Devotional

గుజరాత్ లో డాలర్ టెంపుల్ TNI ఆధ్యాత్మికం – 17/02/2022

గుజరాత్ లో డాలర్ టెంపుల్ TNI ఆధ్యాత్మికం – 17/02/2022

అమ్మ వారి కోసం ‘డాలర్ టెంపుల్’.. రూ.లక్షలు విలువైన కరెన్సీతో…
‘డాలర్ టెంపుల్​’.. వినడానికి కొత్తగా ఉంది కదా! గుజరాత్​లో వరదాయిని మాతా దేవాలయం ఈ ఏడాది ఉత్సవాల సందర్భంగా ఇలా దర్శనమిచ్చింది. మరి.. డాలర్ టెంపుల్​ను ఓసారి చూసొద్దాం పదండి..!’డాలర్ టెంపుల్​’గా దర్శనమిచ్చిన వరదాయిని మాత ఆలయం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వరదాయిని మాతా దేవాలయం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ ఏడాది ‘డాలర్ టెంపుల్’​గా దర్శనమిచ్చింది. గాంధీనగర్​ పరిధిలోని రూపాల్ గ్రామంలో ఉన్న వరదాయిని మాత ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఏటా ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు జరుగుతుంటాయి. ఉత్సవాల సందర్భంగా పుణ్యక్షేత్రం భక్తజన సంద్రంగా మారుతుంది. గుజరాత్ నలుమూలల నుంచి భక్తులు ఇక్కడి వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లిస్తారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. గ్రామస్థులు ఉత్సవం తొమ్మిదో రోజు మహా పరిషత్ నిర్వహించారు. యూఎస్​ఏలో ఉండే ఓ భక్తురాలు 11,500 డాలర్లను అమ్మవారికి కానుకగా సమర్పించింది. వీటి విలువ మన దేశ కరెన్సీలో రూ.2.5 లక్షలు. నిర్వహకులు ఈ డబ్బులతోనే అమ్మవారిని అలంకరించారు. దేవాలయ ప్రాంగణమంతా డాలర్లతోనే తోరణాలు ఏర్పాటు చేశారు. దీంతో వరదాయిని మాతా దేవాలయం ఈ ఏడాది ‘డాలర్ టెంపుల్’​గా దర్శనమిచ్చింది. దేవాలయానికి కానుకలు అధిక మొత్తాల్లో వస్తుంటాయి. అందులో 50 శాతానికిపైగా ఆలయ నిర్మాణం కోసం ఖర్చుచేస్తారు.

GG
1. బ‌ల్కంపేట ఎల్లమ్మ టెంపుల్‌లో ఎమ్మెల్సీ క‌విత పూజ‌లు
ముఖ్య‌మంత్రి కేసీఆర్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ ఆల‌యంలో మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. అమ్మ‌వారికి బంగారు ఆభ‌ర‌ణాలు స‌మ‌ర్పించారు. సీఎం కేసీఆర్ బ‌ర్త్‌డేను పుర‌స్క‌రించుకొని మృత్యుంజ‌య హోమం నిర్వ‌హించారు. అనంత‌రం అమీర్‌పేట‌లోని గురుద్వార‌లో మంత్రి త‌ల‌సాని, ఎమ్మెల్సీ క‌విత ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు నిర్వ‌హించారు.

2. దివ్యక్షేత్రంలో టికెట్‌ దర్శనం షురూ
రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని సమతామూర్తి టికెట్‌ దర్శనం ప్రారంభమైంది. పెద్దలకు రూ.150, పిల్లలకు రూ.75 గా టికెట్ల ధర నిర్ణయించగా బుధవారం మూడున్నర గంటల వ్యవధిలో 5వేల మంది భక్తులు దర్శించుకున్నారు. 19న శాంతి కల్యాణం నిర్వహించే వరకు సువర్ణమూర్తి దర్శనం, త్రీడీ షోలను తాత్కాలికంగా నిలిపివేశారు.

3. Basara అమ్మవారి ఆలయంలో పౌర్ణమి ప్రత్యేకపూజలు
బాసర సరస్వతీ అమ్మవారి ఆలయంలో బుధవారం పౌర్ణమి పర్వదినాన్ని పురస్క రించుకుని ఆలయ పండితులు ప్రత్యేకపూజలు నిర్వ హించారు. ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవ మూర్తికి గణపతిపూజ, కలశస్థాపన, రక్షాబంధనం, మండపారాధన, పుణ్యహవచనము వంటి వివిధ పూ జలను జరిపారు. లోకకల్యాణార్థం వేదపండితులు చండీహోమం మృత్యుంజయ హోమం, ధన్వంతరి హోమం, శాంతి సూక్తహోమం వంటి హోమపూజలు నిర్వహించారు. ప్రతిపౌర్ణమి రోజున అమ్మవారి ఆల యంలో పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

4. 22 నుంచి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
శ్రీశైలంలో ఈ నెల 22వ తేదీ నుంచి మార్చి 4వ తేదీ వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. మార్చి 1న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రుద్రాభిషేకం, లింగోద్భవం, రాత్రి పాగాలంకరణ, కల్యాణోత్సవం, 2న రథోత్సవం, తెప్పోత్సవం నిర్వహిస్తారు. శ్రీశైలంలో ఉత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు అధికారులతో బుధవారం సమీక్షించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కాగా, శ్రీశైలంలో ఈ నెల 17 నుంచి 21వ తేదీ వరకు భక్తులకు స్వామి స్పర్శదర్శనం కల్పిస్తున్నట్లు దేవస్థానం ఈవో ఎస్‌.లవన్న తెలిపారు.

5. శ్రీవారి దర్శనానికి ఉచిత టోకెన్ల జారీ
తిరుపతిలోని అలిపిరి భూదేవి భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, గోవిందరాజ స్వామి సత్రాల వద్ద తిరుమల శ్రీవారి దర్శనానికి ఉచిత టోకెన్ల జారీ ప్రారంభమైంది. ఆధార్ కార్డు ఆధారంగా రోజుకు 15 వేల ఉచిత టోకెన్లు జారీ చేయనున్నారు. ఈరోజు టోకెన్ తీసుకున్నవారికి 16వ తేదీ నుంచి దర్శనానికి టీటీడీ అనుమతించనుంది. ప్రతి గంటకు 1500 మందికి ఉచిత టోకెన్లను టీటీడీ కేటాయిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఉత్తరాది నుంచి కూడా శ్రీవారి భక్తులు వేలాదిగా తరలివచ్చారు.

6. 22 నుంచి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
శ్రీశైలంలో ఈ నెల 22వ తేదీ నుంచి మార్చి 4వ తేదీ వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. మార్చి 1న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రుద్రాభిషేకం, లింగోద్భవం, రాత్రి పాగాలంకరణ, కల్యాణోత్సవం, 2న రథోత్సవం, తెప్పోత్సవం నిర్వహిస్తారు. శ్రీశైలంలో ఉత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు అధికారులతో బుధవారం సమీక్షించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కాగా, శ్రీశైలంలో ఈ నెల 17 నుంచి 21వ తేదీ వరకు భక్తులకు స్వామి స్పర్శదర్శనం కల్పిస్తున్నట్లు దేవస్థానం ఈవో ఎస్‌.లవన్న తెలిపారు.

7.హనుమాన్‌ జన్మస్థలం అభివృద్ధికి టీటీడీ శ్రీకారం
తిరుమల అంజనాద్రిలో ఆకాశగంగ వద్ద హనుమంతుని జన్మస్థలం అభివృద్ధి పనులకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా సుందరీకరణ పనులకు భూమిపూజను టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి బుధవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి, అయోధ్య రామజన్మభూమి ఆలయ నిర్మాణ ట్రస్టు కోశాధికారి స్వామి గోవింద్‌ దేవ్‌ గిరి మహారాజ్, చిత్రకూట్‌ పీఠాధిపతి రామభద్రాచార్యులు, విశ్వహిందూ పరిషత్‌ సంయుక్త కార్యదర్శి కోటేశ్వర శర్మ పాల్గొన్నారు.టీటీడీ వైఖానస ఆగమ సలహాదారులు, కంకణబట్టార్‌ మోహన రంగాచార్యులు ఆధ్వర్యంలో రుత్వికులు రక్షబంధన పూజ, అంకురార్పణ, పంచగవ్యారాధన, వాస్తుహోమం, శిలలకు వాస్తు దర్శనం, శంఖునకు అభిషేకం, విశేష హోమాలు, రత్నన్యాసం, ప్రథమ శిలాస్థాపన, భూమిపూజ నిర్వహించారు. టీటీడీ మాజీ బోర్డు సభ్యులు(దాతలు) నాగేశ్వరరావు, మురళీకృష్ణ పాల్గొన్నారు.

8. ఓం శ్రీ గురుభ్యోనమః ?
శుభమస్తు ?
17, ఫిబ్రవరి , 2022
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
ఉత్తరాయణము
శిశిర ఋతువు
మాఘ మాసము
కృష్ట పాడ్యమి
బృహస్పతి వాసరే (గురువారం)
శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹
⚜️
శివ రామ గోవింద నారాయణ మహాదేవా
విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనమ్
హరిం నరహరిం రామం గోవిందం దధి వామనమ్
⚜️
రాశి ఫలాలు

? మేషం
ఈరోజు
ముఖ్యవిషయాల్లో అనుభవజ్ఞుల సలహాలు అవసరం అవుతాయి. శత్రువుల జోలికి పోకుండా ఉండటం మంచిది. ఒక వార్త బాధను కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
గణపతి దర్శనం శుభప్రదం
???????

? వృషభం
ఈరోజు
ఒక పనిలో మీకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. ఎవరితోనూ విభేదించకండి. మాట విలువను కాపాడుకోవాలి. ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్న కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
శ్రీరామ నామస్మరణ మేలు చేస్తుంది
???????

? మిధునం
ఈరోజు
అర్థలాభం ఉంది. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. కుటుంబ చిక్కులు ఇబ్బంది పెడతాయి. రుణ సమస్యలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి.
శ్రీసుబ్రహ్మణ్య స్వామి సందర్శనం మేలు చేస్తుంది
???????

? కర్కాటకం
ఈరోజు
ఒక వ్యవహారంలో మీకు కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులు తప్పకపోవచ్చు. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి.
రాహు శ్లోకం చదవడం మంచిది
???????

? సింహం
ఈరోజు
శుభకాలం. అనుకున్న పనులను పూర్తిచేస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ధార్మిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.
ఇష్టదేవతా శ్లోకాన్ని చదివితే మంచిది
???????

? కన్య
ఈరోజు
ప్రారంభించిన పనులలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. కొన్ని సంఘటనలు మనోవిచారాన్ని కలిగిస్తాయి. బంధువులతో విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. దుర్గాదేవిని ఆరాధించాలి
???????

⚖ తుల
ఈరోజు
ప్రారంభించే పనుల్లో సంతృప్తికర ఫలితాలను సాధిస్తారు. మానసికంగా సంతోషాన్ని పొందుతారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.
విష్ణు సహస్ర నామాలు చదివితే మంచి జరుగుతుంది
⚖⚖⚖⚖⚖⚖⚖

? వృశ్చికం
ఈరోజు
ఉత్సాహంగా పనిచేస్తారు. బంధువుల సహకారం ఉంటుంది. ప్రతి విషయాన్ని కుటుంబంతో చర్చించి మొదలుపెట్టాలి.
లక్ష్మీసహస్రనామం చదివితే మంచి జరుగుతుంది
???????

? ధనుస్సు
ఈరోజు
మీలోని పోరాట పటిమ మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. అధికారులు మీపట్ల మిశ్రమ వైఖరితో ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు.
శ్రీ వేంకటేశ్వర దర్శనం శుభప్రదం
మకరం
ఈరోజు
ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ప్రారంభించిన కార్యక్రమాల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి
కుంభం
ఈరోజు
ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. కొన్ని విషయాల్లో ఊహించిన దాని కన్నా ఎక్కువ ఫలితాలు ఉంటాయి.
ఇష్ట దేవతారాధన శుభప్రదం
? మీనం
ఈరోజు
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో అనుకూల సమయం. అధికారులు మీ పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. తోటివారి సహకారంతో ఒక ముఖ్య వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు.
శ్రీ రామ నామాన్ని జపించాలి
సమస్తసన్మంగళాని భవన్తు, ? ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,?
శుభపరంపరాప్రాప్తిరస్తు,?
ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు,
లోకాసమస్తా సుఖినోభవంతు,?
సర్వేజనాః సుఖినోభవ,?

9. కొండమీదరాయా.. గోవిందా
గోవింద నామస్మరణతో బుక్కరాయసముద్రం మార్మోగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తజనం శ్రీదేవి, భూదేవి సమేత కొండమీదరాయుడి దివ్యమంగళరూపం దర్శనంతో పులకించిపోయింది. భక్తుల జయజయ ధ్వానాలు..అర్చకుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ దేవరకొండపై వెలసిన వెంకటరమణుడు భక్తుల చెంతకే చేరేందుకు కొండ దిగిరాగా… బుక్కరాయసముద్రం ఆధ్యాత్మిక సాగరమైంది. మాఘ శుద్ధ పౌర్ణమి సందర్భంగా బుధవారం కొండమీద రాయుని రథోత్సవం రమణీయంగా సాగింది.
*కమనీయం… కల్యాణం
రథోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం తెల్లవారుజాము 4 గంటలకే అర్చకులు బుక్కరాయసముద్రంలోని లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో కొండమీదరాయునికి, శ్రీదేవి భూదేవికి కల్యాణ మహోత్సవం జరిపించారు. 10.30 గంటలకు కొండమీదరాయుడిని భూదేవి, శ్రీదేవిని సూర్య ప్రభ వాహనంపై కొలువుదీర్చారు. రథం ముందర బ్రాహ్మణులు హోమాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. 11.30 గంటలకు రథోత్సవం ప్రారంభం కాగా, జిల్లా నలుమూలల నుంచే కాక కర్ణాటక నుంచి తరలివచ్చిన భక్తులు ‘‘కొండమీదరాయా…గోవిందా’ అంటూ దేవదేవున్ని కీర్తించారు.

10. తిరుమల అంజనాద్రిలో ఆకాశగంగ వద్ద హనుమంతుని జన్మస్థలం అభివృద్ధి పనులకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా సుందరీకరణ పనులకు భూమిపూజను టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి బుధవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి, అయోధ్య రామజన్మభూమి ఆలయ నిర్మాణ ట్రస్టు కోశాధికారి స్వామి గోవింద్‌ దేవ్‌ గిరి మహారాజ్, చిత్రకూట్‌ పీఠాధిపతి రామభద్రాచార్యులు, విశ్వహిందూ పరిషత్‌ సంయుక్త కార్యదర్శి కోటేశ్వర శర్మ పాల్గొన్నారు.టీటీడీ వైఖానస ఆగమ సలహాదారులు, కంకణబట్టార్‌ మోహన రంగాచార్యులు ఆధ్వర్యంలో రుత్వికులు రక్షబంధన పూజ, అంకురార్పణ, పంచగవ్యారాధన, వాస్తుహోమం, శిలలకు వాస్తు దర్శనం, శంఖునకు అభిషేకం, విశేష హోమాలు, రత్నన్యాసం, ప్రథమ శిలాస్థాపన, భూమిపూజ నిర్వహించారు. టీటీడీ మాజీ బోర్డు సభ్యులు(దాతలు) నాగేశ్వరరావు, మురళీకృష్ణ పాల్గొన్నారు.

11. టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. ఆర్జిత సేవా టికెట్ల ధరల పెంపు..
తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మకర్తల మండలి సమావేశం గురువారం జరిగింది. ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో.. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అదేవిధంగా 49 అంశాలతో సిద్ధం చేసిన అజెండాపై చర్చించనున్నారు.
*తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం అన్నమయ్య భవన్‌లో ప్రారంభమైంది. ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో.. 49 అంశాలతో సిద్ధం చేసిన అజెండాపై చర్చించనున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 3 వేల171 కోట్ల రూపాయల అంచనాతో రూపొందించిన బడ్జెట్‌ లో.. శ్రీవారి హుండీ ద్వారా వేయి కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుందని అంచనా వేశారు. కరోనా తీవ్రత తగ్గుతున్న నేపథ్యంలో.. శ్రీవారి దర్శన టిక్కెట్ల పెంపు, శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తుల అనుమతిపై చర్చించనున్నారు. తిరుపతిలో చిన్నపిల్లల ఆసుపత్రి నిర్వహణకోసం సూతన ట్రస్టును ప్రవేశపెట్టడంపై బోర్డు సమావేశంలో చర్చించనున్నారు. సభ్యుల ఆమోదంతో శ్రీవేంకటేశ్వర అపన్న హృదయం పేరిట నూతన పథకం ప్రారంభించనున్నారు. తిరుపతిలో నిర్మిస్తున్న శ్రీనివాస సేతు పనులకు తితిదే వాటాగా 25 కోట్ల రూపాయల నిధుల విడుదలపై నిర్ణయం తీసుకోసున్నారు. తితిదేలో నూతన పీఆర్సి విధానం అమలు చేయడంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
*** భారీ విరాళమిచ్చిన భక్తురాలు
తిరుమల శ్రీవారికి భారీ విరాళం ఇచ్చింది ఓ భక్తురాలు. చెన్నై మైలాపూర్కు చెందిన స్వర్గీయ డాక్టర్‌ పర్వతం పేరిట ఆమె సోదరి రేవతి విశ్వనాథం రూ.9.20 కోట్లు విరాళంగా ఉచ్చారు. అందులో 6 కోట్ల రూపాయలు విలువైన ఆస్థి కాగా… రూ.3.20 కోట్లు బ్యాంకు డిపాజిట్లుగా ఉన్నాయి. విరాళంకు సంబంధించిన పత్రాలను శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి రేవతి విశ్వనాథం అంగజేశారు. బ్యాంకు డిపాజిట్లను చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణంకు వియోగించాలని విజ్ఞప్తి చేశారు. రూ.6 కోట్ల విలువైన ఆస్తులను స్వామివారి పేరిట మార్చనున్నారు. డాక్టర్ పర్వతం కన్నుమూయడంతో ఆమె జ్ఞాపకార్థంగా ఈ ఆస్తిని శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు రేవతి విశ్వనాథం తెలిపారు.