DailyDose

రూ. 300 కోట్ల మోసానికి పాల్పడ్డ భారత సంతతి వ్యక్తి అరెస్ట్‌ – TNI నేర వార్తలు

రూ. 300 కోట్ల మోసానికి పాల్పడ్డ భారత సంతతి వ్యక్తి అరెస్ట్‌ – TNI  నేర వార్తలు

* నీల్‌ చంద్రన్‌ అనే భారత సంతతి అమెరికన్ దాదాపు రూ. 300 కోట్లకు పైగా మోసానికి పాల్పడ్డాడని అమెరికా న్యాయస్థానం పేర్కొంది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపింది. చంద్రన్‌ తన కంపెనీలలోని పెట్టుబడుదారులకు అధిక ఆదాయం వస్తుందంటూ తప్పుడూ ఆధారాలను చూపి సుమారు 10 వేలమందిని మోసం చేశాడని పేర్కొంది.నేరారోపణ ప్రకారం…”తన కంపెనీలలోని ఒకటి లేదా రెండు కంపెనీలను ‘ViRSE’ అనే బ్యానర్‌తో నిర్వహిచడమేక కాకుండా ఎక్కువ ఆదాయం వస్తున్నట్లుగా చూపించే సాంకేతిక కంపెనీలను చంద్రన్‌ కలిగి ఉన్నాడు. పైగా ఈ కంపెనీలు సంపన్న కొనుగొలుదారుల కన్సార్టియం ద్వారా కొనగోలు చేయబడుతోందంటూ తప్పుడు సాక్ష్యాలు చూపాడు. వాస్తవానికి అతని కంపెనీలో సంపన్న కొనుగోలుదారులు ఉంటేనే పెట్టుబడుదారలకు ఆదాయం వస్తుంది. కానీ చంద్రన్‌ కంపెనీలో అలాంటి సంపన్న కొనుగోలుదారులు ఎవరు లేరు. చంద్రన్‌ పై మూడు ఫ్రాడ్‌ కేసులు, అక్రమంగా పొందిన ఆస్తిలో లావాదేవీలు జరిపినందుకుగానూ అదనంగా మరో రెండు కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు.ఈ చంద్రన్ పై మోపబడిన ఈ అబియోగాలు రూజువైతే మూడు ఫ్రాడ్‌ కేసుల్లో ఒక్కొక్క ఫ్రాడ్‌ కేసుకి 20 ఏళ్లు చొప్పున జైలు శిక్ష , అలాగా అక్రమ నగదు లావాదేవీలకు సంబంధించిన రెండు కేసుల్లో ఒక్కొక్క కేసుకి 10 ఏళ్లు చొప్పున శిక్ష పడుతుందని అమెరికా న్యాయస్థానం పేర్కొంది. అంతేకాదు చంద్రన్‌ వద్ద ఉన్న 39 టెస్లా వాహనాలతో సహా 100 వేర్వేరు ఆస్తులు, బ్యాంకు ఖాతాలు, రియల్ ఎస్టేట్ తదితర ఆస్తులు మోసాలు ద్వారా సంపాదించిన ఆస్తులుగా జప్తు చేయబడతాయని స్పష్టం చేసింది.

*ముంబయి విమానాశ్రయం నుంచి వస్తున్న సమయంలో ఆ నగర శివార్లలో జూన్‌ 22న అపహరణకు గురైన తెలంగాణలోని జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నందగిరికి చెందిన మత్తమల్ల శంకరయ్య ఇంకా కిడ్నాపర్ల చెర వీడలేదు. ఆగంతకులు గురువారం కాళ్లు, చేతులు కట్టేసి శంకరయ్యను బందీగా ఉంచిన ఫొటోను వాట్సాప్‌లో ఆయన కుమారుడు హరీశ్‌కు పంపించారు. అనంతరం ‘రూ.15 లక్షలు ఇస్తేనే వదిలిపెడతాం. మీరు ఎక్కడికి డబ్బులు తెచ్చిస్తారో చెప్పండంటూ’ ఇంటర్‌నెట్‌ ఫోన్‌ ద్వారా మాట్లాడుతూ హరీశ్‌ను బెదిరించారు.

*పశుసంవర్థక శాఖ పేరిట నకిలీ వెబ్‌సైట్‌ సృష్టించి డబ్బులు కాజేసిన సైబర్‌ నేరగాళ్ల ముఠాను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో నంద్యాల జిల్లాకు చెందిన రవి, మధుకుమార్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి ఫోన్, సిమ్ కార్డు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు రవి, మధుకుమార్.. ముఠా పశుసంవర్థకశాఖ పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ రూపొందించింది. ఈ వెబ్‌సైట్‌లో ల్యాబ్ టెక్నిషియన్, ఇతర పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విధంగా దరఖాస్తుల పేరిట ఆన్‌లైన్‌లో డబ్బులు వసూళ్లుకు పాల్పడుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

*తిరుపతి జిల్లాలో అక్రమాలకు పాల్పడిన పోలీసు అధికారులను ఎస్పీ పరమేశ్వరరెడ్డి సస్పెండ్ చేశారు. రూ.20 లక్షల విలువైన సిగరెట్ల మాయంలో ప్రమేయం ఉందని తేలడంతో తిరుచానూరు సీఐ సుబ్రమణ్యం, ఎస్సైలు వీరేష్‌, రామకృష్ణ, రామకృష్ణారెడ్డిపై వేటు వేస్తూ ఆదేశాలు ఇచ్చారు. గోదాం నుంచి సిగరెట్లు పోయాయని ఐటీసీ మేనేజర్ ఫిర్యాదుతో ఎస్పీ పరమేశ్వరరెడ్డి విచారణకు ఆదేశించారు. సిగరెట్ ప్యాకెట్లు పక్కదారి పట్టించడానికి సదరు అధికారులు సహకరించినట్లు విచారణలో తేలింది. రూ.20 లక్షల విలువైన సిగరెట్ల మాయం కేసులో అధికారుల ప్రమేయం తేలడంతో చర్యలకు ఎస్పీ ఉపక్రమించారు.

*గుంటూరు: జిల్లాలోని జీజీహెచ్‌ లో హైడ్రామా నెలకొంది. సోషల్ మీడియా కేసులో అరెస్ట్‌ అయిన గార్లపాటి వెంకటేష్‌ కు సంబంధించి మెడికల్ రిపోర్టు‌ను తారుమారు చేసేందుకు పోలీసు పెద్దలు, ప్రైవేటు ఆస్పత్రి నిర్వాహకులు యత్నించారు. జీజీహెచ్‌లో వెంకేటష్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. విచారణలో భాగంగా సీఐడీ పోలీసులు కొట్టడంతో వెంకటేష్ గాయపడ్డాడు. వెంకటేష్‌కు ఎముక విరిగినట్లు వైద్య పరిక్షలలో వెల్లడైంది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసు పెద్దలు, పలు ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాహకులు… సీఐడీకి అనుకూలంగా రిపోర్ట్ తయారు చేయించేందుకు ప్రయత్నాలు చేపట్టారు. దీనిపై టీడీపీ నేతలు అభ్యంతరం తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులకు జీజీహెచ్ కేసులలో ఏం పని అంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

*తమతమ కస్టడీల్లో ఉన్న పౌర ఖైదీలు, ప్రాదేశిక సముద్ర జలాల్లో పట్టుబడ్డ జాలర్ల జాబితాలను భారత్ , పాకిస్తాన్ పరస్పరం మార్చుకున్నాయి. భారతీయ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 309 మంది పాకిస్తానీ పౌర ఖైదీలు, 95 మంది మత్స్యకారుల లిస్ట్‌ను పాక్‌కు భారత విదేశాంగ శాఖ అధికారులు అందించారు. 49 మంది భారతీయ ఖైదీలు, 633 మంది మత్స్యకారుల జాబితాను భారత్‌కు దాయాది దేశం అప్పగించింది. దౌత్య విధానాల ద్వారా ఇరుదేశాలూ జాబితాలను షేర్ చేసుకున్నాయి. శిక్షాకాలం పూర్తి చేసుకున్న 536 మంది మత్స్యకారులు, ముగ్గురు పౌరులను సత్వరమే అప్పగించాలని ఈ సందర్భంగా భారత్ విజ్ఞప్తి చేసింది. పౌర ఖైదీలు, అదృశ్యమైన భారత రక్షణరంగ అధికారులు, మత్స్యకారులను ముందస్తుగా విడుదల చేయాలని పాక్‌కు అధికారులు విన్నవించారు. భారతీయులుగా నిర్ధారించినవారి జాబితాను కూడా పాక్‌కు అందించామని విదేశాంగ వ్యవహారాల శాఖ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. దౌత్యమార్గాల ద్వారా తమవారిని విడుదల చేయాలని సూచించినట్టు వివరించింది.

**మణుగూరు మండలంలోని గుట్ట మాల్లారంలో సీఐ ముత్యం రమేష్‌, ఎస్‌ఐ రాజ్‌కుమార్‌ సిబ్బందితో కలసి గురువారం జరిపిన దాడుల్లో సుమారు రూ.19.40 లక్షల విలు వైన గుట్కా, అంబర్‌ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. సమితిసింగారం పంచాయతీ పరిధిలోని రాజీవ్‌ గాంధీనగర్‌ ప్రాంతానికి చెందిన తాజుద్దీన్‌ కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌ ప్రాంతం నుంచి ని షేధిత గుట్క, అంబర్‌ ప్యాకెట్లను తీసకువచ్చి మణుగూరు పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నాడు. తా జుద్దీన్‌ వాగుమల్లారం ప్రాంతంలోని తన బాబాయ్‌ ఇంట్లో పెద్దఎత్తున గుట్కా ప్యాకెట్లను నిలువ ఉంచగా సీఐ, ఎస్‌ఐలతోపాటు సిబ్బంది లక్ష్మీనారాయణ, రామకృష్ణ, రవీందర్‌, భాస్కర్‌తో కలసి దా డులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు రూ.19,4 లక్షల గుట్కా, అంబర్‌ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుణ్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌ తరలించినట్లు సీఐ రమేష్‌ తెలిపారు.

*ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పనిచేయకుండా పార్టీలో కొనసాగుతామంటే కుదరదన్నారు. వైసీపీ (YCP) నాయకులు, కార్యకర్తల్లో రెండో ఆలోచన మొదలైందన్నారు. అదే నిజమైతే అందరం నష్టపోతామని అన్నారు. రాష్ట్ర స్థాయి వైసీపీ ప్లీనరీకి హాజరయ్యే కార్యకర్తలకు.. సకల ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత శాసనసభ్యులదేనని మంత్రి బొత్స స్పష్టం చేశారు.

*డీజిల్ సెస్ పెంపు పేరుతో ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) జూలై 1వ తేదీ నుంచి బస్ చార్జీలను పెంచింది. ఈ పెంపును నిరసిస్తూ చిత్తూరు ఆర్టీసీ బస్టాండ్‌లో సీపీఐ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. పెంచిన చార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి రాకముందు బాదుడే బాదుడు అని టీడీపీపై విమర్శలు చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారంటూ ఆందోళనకారులు ప్రశ్నించారు.

*డీజిల్ సెస్ పెంపు పేరుతో ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) జూలై 1వ తేదీ నుంచి బస్ చార్జీలను పెంచింది. ఈ పెంపును నిరసిస్తూ చిత్తూరు ఆర్టీసీ బస్టాండ్‌లో సీపీఐ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. పెంచిన చార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి రాకముందు బాదుడే బాదుడు అని టీడీపీపై విమర్శలు చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారంటూ ఆందోళనకారులు ప్రశ్నించారు.

* వ్యవసాయ పొలంలో నిద్రిస్తున్న ఒక వ్యక్తి(70) దారుణ హత్యకు గురయ్యారు. రాజస్తాన్‌లోని బరన్‌ జిల్లాలో గురువారం అర్థరాత్రి జరిగిందీ దారుణం. హత్యకు గురైన వ్యక్తి కన్హయ్యలాల్‌ మీనా అని, అతడు ఛబ్ర ప్రాంతంలోని ఖెర్ఖెడ గ్రామానికి చెందిన వ్యక్తని పోలీసులు గుర్తించారు. కాగా, ఈ హత్య కేసులో హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్న పది మంది స్థానికులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారిస్తున్నారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో కన్హయ్య తలకు విపరీతంగా గాయాలయ్యాయని తెలిపారు. అతడు చాలా రోజులుగా కుటుంబానికి దూరంగా ఉంటున్నాడని, ఎక్కువ సమయాన్ని వ్యవసాయ పొలంలో గడుపుతుంటాడని స్థానికులు తెలిపినట్లు పోలీసు అధికారి నెరిక్రం పేర్కొన్నారు. అయితే హత్యకు గల కారణం ఇంకా తెలియలేదని, అనుమానితులను విచారిస్తున్నట్లు ఆయన తెలిపారు.

*కర్నూలు: జిల్లాలోని కోసిగి మండల కేంద్రంలోని బసవన్న కొండల్లో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. గత 3, 4 నెలలుగా కొండల్లో సంచరిస్తున్న చిరుత పులి… గోర్రెలు, కోతులను చంపి తిన్నది. చిరుత సంచారంతో గ్రామస్తులు, పొలాలకు వెళ్లే రైతులు, కూలీలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటవీ అధికారులు స్పందించి పులిని బంధించాల్సిందిగా గ్రామస్తులు కోరుతున్నారు.

*కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎలుగుబంట్లు కలకలం రేపుతున్నాయి. ఏదో ఒక ప్రాంతంలో మనుషులపై దాడులకు తెగబడుతున్నాయి. కంబదూరు మండలం ఎర్రబండ గ్రామంలో ఒక మహిళపై ఎలుగుబంటి దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. పొలంలో పనులు చేస్తున్న మహిళపై ఎలుగుబంటి హఠాత్తుగా దాడి చేసింది. చుట్టుపక్కల ఉన్న వారు గట్టిగా కేకలు వేయడంతో కొండ ప్రాంతం వైపు ఎలుగుబంటి పరుగులు పెట్టింది. మహిళకు తీవ్ర గాయాలవడంతో చికిత్స నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

* జూపాడుబంగ్లా మండలంలోని భాస్కరాపురం గ్రామానికి చెందిన గోకారమ్మ (19) భర్తతోపాటు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం… చికిత్స పొందుతూ మృతిచెందింది. పగిడ్యాల మండలం ప్రాతకోట గ్రామానికి చెందిన గోకారమ్మ, భాస్కరాపురం గ్రామానికి చెందిన స్వాములు మూడు నెలల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇరువురి తల్లిదండ్రులు వారిని ఇండ్లలోకి రానీయకపోవడంతో వేరే కాపురం పెట్టారు. ఇరువైపుల కుటుంబ సభ్యులు మాట్లాడటం లేదని మనస్తాపానికి గురై ఈనెల 26న ఇద్దరూ ఇంట్లో విష ద్రావణం తాగి ఆత్మహత్యా యత్నం చేశారు. స్థానికులు వారిని కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ గురువారం గోకారమ్మ కర్నూలు ప్రభుత్వ వైద్య శాలలో మృతిచెందినట్లు ఎస్‌ఐ వెంకట సుబ్బయ్య తెలిపారు. స్వాములు చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

**నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పంటపాళెంలో గ్యాస్‌ లీక్‌ కలకలం రేపింది. ఇమామీ ఎడిబుల్ ఆయిల్ ఫ్యాక్టరీలో విషవాయువు లీక్ అయ్యింది. లీక్ అయిన సమయంలో ఫ్యాక్టరీలో పని చేస్తున్న నలుగురు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. డ్రైనేజీ కాలువ శుభ్రం చేస్తుండగా విషవాయువు లీక్ అయ్యింది.