NRI-NRT

‘తానా’లో  పతాక స్థాయికి చేరిన ఆదిపత్య పోరు

‘తానా’లో  పతాక స్థాయికి చేరిన ఆదిపత్య పోరు

తానాలో  అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి ఫౌండేషన్ అధ్యక్షుడు యార్లగడ్డ వెంకటరమణ వర్గాల మధ్య ఏర్పడిన ఆదిపత్య పోరు పతాక స్థాయికి చేరింది. గురువారం రాత్రి అంజయ్య చౌదరి ఆధ్వర్యంలో నిర్వహించిన తానా ఫౌండేషన్  సమావేశంలో  యార్లగడ్డ వెంకటరమణ ను ఫౌండేషన్ చైర్మన్ పదవి నుండి పోలవరపు శ్రీకాంత్ ను కోశాధికారి పదవి నుండి తొలగిస్తూ తీర్మానించారు. తానా ఫౌండేషన్ లో పదిహేను మంది సభ్యులకు గాను ఎనిమిది మంది సభ్యులు ఈ నిర్ణయాన్ని సమర్థించారు. ఈ సమావేశాన్ని యార్లగడ్డ వర్గం బహిష్కరించింది. 

*ఫౌండేషన్ నూతన  చైర్మన్ గా శశికాంత్ వల్లేపల్లి
ప్రస్తుతం తానా  ఫౌండేషన్ కార్యదర్శిగా ఉన్న శశికాంత్ ఫౌండేషన్ చైర్మన్ గా విద్యా గారపాటినీ కార్యదర్శిగా నియమిస్తూ అంజయ్య వర్గం తీర్మానించింది. మరొక పక్క యార్లగడ్డ వర్గం నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. న్యాయ పోరాటానికి సిద్ధం అయింది. చట్ట ప్రకారం అంజయ్య వర్గం నిర్వహించిన సమావేశం చెల్లదని, ఈ సమావేశం నిర్వహించవద్దని ముందుగానే అటార్నీ ద్వారా నోటీసులు పంపించారు. ప్రపంచంలోనే పెద్ద తెలుగు సంఘంగా గుర్తింపు పొందిన తానా లో నెలకొన్న ఈ  వర్గాల కుమ్ములాటలు ఎక్కడికి దారితీస్తాయో  అని సభ్యులందరూ ఆందోళన వ్యక్తపరుస్తున్నారు.