DailyDose

మోహన్ బాబుతో పేర్ని నాని భేటి – TNI తాజా వార్తలు – 11/02/2022

మోహన్ బాబుతో పెర్ని నాని భేటి –  TNI తాజా వార్తలు –  11/02/2022

*సినీ నటుడు మోహన్‌బాబును మంత్రి పేర్ని నాని శుక్రవారం హైదరాబాద్‌లో కలిశారు. మోహన్‌బాబు ఇంటికి వెళ్లిన మంత్రి.. సినీ పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. నిన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో చిరంజీవి బృందం భేటీ వివరాలను మోహన్‌బాబుకు మంత్రి పేర్ని నాని వివరించారు.

* ఈ నెల 8 నుంచి ప్రారంభమైన పాలిటెక్నిక్‌ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్‌ అవుతున్నట్లు బోర్డు గుర్తించింది. దీంతో బోర్డు ఇతర జిల్లాలోని కాలేజి ప్రిన్సిపాల్స్‌ను అప్రమత్తం చేసింది. ఈ మేరకు బాటసింగారంలోని స్వాతి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కాలేజ్‌ విద్యార్థులకు వాట్స్‌ అప్‌ ద్వారా పేపర్లను పంపిస్తున్నట్లు గుర్తించారు. దీంతో బోర్డు సెక్రెటరీ ప్రశ్నాపత్రాల లీక్‌ విషయమై ఆ ఇన్‌స్టిట్యూట్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు స్వాతి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కాలేజ్‌ పైకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

*స్వాతంత్ర్యానికి పూర్వం దర్బార్ అంటే రాచరికానికి సంబంధించిన పదమనిస్వాతంత్ర్యానంతరం దీని ఆధునిక భావన పారదర్శకతను ప్రోత్సహిస్తోందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చెప్పారు. ప్రజాస్వామ్యంలో సుపరిపాలనకు చాలా ముఖ్యమైన అంశం పారదర్శకత అని చెప్పారు. రాజ్ భవన్‌లో కొత్తగా పునర్నిర్మించిన దర్బార్ హాలును ఆయన శుక్రవారం ప్రారంభించారు.

* చిత్తూరు జిల్లాలో నెమళ్లు మృతి కలకలం సృష్టించింది. జిల్లాలోని సోమల మండలంలో ఏడు నెమళ్లు చనిపోయాయి. మిట్టపల్లె సమీపంలోని పూలకొండ వ్యవసాయ పొలాల్లో మృతి చెందిన 7 నెమళ్లను స్థానికులు గుర్తించారు.వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనాస్థలానికి పశు వైద్యు సిబ్బందితో సహాం చేరుకున్న అధికారులు నెమళ్లను పరిశీలించారు.మృతి చెందిన నెమళ్ళకు పశు వైద్య అధికారులు పోస్టుమార్టం నిర్వహించారు. నెమళ్ల కళేబరాల్లో ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉన్నట్లుగా గుర్తించారు. నెమళ్ల మృతిపై అటవీశాఖ అధికారి శంకరశాస్త్రి మాట్లాడుతూ క్టీరియా వల్లనే నెమళ్లు చనిపోయాయని తెలిపారు.అయితే గాలి ద్వారానే ఈ వైరస్ తో నెమళ్లుకు సోకిందని అధికారులు భావిస్తున్నారు.

* సినిమా టికెట్ల ధరలపై ఈ నెల 17న కమిటీ భేటీ కానుంది. సభ్యులకు ఉన్నతాధికారులు సమాచారం పంపారు. భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. హీరోలు చేసిన సిఫార్సులపై కమిటీ భేటీలో చర్చించనున్నారు. టికెట్ ధరలు, అదనపు షోలు, భారీ బడ్జెట్‌ చిత్రాలు వంటి అంశాలపై చర్చ జరగనుంది.

* ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ ఇవ్వాల్సిన రూ.6,111.88 కోట్ల విద్యుత్తు బకాయిల అంశాన్ని ఆ రాష్ట్రాలే పరిష్కరించుకోవాలని కేంద్ర విద్యుత్తుశాఖ మంత్రి ఆర్కే సింగ్‌ తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, వల్లభనేని బాలశౌరి అడిగిన ప్రశ్నకు గురువారం లోక్‌సభలో మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి తీసుకున్న విద్యుత్తుకు తెలంగాణ చెల్లించాల్సిన అసలు మొత్తంపై వివాదం లేదని, వడ్డీ విషయంలోనే సయోధ్య అవసరమని పేర్కొన్నారు. తెలంగాణ సొమ్ము ఇవ్వనందున ఏపీ.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిందని తెలిపారు. అంశం కోర్టులో ఉన్నందున్న పరిష్కారానికి ఎలాంటి కాలపరిమితి లేదని చెప్పారు.

* పాలిటెక్నిక్‌ ఫైనలియర్‌ ప్రశ్నాపత్రాలు లీక్‌ అవడం కలకలం రేపుతోంది. ఈనెల 8 నుంచి పాలిటెక్నిక్‌ పరీక్షలు జరుగుతున్నాయి. కాగా ప్రశ్నాపత్రాలు లీకైనట్లు బోర్డు గుర్తించింది. ప్రశ్నాపత్రాల లీక్‌ను గుర్తించిన కాలేజీ ప్రిన్సిపల్స్‌ ఈ విషయంపై బోర్డుకు సమాచారమిచ్చారు. బాటసింగారం స్వాతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి పేపర్‌ లీక్‌ అయిందని, పేపర్‌ను వాట్సాప్‌ ద్వారా విద్యార్థులకు పంపించినట్లు గుర్తించారు. ప్రశ్నాపత్రాల లీక్‌ సంబంధించి కాలేజ్‌పై బోర్డు సెక్రటరీ ఫిర్యాదు చేశారు. దీంతో స్వాతి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కాలేజ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

* హనుమకొండజిల్లాలో బీజేపీ చేపట్టిన నిరసన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. సీఎం దిష్టిబొమ్మతో బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మబీజేపీ రాష్ట్ర నాయకుడు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి శవయాత్ర నిర్వహించారు. కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసే క్రమంలో బీజేపీ కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తపై సీఐ వేణుమాధవ్ చేయి చేసుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నారు.

* మరోసారి బీజేపీ కార్యాలయంలో భద్రతా తనిఖీలు
హైదరాబాద్ నగరంలోని బీజేపీ కార్యాలయంలో పోలీసు ఉన్నతాధికారులు మరోసారి భద్రతా తనిఖీలు చేపట్టారు. ఇటీవల పట్టు బడిన ఉగ్రవాదుల డైరీలో హైదరాబాద్ బీజేపీ కార్యాలయం పేరు ఉండటం, నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు ఈ తనిఖీలు నిర్వహించారు. బీజేపీ కార్యాలయంలో పోలీసులు కలియతిరిగి కొలతలు తీసుకున్నారు. యూపీలో ఎంపీ అసదుద్దీన్ ఘటన తర్వాత పోలీసులు అప్రమతమయ్యారు. కార్యాలయం చుట్టూ పరిస్థితులను పోలీస్ ఉన్నతాధికారులు ఆరా తీశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి జరిగే అవకాశముందని గతంలో నిఘావర్గాలు హెచ్చరించిన విషయంత తెలిసిందే. దీంతో కార్యాలయానికి భద్రత కల్పించాల్సి‌ బాధ్యత పోలీసులదే అని బీజేపీ పేర్కొంది. అయితే భద్రతకు అవసరమైన ఖర్చులు బీజేపీనే భరించాలని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ క్రమంలో పార్టీ నేతలు, బీజేపీ కార్యాలయ సిబ్బందితో‌ పోలీస్ ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించారు.

*ముస్లీంల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎఫ్ఐఆర్ తెలుగు సినిమా పోస్టర్ లో హీరో మొఖం పై ముద్రించిన అరబిక్ పదాల (షహదాల) ను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఎంఐఎం ఎమ్మెల్యేలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కోరారు. శుక్రవారం మంత్రి శ్రీనివాస్ యాదవ్ ను ఆదర్శ నగర్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని తన కార్యాలయంలో నాంపల్లియాకత్ పురాకార్వాన్ ఎంఎల్ఏ లు జాఫర్ హుస్సేన్ మెరాజ్సయ్యద్. అహ్మద్ పాషా ఖాద్రికౌసర్ మొహినోద్దీన్ లు కలిసి ఈ మేరకు వినతి పత్రాన్ని అందజేశారు. వెంటనే స్పందించిన మంత్రి ఎఫ్డిసీ ఈడీ కిషోర్ బాబు తో ఫోన్ లో మాట్లాడి వెంటనే ఎఫ్ఐఆర్ సినిమా ప్రతినిధులతో మాట్లాడి అరబిక్ పదాలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు

*సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బేగంపేట డివిజన్ లో కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం ఉదయం గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి ప్రారంభించనున్నారు.

* అమరావతి రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య శాఖ బదిలీల్లో గందరగోళం నెలకొంది. బదిలీల విషంలో తొలి నుంచి ప్రభుత్వం నిబంధనలు పాటించడంలేదని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలను వైద్యులు వ్యతిరేకిస్తున్నారు. ట్రాన్స్‌ ఫర్స్‌ కు సంబంధించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించగా… ఆన్‌లైన్‌లో బదిలీల కోసం రూపొందించిన వెబ్‌సైట్ మొత్తం గందరగోళంగా తయారైంది. బదిలీల ప్రక్రియ కోసం ఆరోగ్యశాఖ కమిషనర్ పేరుతో వెబ్‌సైట్ ఏర్పాటు అయ్యింది. ఈ వెబ్ సైట్ ద్వారా బదిలీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఈ వెబ్ సైట్‌కు పోటీగా డూబ్లీకేట్ వెబ్ సైట్ రూపొందడటంతో వైద్యులు అయోమయానికి గురవుతున్నారు. రెండు పోర్టులు ఓపెన్ కావడంతో.. ఏది నిజమో, ఏది నకిలీదో అర్దం కావడంలేదని వైద్యులు ఆవేదన చెందుతున్నారు. ఈ గందరగోళ పరిస్థితులలో బదిలీల ప్రక్రియను వాయిదా వేయాలని వైద్యులు కోరుతున్నారు.

* రాష్ట్ర విభజన సరిగా సాగకపోవడంతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొన్ని శాఖల మధ్య వివాదాలు రాజుకుంటూనే వున్నాయి. తాజాగా విద్యుత్ రంగంలో జీపీఎఫ్‌ వివాదం తెరమీదకు వచ్చింది. తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగుల జీపీఎఫ్‌ సొమ్ము వెనక్కి ఇవ్వాలని ఏపీ విద్యుత్ సంస్థలకు లేఖ రాశారు తెలంగాణ ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు.1999 నుంచి 2014 వరకు తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు దాచుకున్న సొమ్ము రూ. 2900 కోట్లు వుందన్నారు. ఇటీవల ఏపీలోని నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ లలో ఉన్న నిధులు, డిపాజిట్లను ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ లో జమ చేయాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. జీపీఎఫ్‌, గ్రాట్యుటీ, పెన్షన్‌ సొమ్ముపై తెలంగాణ ట్రాన్స్ కో, జెన్కో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

*తెలంగాణ ఆర్టీసీ గరుడ ప్లస్‌ ఏసీ బస్సు ఛార్జీలను తగ్గిస్తున్నట్లు మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాజధాని బస్సు ఛార్జీతో గరుడ ప్లస్‌ బస్సులో ప్రయాణం చేయవచ్చు. ఈ వెసులుబాటు ఈ ఏడాది మార్చి 31వ తేదీ వరకు కల్పించామన్నారు. కర్ణాటక ఆర్టీసీతో సమానంగా అమలు చేస్తున్న ఫ్లెక్సీ ఛార్జీల విధానం అమలులో ఉన్న హైదరాబాద్‌-బెంగళూరు మార్గానికి ఈ వెసులుబాటు వర్తించదన్నారు. నూతన వెసులుబాటుతో హైదరాబాద్‌-విజయవాడ మధ్య ఛార్జీ రూ.వంద తగ్గుతుంది. హైదరాబాద్‌-ఆదిలాబాద్‌ మధ్య రూ.111, హైదరాబాద్‌-భద్రాచలం మధ్య రూ.121, హైదరాబాద్‌-వరంగల్‌ మధ్య రూ.54 ఛార్జీ తగ్గుతుంది. రవాణా రంగంలో ఉన్న పోటీని తట్టుకుని మెరుగైన సేవలు అందించేందుకు ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు సజ్జనార్‌ పేర్కొన్నారు.

*తెలంగాణలో కొత్తగా రెండు ఐటీఐల ఏర్పాటుకు కార్మిక శాఖ ఆమోదం తెలుపుతూ కార్మిక ఉపాధి శిక్షణ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కౌముదిని గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. టీఎ్సఆర్టీసి జోనల్ స్టాఫ్ శిక్షణా కాలేజీకి ఒకటి, నేషనల్ స్మాల్ ఇండస్ర్టీస్ కార్పొరేషన్(ఎన్ఎ్సఐసీ) టెక్నికల్ సర్వీసె్సకి మరొక ఐటీఐ ఏర్పాటు చేయనున్నారు.

*ఈనెల 20న పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో మత్స్యకార అభ్యున్నతి సభ జరగనున్నట్టు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు, పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ విలేకరులకు తెలిపారు. ఈనెల 13న కాకినాడలో మత్స్యకార ప్రాంతాల్లో రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పాదయాత్రను ప్రారంభిస్తారని, ఇది తాళ్లరేవు, ముమ్మిడివరం, పి.గన్నవరం, రాజోలు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని మత్స్యకార గ్రామాల గుండా 19వరకూ కొనసాగుతుందన్నారు. 20న నర్సాపురం సభకు పవన్ హాజరవుతారని తెలిపారు.

*ఏపీ మార్క్ఫెడ్ ద్వారా అనంతపురం జిల్లాలో ఈ నెల 15వరకు మొక్కజొన్న కొనుగోలు చేయనున్నట్లు మార్కెటింగ్శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మధుసూదన్రెడ్డి గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. 2021-22 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో ప్రభుత్వ మద్దతు ధరకు 75వేల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలను జనవరి 31వరకే మార్క్ఫెడ్ ద్వారా సేకరించాలని ప్రభుత్వం నిర్దేశించిందని, అనంతపురం రైతుల ఇబ్బందుల దృష్ట్యా గడువు పెంచిందని పేర్కొన్నారు.

*కరోనా ప్రభావంతో దేశంలో టూరిజం కొంత దెబ్బతిన్న మాట వాస్తవమేనని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నా రు. ప్రస్తుతం కేసులు తగ్గుతు న్నక్రమంలో దెబ్బతిన్న పర్యాట క రంగాన్ని తిరిగి అభివృద్ధి పరిచేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. తిరుమలలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి మనవరాలి పెళ్లికి వచ్చిన ఆయన గురువారం మధ్యాహ్నం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వాలను సమన్వయం చేసుకుంటూ అన్ని రకాలుగా టూరిజాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.

*రాష్ట్ర విభజన నేపథ్యంలో విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులనూ విభజించినందున.. వారికి జీతభత్యాలు, పింఛన్లు చెల్లించేందుకు ఏపీ జెన్కో ఈ ఏడాది జనవరి నాటికి చెల్లించాల్సిన రూ.2,172 కోట్లను చెల్లించాలని తెలంగాణ ట్రాన్స్కో పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ ట్రాన్స్కో సీఎండీ డి.ప్రభాకరరావు.. ఏపీ ట్రాన్స్కో సీఎండీ నాగులాపల్లి శ్రీకాంత్కు బుధవారం లేఖ రాశారు.

*అనంతపురం జిల్లాలోని హిందూపురం మున్సిపల్ కౌన్సిలర్ మారుతిరెడ్డి ఇంట్లో సీబీఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మారుతిరెడ్డిని అదుపులోకి తీసుకుని సీబీఐ గోప్యంగా విచారిస్తున్నది. జడ్జీలనుద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనలో సీబీఐ విచారణ కొనసాగుతున్నది.

*ఉగాది నుంచే కొత్త జిల్లాలు ఏర్పాటు అవుతాయని సీఎం జగన్ తెలిపారు. సీఎస్, ఇతర ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఉగాది నాటికి కొత్త జిల్లాలు ఏర్పాటు అవుతాయన్నారు. ఉగాది నుంచే కలెక్టర్లు, ఎస్పీల కార్యకలాపాలు నిర్వహించాలన్నారు. దానికి సంబంధించిన సన్నాహాలు చేయాలని అధికారులను జగన్ ఆదేశించారు. ప్రస్తుతమున్న కలెక్టర్లు, ఎస్పీలకు కొత్త జిల్లాల బాధ్యతలు అప్పగించాలన్నారు. వీరికున్న అనుభవం కొత్త జిల్లాలకు ఉపయోగపడుతుందని సీఎం అన్నారు. పరిపాలన సాఫీగా సాగడానికి వీరి అనుభవం ఉపయోగపడుతుందని సీఎం తెలిపారు. కొత్త జిల్లాలపై నోటిఫికేషన్ వచ్చిన రోజునుంచే ఓఎస్డీల హోదాలో కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు బాధ్యతలు నిర్వహిస్తారన్నారు