DailyDose

తెలుగు రాష్ట్రాల చరిత్రలో సుదీర్ఘమైన పోరాటం ఇది

తెలుగు రాష్ట్రాల చరిత్రలో సుదీర్ఘమైన పోరాటం ఇది

అమరావతి రాజధాని కోసం ఆ ప్రాంత రైతులు పోరాటాలు చేయడం మొదలుపెట్టి ఇవాళ్టికి 900 రోజులు. తెలుగు రాష్ట్రాల చరిత్రలో చాలా సుదీర్ఘమైన పోరాటం ఇది. అయినా ప్రభుత్వం మెదలలేదు, కరుణించలేదు. కరుణించేలా కూడా లేదు. అమరావతి రాజధాని అనే స్వప్నాన్ని ఈ ప్రభుత్వం సమూలంగా సమాధి చేసేందుకు ప్రయత్నించింది. కానీ ప్రజల అసమానమైన పోరాటాలు, న్యాయవ్యవస్థ మాత్రమే.. ఆ స్వప్నాన్ని ఇంకా సజీవంగా ఉంచుతున్నాయి.
సగంపూర్తయిన నిర్మాణాలను కూడా గాలికి వదిలేయడం వలన.. అమరావతి రాజధాని కోసం కేటాయించిన ప్రాంతం మొత్తం శిథిల నిర్మాణాల మరుభూమిలా కనిపిస్తోండడం గుండెను మెలిపెట్టే చేదు వాస్తవం. హైకోర్టు తీర్పుల తర్వాత కూడా కనీసం 70–80 శాతం పూర్తయిన నిర్మాణాలనైనా ఒక కొలిక్కితీసుకువచ్చి.. అమరావతి నగరానికి కొంత ఊపిరులూదే ప్రయత్నం ప్రభుత్వం చేయకపోవడం దుర్మార్గం, దౌర్భాగ్యం, బాధాకరం.