్వదేశీ ట్యాగుతో ‘థమ్స్ అప్’ అరుదైన ఘనత
నిదానమే ప్రధానం అనే నానుడి శీతల పానీయ బ్రాండ్ థమ్స్ అప్కు సరిగ్గా సరిపోతుంది. ప్యాకేజ్డ్ డ్రింక్స్ మార్కెట్లో నెమ్మదిగా.. స్థిరంగా వ్యాపారవృద్ధిని సాధించుకుంటూ వస్తున్న థమ్స్ అప్ ఇప్పుడు అరుదైన ఫీట్ సాధించింది. ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తున్న ‘బిలియన్ డాలర్ల బ్రాండ్’ ఘనత ఎట్టకేలకు దక్కింది.1977లో కోలా కింగ్ రమేష్ చౌహాన్ థమ్స్ అప్ శీతల పానీయ బ్రాండ్ను ప్రారంబించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి భారత బేవరేజెస్ మార్కెట్లో దీని హవా కొనసాగుతోంది. స్వదేశీ బ్రాండే అయినప్పటికీ ప్రస్తుతం ఇది కోకా కోలా కింద ఉంది. అయితే కిందటి ఏడాది అమ్మకాల్లో (2021)లో బిలియన్ డాలర్ మార్క్ను(7,500 కోట్ల రూపాయలకు పైగా బిజినెస్) దాటేసింది థమ్స్ అప్.గ్లోబల్ బేవరేజెస్ మార్కెట్లో బిలియన్ డాలర్ల మార్కెట్ ఉన్న కంపెనీలు చాలా ఉన్నా.. థమ్స్ అప్ ఈ మార్క్ను స్వదేశీ ట్యాగ్తో అందుకోవడమే ఇక్కడ కొసమెరుపు. ‘‘మా స్థానిక థమ్స్ అప్ బ్రాండ్ మార్కెటింగ్ ప్రణాళిక, సరైన ఐడియాలతో భారతదేశంలో బిలియన్-డాలర్ల బ్రాండ్‌గా అవతరించింది. థమ్స్ అప్ ఇప్పుడు భారతదేశంలో బిలియన్ డాలర్ల బ్రాండ్” అని కోకా కోలా కంపెనీ CEO జేమ్స్ క్విన్సీ గర్వంగా ప్రకటించుకున్నారు.స్వదేశీ తయారీ కూల్ డ్రింక్ అయిన థమ్స్ అప్ను 1993లో కోకాకోలా సొంతం చేసుకుంది. పార్లే బిస్లరీ వ్యవస్థాపకుడు, ఇండియన్ కోలా కింగ్ రమేష్ చౌహాన్ నుంచి ఈ బ్రాండ్ను కొనుగోలు చేసింది కోకా కోలా. థమ్స్ అప్తో పాటు మాజా, ఆ టైంలో సూపర్ హిట్ అయిన కూల్ డ్రింక్ బ్రాండ్ గోల్డ్ స్పాట్ను సైతం కొనుగోలు చేసేసింది.

* ఫిక్స్‌ డ్ డిపాజిట్ చేసేవారికి ఆ రెండు బ్యాంకులు శుభవార్త..!
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి సమీక్షా విధాన కీలక నిర్ణయాలు దాదాపు మెజారిటీ విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే వెలువడ్డాయి. 2020 ఆగస్టు నుంచి చూస్తే, వరుసగా పదవ ద్వైమాసిక సమావేశంలోనూ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) రెపో రేటు(4 శాతం), రివర్స్‌ రెపో రేటు(3.35 శాతం)ను యథాతథంగా కనిష్ట స్థాయిల్లో 4 శాతం వద్దే కొనసాగించాలని నిర్ణయించింది.ఆర్‌బీఐ మానిటరరీ పాలసీ ఈ ప్రకటన చేసిన ఒక రోజు తర్వాత సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యుసీఓ బ్యాంకులు రూ.2 కోట్ల కంటే తక్కువ మొత్తాల ఫిక్సిడ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించాయి. కొత్త వడ్డీ రేట్లు ఫిబ్రవరి 10, 2022 నుంచి అమల్లోకి రానున్నాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాసెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వెబ్‌సైట్‌లో తెలిపిన వివరాల ప్రకారం.. బ్యాంకు రూ.2 కోట్ల కంటే తక్కువ ఎఫ్‌డీలకు వడ్డీ రేటును సవరించింది. ఈ కొత్త ఎఫ్‌డీ వడ్డీ రేట్లు ఫిబ్రవరి 10, 2022 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే, ఎఫ్‌డీలపై ఇచ్చే వడ్డీ రేట్లు 2.75% నుంచి 5.15% మధ్య ఉన్నాయి.

* ఎయిర్‌టెల్‌ సేవలకు అంతరాయం..! మీమ్స్‌తో యూజర్లు హల్‌చల్‌..!
దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్‌ 4జీ, బ్రాడ్‌ బ్యాండ్‌ సేవలు శుక్రవారం రోజున ఉదయం ఒక్కసారిగా పడిపోయాయి. ఎయిర్‌ టెల్‌ యూజర్లకు ఏకధాటిగా 20 నిమిషాల పాటు బ్రాడ్‌బ్యాండ్‌, నెట్‌వర్క్‌ సేవల్లో అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. పలు వెబ్‌సైట్స్‌, సర్సీసులకు రియల్‌ టైం ఇన్ఫర్మేషన్‌ను అందించే డౌన్‌ డిటెక్టర్‌ కూడా ఎయిర్‌టెల్‌ సేవల్లో అంతరాయం ఏర్పడినట్లు పేర్కొంది.ఎయిర్‌ టెల్‌ సేవలు రావడం లేదంటూ డౌన్‌ డిటెక్టర్‌లో ఫిర్యాదులు ఉదయం 10:58 గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. హైదరాబాద్‌, బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కత్తా, జైపూర్‌, ఇండోర్‌, ముంబై లాంటి ప్రధాన నగరాలతో పాటుగా అనేక నగరాల్లో ఎయిర్‌టెల్‌ సేవలకు అంతరాయం కల్గినట్లు డౌన్‌ డిటెక్టర్‌ నివేదించింది.

* రూ.14వేల‌కే యాపిల్ ఐఫోన్‌!! ఇక మీదే ఆల‌స్యం!
యాపిల్ ఐఫోన్ ల‌వ‌ర్స్‌కు భారీ బంప‌రాఫ‌ర్‌. ఐఫోన్ ల‌వ‌ర్స్ కోసం దేశీయ ఈకామ‌ర్స్ దిగ్గ‌జం ఫ్లిప్ కార్ట్ ఊహించ‌ని రీతిలో ఆఫ‌ర్లు ప్ర‌క‌టించింది. 26శాతం డిస్కౌంట్‌తో పాటు ఇత‌ర ఆఫ‌ర్ల కింద రూ.14వేల‌కే ఐఫోన్‌ను అందిస్తున్న‌ట్లు తెలిపింది. యాపిల్ ఐఫోన్ ప్ర‌పంచంలోని మొబైల్ ప్రియుల‌కు అత్యంత ఇష్ట‌మైన బ్రాండ్‌. ఈ ఫోన్‌ను ఇష్ట‌ప‌డ‌ని వారుండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. ఎందుకంటే దీని ప్ర‌త్యేక‌త అటువంటిది. ఈ బ్రాండ్ ఫోన్ వాడాల‌నేది చాలా మంది సామాన్యుల క‌ల. అయినా ఈఫోన్ ధ‌ర దిగిరాదు. ఐఫోన్ కు ఉన్న డిమాండ్ కార‌ణంగా ధ‌ర త‌గ్గ‌దు. అయితే ఇప్పుడు అలాంటి యాపిల్ కు చెందిన రూ.39,900 విలువైన‌ ఐఫోన్ ఎస్ఈని కేవ‌లం రూ.14వేల‌కే అందిస్తున్న‌ట్లు ఫ్లిప్‌కార్ట్ వెల్ల‌డించింది

*భారతీయ జీవిత బీమా కార్పొరేషన్ (ఎల్ఐసీ).. పబ్లిక్ ఇష్యూ ప్రతిపాదనకు భారత బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్డీఏఐ) ఆమోదం తెలిపింది. ఈ నెల 9న జరిగిన మండలి బోర్డు సమావేశంలో కంపెనీ ఇష్యూకు గ్రీన్సిగ్నల్ లభించింది. సాధారణంగా బీమా కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు వచ్చే ముందు ఐఆర్డీఏఐ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

*హైదరాబాద్ బిర్యానీకి మారుపేరుగా మారిన ప్యారడైజ్ రెస్టారెంట్ భారీ విస్తరణకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఆరు రాష్ట్రాల్లోని 13 నగరాల్లో ‘ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్స్’ 50 రెస్టారెంట్లు నిర్వహిస్తోంది. వచ్చే ఐదేళ్లలో దేశ, విదేశాల్లో కొత్తగా 450 రెస్టారెంట్లు ఏర్పా టు చేయాలని కంపెనీ భావిస్తోంది.

*హైదరాబాద్కు చెందిన కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్ హాస్పిటల్స్) డిసెంబరుతో ముగిసిన త్రైమాసికానికి రూ.84.2 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. 2020-21 ఇదే త్రైమాసికంలో ఆర్జించిన నికర లాభం రూ.47.8 కోట్లతో పోల్చితే ఇది 76 శాతం అధికం. సమీక్షా త్రైమాసికంలో మొత్తం ఆదాయం 10శాతం వృద్ధితో రూ.360.8 కోట్ల నుంచి రూ.396 కోట్లకు పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 9 నెలల కాలానికి రూ.1,290.6 కోట్ల ఆదా యంపై రూ.260.5 కోట్ల లాభాన్ని నమోదు చేసింది.

* ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికానికి అమర రాజా బ్యాటరీస్ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.145.30 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి ప్రకటించిన రూ.193.69 కోట్ల లాభంతో పోలిస్తే మాత్రం 25.25 శాతం తగ్గింది. త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ.2,384.82 కోట్లకు పెరిగింది. 2020-21 క్యూ3లో ఆదా యం రూ.1,995.63 కోట్లుగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో గడిచిన 9 నెలలకు గాను అమరరాజా బ్యాటరీస్ రూ.6,578.20 కోట్ల ఆదాయంపై రూ.413.72 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.

*హిందూజా గ్రూప్ కంపెనీ జీఓసీఎల్ వర్తమాన ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల కాలంలో రూ.459 కోట్ల ఆదాయాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.407 కోట్లతో పోల్చితే ఇది 13 శాతం అధికం. కన్సాలిడేటెడ్ ఆదాయం కూడా 4 శాతం పెరిగి రూ.133 కోట్ల నుంచి రూ.138 కోట్లకు చేరింది. డిసెంబరు త్రైమాసిక లాభం రూ.7 కోట్లు కాగా తొమ్మిది నెలల లాభం రూ.33 కోట్లు. అమ్మోనియం నైట్రేట్ ధర విపరీతంగా పెరిగిన కారణంగా గత ఏడాది తొమ్మిది నెలల్లో ఆర్జించిన రూ.51 కోట్లతో పోల్చితే లాభం తగ్గినట్టు కంపెనీ తెలిపింది. మహమ్మారి కారణంగా నిలిచిపోయిన ఎగుమతుల్లో కదలిక ఏర్పడిందం టూ రాబోయే కాలంలో ఎగుమతి ఆదాయాలు పెరిగేందుకు ఇది దోహదపడుతుందని పేర్కొంది. కంపెనీ చేతిలో వచ్చే రెండేళ్ల కాలానికి రూ.820 కోట్ల ఆర్డర్లు చేతిలో ఉన్నాయని కంపెనీ వెల్లడించింది.

*భారతీ ఎయిర్టెల్.. డిసెంబరు తో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.830 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతకుముందు ఏడాది ఇదే కాలం (రూ.854 కోట్లు)తో పోల్చితే లాభం స్వల్పంగా 2.8 శాతం తగ్గింది. త్రైమాసిక సమీక్షా కాలంలో ఆదాయం 12.6 శాతం పెరిగి రూ.26,518 కోట్ల నుంచి రూ.29,867 కోట్లకు చేరింది. ‘‘ఇటీవల సవరించిన టారి ఫ్లు మంచి ఫలితమిచ్చాయి. ఒక్కో వినియో గదారునిపై ఆదాయం (ఆర్పు) రూ.163తో త్రైమాసికంలో మేం అగ్రగామిగా ఉన్నాం. టారి్ఫల సవరణ పూర్తి ప్రభావం నాలుగో త్రైమాసికంలో స్పష్టంగా కనిపిస్తుంది’’ అని కంపెనీ ఎండీ, సీఈఓ గోపాల్ విట్టల్ అన్నారు. కాగా డిసెంబరు నాటికి కంపెనీ కన్సాలిడేటెడ్ నికర రుణ భారం రూ.1.57 లక్షల కోట్లుంది.