DailyDose

ప్రజా సమస్యలు పరిష్కరించేందుకే ‘జనవాణి’ – TNI తాజా వార్తలు

Auto Draft

* ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భీమవరంలో జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. భీమవరంలో సమస్యలపై స్థానికులు పవన్‌ దృష్టికి తీసుకొచ్చారు. పట్టణంలో డంపింగ్ యార్డు సమస్య పరిష్కారం కావట్లేదని ఈ సందర్భంగా పవన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను పట్టించుకునే వారే లేకపోయారని పవన్‌ కల్యాణ్‌ మండిపడ్డారు.
* అజాదీకా అమృత్ మహోత్సవ్‌పై వీడియో కాన్ఫరెన్స్‌ ప్రారంభమైంది. ఈ సందర్భంగా స్వాతంత్ర్య దినోత్సవ 75 ఏళ్ల వేడుకపై నేతలు, అధికారులు చర్చించనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రత్యేక భేటీ జరుగనుంది. ఈ నేపథ్యంలో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. కాగా, కేంద్రం నుంచి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, కిషన్ రెడ్డి పాల్గొన్నారు.
*కోస్తాంధ్ర‌..తెలంగాణ‌లో మ‌రో ఐదు రోజుల పాటు విస్తారంగా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని భార‌త వాతావ‌ర‌ణ విభాగం వెల్ల‌డించింది. ఇప్ప‌టికే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణను అతలాకుతలం చేసిన వరుణుడు మరోసారి పలకరించేందుకు సిద్ధమయ్యాడు. రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లోనూ కొన్నిచోట్ల వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. నేడు ఉత్తరాంధ్ర, యానాంలో కొన్నిచోట్ల భారీ వర్షాలు పడతాయని, రేపు జులై 18 తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది.
*విజయవాడ నగరంలో మంకీపాక్స్ కలకలం రేపుతోంది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ కుటుంబంలో చిన్నారికి మంకీ పాక్స్ సోకినట్లు వైద్యులు (Doctors) అనుమానిస్తున్నారు. చిన్నారి శరీరంపై దద్దుర్లు రావడంతో ఆ కుటుంబాన్ని ఐసోలేషన్‌ లో ఉంచి.. వైద్య సేవలు అందిస్తున్నారు. పుణె ల్యాబ్‌ కు చిన్నారి శాంపిల్స్ పంపించారు.అయితే మంకీపాక్స్ లక్షణాలు ఉన్నా.. ఇంకా నిర్ధారణ కాలేదని వైద్యులు తెలిపారు. చిన్నారితోపాటు కుటుంబసభ్యులకు చెందిన నమూనాలను ల్యాబ్‌కు పంపినట్లు డాక్టర్లు చెప్పారు. నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని, అంతవరకు గోప్యంగా ఉంచుతున్నామని అన్నారు. సోమవారం సాయంత్రానికి నివేదిక వచ్చే అవకాశం ఉందని, ప్రస్తుతం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు.
*భద్రాచలం దగ్గర గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. 61.40 అడుగులకు నీటిమట్టం.. 18,48,745 క్యూసెక్కుల నీటి ప్రవాహం మాత్రమే ఉంది. భద్రాచలం దగ్గర మూడో ప్రమాద హచ్చరిక కొనసాగుతుంది. జలదిగ్బంధంలోనే భద్రాచలం ఉంది. వరద నీటి ప్రవాహంతో జనాలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
*సీఎం జగన్‌కు రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథ రామిరెడ్డి లేఖ రాశారు. శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర నిబంధనలు ఉల్లంఘించి తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేస్తోందన్నారు. శ్రీశైలంలో 854 అడుగుల నీరు ఉంటేనే విద్యుత్ ఉత్పత్తి చేయాలనే నిబంధనను తెలంగాణ ప్రభుత్వం పాటించడం లేదని లేఖలో పేర్కొన్నారు. మూడేళ్లుగా రాయలసీమ ప్రాంత వాసులు సాగు చేస్తున్నారని పేర్కొన్నారు. త్రాగు నీటికి ఇబ్బందులు పడుతున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు.
*తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి భక్తులు 31 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పట్టనుంది. శనివారం శ్రీవారిని 84,885 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.35 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. 41,211 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు.
* రాష్ట్రంలో 2030 నాటికి ప్రతి 50 కిలోమీటర్ల పరిధిలో ఒక కేన్సర్‌ చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. శనివారం మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో కేన్సర్‌ చికిత్సలో నూతన విధానంపై ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రజిని మాట్లాడుతూ.. రాష్ట్రంలో విశాఖపట్నం, తిరుపతి, విజయవాడలో కేన్సర్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. తిరుపతిలో చిన్న పిల్లల కేన్సర్‌ కేర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఏర్పాటుచేస్తామని చెప్పారు. ఏపీలో 3.21 కోట్ల మందికి ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ అకౌంట్‌ నంబర్లు ఇవ్వగలిగామని చెప్పారు.
*సీఎం జగన్‌కు రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథ రామిరెడ్డి లేఖ రాశారు. శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర నిబంధనలు ఉల్లంఘించి తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేస్తోందన్నారు. శ్రీశైలంలో 854 అడుగుల నీరు ఉంటేనే విద్యుత్ ఉత్పత్తి చేయాలనే నిబంధనను తెలంగాణ ప్రభుత్వం పాటించడం లేదని లేఖలో పేర్కొన్నారు. మూడేళ్లుగా రాయలసీమ ప్రాంత వాసులు సాగు చేస్తున్నారని పేర్కొన్నారు. త్రాగు నీటికి ఇబ్బందులు పడుతున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు.
*శ్రీసత్యసాయి: జిల్లాలోని పెనుకొండ శెట్టిపల్లితండాలో లలితాబాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక మద్యం అమ్ముతున్నారని ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెన్షన్ ఇవ్వడం లేదని గడపగడపకు మన ప్రభుత్వంలో ఎమ్మెల్యే శంకరనారాయణను లలితాబాయి నిలదీసింది. బైరాపురంలో సచివాలయ నిర్మాణ పనులకు లలితాబాయి వెళ్తుంది. సచివాలయం దగ్గర ఇసుకలో కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లు దొరికినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇసుకలో దాచి కర్ణాటక మద్యం విక్రయిస్తున్నారని లలితాబాయిని అరెస్ట్ చేశారు. కొత్తచెరువు పీఎస్‌లో లలితాబాయిని పోలీసులు విచారిస్తున్నారు.
*ఎల్లంపల్లి ప్రాజెక్టు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 71వేల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు 7 గేట్లను ఎత్తి 64 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటినిల్వ ప్రస్తుత నీటి నిల్వ 16.9679 టీఎంసీలుగా కొనసాగుతుంది.
*భారీ వరదకు నీట మునిగిన కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ పంప్‌ హౌజ్‌ పరిశీలనకు యత్నించిన సోషల్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ నాయకుడు, మాజీ ఐఏఎస్‌ ఆకునూరి మురళిని అడ్డుకున్న పోలీసులు అరెస్టుకు యత్నించారు. పంప్‌హౌజ్‌కు బయలుదేరిన మురళిని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని కాళేశ్వరం గ్రావిటీ కెనాల్‌ వద్ద పోలీసులు ఆపేశారు. దీంతో కాళేశ్వరంలోని హరితహోటల్‌ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రానికి ఐరావతం లాంటిదని గతంలో తాను చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రాజెక్టు డిజైన్‌లో లోపాలు, నాసిరకం నిర్మాణాల వల్ల మోటార్లు ముంపునకు గురయ్యాయని దుయ్యబట్టారు. ఫోర్‌బేకు, పంపులకు మధ్య ఉండే గేర్‌వాల్‌ నాసిరకంగా ఉండడంతో అది కూలి నీరంతా పంప్‌హౌజ్‌లోకి ప్రవేశించిందన్నారు. లక్ష్మీ పంప్‌హౌజ్‌, సరస్వతీ పంప్‌హౌజ్‌లో నీట మునిగిన మోటార్ల మరమ్మతులకు తొమ్మిది నెలల సమయం పడుతుందని చెప్పారు. అంతేకాక రూ.400-500 కోట్లు దాకా ఖర్చు పెట్టాల్సి ఉంటుందన్నారు. వరద ముంపునకు గురి కావడంతో ఈ ఖరీఫ్‌ సీజన్‌లో నీటిని ఎత్తిపోసే పరిస్థితి ఉండదని చెప్పారు. అనంతరం పోలీసులు ఆయన్ను అరెస్టు చేసేందుకు యత్నించగా అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. ఆయన వెంట సోషల్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ కో కన్వీనర్లు డాక్టర్‌ పృథ్వీరాజ్‌, ప్రొఫెసర్‌ లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు. కాగా, మాజీ ఐఏఎస్‌ ఆకునూరి మురళిని పోలీసులు అడ్డుకోవడాన్ని జాతీయ మాలల ఐక్యవేదిక సంఘం ఖండించింది. ప్రాజెక్టు సందర్శనకు పంపిస్తే ప్రభుత్వ అవినీతిని బయటపెడతారని భయపడే మురళిని అడ్డుకున్నారని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర కార్యదర్శి టి. స్కైలాబ్‌ అన్నారు.
* పందెం కోళ్లకు భలే గిరాకీ లభించింది. మార్కెట్‌లో కోడి ధర మామూలుగా రూ.250 – 350 మధ్య ఉంటుంది. పందెం కోడి ధర మాత్రం రూ.30 వేలు పలికింది. సంగారెడ్డి జిల్లా కోర్టులో శనివారం పందెం కోళ్లకు వేలం పాట నిర్వహించారు. ఈ నెల 7వ తేదీన రాత్రి పటాన్‌చెరు మండలం చిన్నకంజర్ల గ్రామంలోని ఓ మామిడి తోటలో కోడి పందాల స్థావరంపై పోలీసులు దాడి చేసి కొందరిని అరెస్టు చేశారు. 31 పందెం కోళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోళ్లను కూడా పోలీసులు కోర్టులో సమర్పించారు. ఆ కోళ్లకు జిల్లా కోర్టు ఆవరణలో శనివారం జిల్లా ఎక్సైజ్‌ కోర్టు న్యాయమూర్తి హన్మంతరావు సమక్షంలో అధికారులు వేలం పాట నిర్వహించారు. 46 మంది బిడ్డర్లు పాల్గొన్న ఈ వేలం పాటలో 31 పందెం కోళ్లను విక్రయించగా రూ.4,46,000 ఆదాయం వచ్చింది. ఇందులో అత్యధికంగా ఒక కోడికి రూ.30 వేల ధర పలికింది.
*గోదావరి వరద పుణ్యమా అని భద్రాచలం కరకట్ట నిర్వహణలో తెలుగు రాష్ట్రాల మధ్య పంచాయతీ బహిర్గతమైంది. రాష్ట్ర విభజన సమయంలో చోటుచేసుకున్న ప్రక్రియ లోపం.. ప్రస్తుతం ప్రజలకు శాపంగా మారింది. వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు భద్రాచలానికి కరకట్ట మంజూరు చేసి నిర్మించారు. రూ.53కోట్లతో ఎగువన ఉన్న యటపాక నుంచి భద్రాచలంలోని శిశుమందిర్‌ వరకు కరకట్టను నిర్మించారు. అయితే రాష్ట్ర విభజనలో భద్రాచలం పట్టణాన్ని తెలంగాణలో ఉంచి యటపాక పంచాయతీని ఏపీలో కలిపారు. దీంతో భద్రాచలం- యటపాక మధ్య కరకట్ట నిర్వహణ ఇరు రాష్ట్రాల పరిధిలోకి చేరింది. అదే ఇప్పుడు సమస్యగా మారింది. ఏపీలో కలిసిన యటపాక వద్ద ఐదు కిలోమీటర్ల మేర కరకట్ట నిర్వహణ లోపభూయిష్ఠంగా మారింది. దాని నిర్వహణను ఏపీ సర్కారు పూర్తిగా విస్మరించింది. కట్టపై ఉన్న తుమ్మచెట్లు, స్లూయిస్‌ల వద్ద నీరు లీకవుతున్నా పట్టించుకోవడం లేదు. గోదావరి 71 అడుగులకు చేరుకోగానే యటపాక వద్ద కరకట్టపై నుంచి వరద ప్రవహించి అక్కడి ఇళ్లను ముంచెత్తింది.
*తెలంగాణ, రాయలసీమ రాష్ట్రాలకు అనుసంధానంగా ఉన్న సప్తనదుల ఆలయం కృష్ణమ్మ ఒడిలో చేరుకోనుంది. శుక్రవారం ఆలయ అర్చకులు గర్భగుడిలో ఉన్న వేపదార శివలింగానికి చివరి రోజు పూజలు, మంగళహారతి ఇచ్చి కార్యక్రమం నిర్వహించారు. శనివారం మధ్యాహ్నం వరకు ఆలయ సగభాగం వరద నీటిలో మునిగిపోయింది.
* రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టడం, పరిస్థితులు అదుపులో ఉండటంతో ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని ఎంసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ గోవర్ధన్‌ వెల్లడించారు. పరీక్షలకు సంబంధించిన వివరాలను శనివారం ఓ ప్రకటనలో వివరించారు. 18, 19, 20 తేదీల్లోని పరీక్షలు షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతాయన్నారు. పరీక్షా సమయం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుందని తెలిపారు. ఈ పరీక్షలకు ఏపీ, తెలంగాణ రాష్ర్టాల నుంచి లక్షా 72వేల 241మంది విద్యార్థులు హాజరవుతారని, ఇందుకోసం తెలంగాణలో 89, ఏపీలో 19 మొత్తం 108 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. పతీ సెషన్‌కు 29వేల మంది హాజరవుతారని, మూడు రోజుల పాటు ఆరు సెషన్లల్లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) పద్థతిలో ఈ పరీక్షలను నిర్వహిస్తామని చెప్పారు. విద్యార్థులు 180 నిమిషాల్లో 160 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది.
*వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మం త్రి ఎర్రబెల్లి దయాకర్‌ హామీ ఇచ్చారు. ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఆయన శనివారం పర్యటించారు. ఏటూరునాగారం మండలంలోని ముల్లెకట్ట గ్రామాన్ని సందర్శించి గోదావరి వరదల కారణంగా నీటమునిగిన ఇళ్లను, ముంపునకు గురైన పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు, ప్రజలకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని మంత్రికి వినతులు సమర్పించారు. అనం తరం మండలంలోని ముల్లెకట్ట హై లెవెల్‌ వంతెన గోదావరి వరద ఉధృతిని మంత్రి పరిశీలించారు. లోతట్టు ప్రాంతాలైన రొయ్యూర్‌, శంకరాజుపల్లి గ్రామాల్లో పర్యటించారు.

*తిరుమలకు బస్సుల్లో వెళ్లే భక్తులకు టీఎ్‌సఆర్టీసీ ప్రత్యేక సౌకర్యం కల్పిస్తోంది. జూలై 1 నుంచి ఆర్టీసీ బస్‌ టికెట్‌ రిజర్వేషన్‌ సమయంలో శ్రీవారి దర్శనం టికెట్‌ను బుక్‌ చేసుకునే సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. ఇకపై తిరుమలకు వెళ్లే భక్తులు రిటర్న్‌ టికెట్‌ తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం లేకుండానే శ్రీవారి దర్శనం టికెట్‌ను బుక్‌ చేసుకోవచ్చని టీఎ్‌సఆర్టీసీ హైదరాబాద్‌ జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పురుషోత్తంనాయక్‌ ్టఒక ప్రకటనలో తెలిపారు. www.tsrtconline.in వెబ్‌ సైట్‌, టికెట్‌ బుకింగ్‌ కౌంటర్‌లలో ఈ ప్యాకేజీని ప్రయాణికులు పొందవచ్చని ఆయన తెలిపారు.
*‘నేనొక క్రీడాకారుడిని.. పొరపాటున పోలీస్‌ అధికారినయ్యా.. నేను ఇప్పటికీ క్రీడాకారుడిగా ఉండడానికి ఇష్టపడతా’ అని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ అన్నారు. హుస్సేన్‌సాగర్‌లో వారం రోజులుగా జరుగుతున్న జాతీయ మాన్‌సూన్‌ రెగట్టా పోటీల ముగింపు వేడుకలకు సీవీ ఆనంద్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం సెయిలింగ్‌ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ట్రోఫీలు బహూకరించారు. కార్యక్రమంలో యాచ్‌ క్లబ్‌ అధ్యక్షుడు సుహీమ్‌ షేక్‌, తెలంగాణ సెయిలింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కేఎస్‌ రావు పాల్గొన్నారు.
*రాష్ట్రంలో ఇకపై పోలీసులు రౌడీల మాదిరిగా ప్రతిపక్ష పార్టీల వారి ఇళ్లపైకి వెళ్లడం సాధ్యం కాదని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయ న్యాయ విభాగం పేర్కొంది. ఈ విభాగం ప్రధాన కార్యదర్శి గూడపాటి లక్ష్మీనారాయణ శనివారం ఇక్కడ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. డబ్ల్యు పి 3568 ఆఫ్‌ 2022 కేసులో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సోమయాజులు ఈ తీర్పు వెలువరించినట్లు ఆయన చెప్పారు.
*రాష్ట్రంలో ఇకపై పోలీసులు రౌడీల మాదిరిగా ప్రతిపక్ష పార్టీల వారి ఇళ్లపైకి వెళ్లడం సాధ్యం కాదని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయ న్యాయ విభాగం పేర్కొంది. ఈ విభాగం ప్రధాన కార్యదర్శి గూడపాటి లక్ష్మీనారాయణ శనివారం ఇక్కడ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. డబ్ల్యు పి 3568 ఆఫ్‌ 2022 కేసులో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సోమయాజులు ఈ తీర్పు వెలువరించినట్లు ఆయన చెప్పారు.
* టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో టీడీపీ పేరిట బోగస్‌ గుర్తింపు కార్డులను సృష్టించి, వాటితో కొందరిని తమ పార్టీలో చేర్చుకుని, ఇక, టీడీపీ పని అయిపోయిందనే విష ప్రచారానికి వైసీపీ నేతలు తెరతీశారు. వివరాలివీ.. చిత్తూరులో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి హాజరవ్వగా, కుప్పం నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ భరత్‌ కొందరిని తీసుకువచ్చారు. వారిని టీడీపీ కార్యకర్తలుగా మంత్రికి పరిచయం చేశారు. వెంటనే మంత్రి వారికి వైసీపీ కండువాలను కప్పి పార్టీలో చేర్చుకున్నట్టు ప్రకటించారు. తర్వాత టీడీపీ గుర్తింపుకార్డులను చూపించమని మంత్రి కోరారు. దీంతో వారంతా చేతిలో ఉన్న కార్డులను చూపించారు. కానీ, ఆ గుర్తింపు కార్డుల్లో ఉన్న పేర్లు, ఫొటోలు వారివి కాదు.
*రాష్ట్రంలో మానవ వనరులు అధికంగా ఉన్నాయని, వారికి అవసరమైన నైపుణ్య శిక్షణ కోసం పశ్చిమ ఆస్ట్రేలియా కలిసి పనిచేయనున్నామని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వెల్లడించారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్న పశ్చిమ ఆస్ట్రేలియా బృందం శనివారం రాష్ట్రానికి రాగా విశాఖపట్నంలో వారితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. మొత్తం ఎనిమిది రంగాల్లో వారితో ఒప్పందాలు చేసుకుంటున్నామని చెప్పారు. విద్యుత్‌, పరిశ్రమలు, గనులు, ఖనిజాలు, విద్య, నైపుణ్యం, తయారీ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి, నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి వారు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అపారమైన సహజ వనరులు, మౌలిక సదుపాయాలు.. పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయని చెప్పారు.
*మాదక ద్రవ్యాల కేసుల విచారణ బాధ్యతలను మరో మూడు అదనపు జిల్లా కోర్టులకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విశాఖ జిల్లా గాజువాకలోని 8వ అదనపు జిల్లా కోర్టు, అనకాపల్లి జిల్లా కేంద్రంలోని 10వ అదనపు జిల్లా కోర్టు, అనకాపల్లి జిల్లా చోడవరంలోని 9వ అదనపు జిల్లా కోర్టులకు ఈ కేసుల విచారణ బాధ్యతను అప్పగించింది. ఈ మేరకు రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి సత్య ప్రభాకర్‌రావు శనివారం గెజిట్‌ విడుదల చేశారు. కాగా, ఇప్పటికే విశాఖ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జికోర్టు-కమ్‌-1వ అదనపు జిల్లా కోర్టు ఈ నార్కొటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపక్‌ పదార్థాల కింద నేరాలను విచారిస్తోంది.
* ప్రెవేటు పాఠశాలల్లో విద్యా హక్కు చట్టాన్ని (ఆర్టీఈ) అమలుచేసి తీరాలని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ చట్టం ప్రకారం పేద విద్యార్థులకు కచ్చితంగా 25 శాతం సీట్లను కేటాయించాలని పేర్కొంది. 2010లో రూపొందించిన ఆర్టీఈ నిబంధనలకు సవరణలు చేస్తూ పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. వీటి ప్రకారం ప్రతి ప్రైవేటు పాఠశాల కనీసం 25 శాతం సీట్లను పేదలకు కేటాయిస్తున్న విషయం ప్రజలకు తెలిసేలా నోటీసు జారీ చేయాలి. ఆ సీట్లను ఉచిత కోటాలో మాత్రమే భర్తీ చేయాలి. మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయన్న విషయాన్ని తెలియజేయడంతో పాటు ఒకటో తరగతిలో గత మూడేళ్ల సగటుకు తగ్గకుండా సీట్లు ఉంచాలి. పాఠశాల విద్యా శాఖ రూపొందించే పోర్టల్‌లో తల్లిదండ్రులు లేదా సంరక్షకులు అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక విద్యార్థి ఒకటి కంటే ఎక్కువ చోట్ల అడ్మిషన్‌ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశముంది. పోర్టల్‌ రూపకల్పన బాధ్యతను పాఠశాల విద్య కమిషనర్‌కు ప్రభుత్వం అప్పగించింది. ఆన్‌లైన్‌లో లాటరీ విధానంలో విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. నోటిఫికేషన్‌ జారీచేసిన మూడు నెలల్లో రాష్ట్రస్థాయి సలహా మండలి ఏర్పాటుచేస్తారు.

* రాజీ చేయదగిన సివిల్‌, క్రిమినల్‌ కేసుల సత్వర పరిష్కారానికి న్యాయమూర్తులంతా కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.గంగారావు కోరారు. శనివారం ఆయన ఏలూరు జిల్లా కోర్టును పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మాట్లాడుతూ కేసుల పరిష్కారంలో.. పశ్చిమ గోదావరి రాష్ట్రంలో 6వ స్థానంలో ఉందని మొదటి, రెండు స్థానాల్లో కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాలు ఉన్నాయన్నారు.
*ప్రతిభావంతులకు అందించే అంబేడ్కర్‌ విదేశీ విద్య పేరును జగనన్న విదేశీ విద్యగా మార్చినట్లు తనకు తెలీదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ అన్నారు. విజయనగరంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మెరిట్‌ విద్యార్థులకే విదేశీ విద్య అందిస్తామని, అందరూ ఫారన్‌ వెళ్లి చదువుకోవాలంటే కుదరదని చెప్పారు. గత ప్రభుత్వంలో విదేశీ విద్యా విధానంలో అవినీతి జరిగిందని ఆరోపించారు. పాఠశాలల విలీనంపై రాష్ట్రవ్యాప్తంగా 270 ఫిర్యాదులు అందాయని, విద్యార్థుల వినతులు, ఉపాధ్యాయుల సమస్యలు దృష్టిలో ఉంచుకుని 117 జీవోను సవరిస్తామని చెప్పారు.
* గోదావరి వరదల్లో దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించేందుకు గురు, శుక్రవారాల్లో పర్యటించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు శనివారం ఆయన తమ పార్టీ నేతలతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో తెలిపారు. గోదావరి వరదలతో వందల గ్రామాల్లో ప్రజలు అల్లాడుతుంటే వారిని ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన మండిపడ్డారు. ‘ఆరు జిల్లాల్లో 550కి పైగా గ్రామాల్లో వరదలు తీవ్ర ప్రభావం చూపాయి. ప్రభుత్వం నుంచి బాధితులకు కనీస సాయం లేదు. ముఖ్యమంత్రి తన కాలికి బురద అంటకుండా గాల్లో హెలికాప్టర్‌లో తిరిగితే ప్రజల కష్టాలు తెలుస్తాయా? సీఎం శ్రద్ధ చూపించకపోవడంతో మంత్రులు, యంత్రాంగం కూడా అదే మాదిరిగా ఉంటోంది. వరదల విషయంలో ప్రతి నిమిషం కూడా విలువైందే. ఆ స్థాయిలో ప్రభుత్వం స్పందించలేకపోయింది’ అని ఆయన వ్యాఖ్యానించారు. బాధల్లో ఉన్న ప్రజలకు చేతనైనంత సాయం చేయాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు.
*వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటించాలని కాంగ్రెస్ సీనియర్ నేత శైలజానాథ్‌ అన్నారు. పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని శైలజానాథ్‌ సూచించారు. తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నా..కేంద్రం స్పందించడం లేదన్నారు.
* విజయనగరం, పార్వతీపురం జిల్లాలో గతుకులడిన 20 రోడ్లు గుర్తించామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. 93 కోట్లుతో టెండరు పిలుస్తామన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 27 రోడ్లు గుర్తించామని చెప్పారు. ఒక్క ఆర్ అండ్ బి పరిధిలో 50 కిలోమీటర్లు రోడ్డు పాడైనట్టు గుర్తించామని చెప్పారు. బాగు కోసం టెండర్లు పిలుస్తున్నామన్నారు. రాష్ట్రంలో 270 స్కూల్స్ లో విలీన సమస్య ఉన్నట్టు కూడా గుర్తించామని మంత్రి పేర్కొన్నారు. ఏఏ స్కూల్స్‌తో సమస్య వుందో తెలియచేయని సంబంధిత శాసనసభ్యులను కోరామన్నారు. అంబేద్కర్ విదేశీ విద్యను జగనన్న విదేశీ విద్యగా పేరు మార్చిన విషయం తనకు తెలియదన్నారు.
*‘నేనొక క్రీడాకారుడిని.. పొరపాటున పోలీస్‌ అధికారినయ్యా.. నేను ఇప్పటికీ క్రీడాకారుడిగా ఉండడానికి ఇష్టపడతా’ అని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ అన్నారు. హుస్సేన్‌సాగర్‌లో వారం రోజులుగా జరుగుతున్న జాతీయ మాన్‌సూన్‌ రెగట్టా పోటీల ముగింపు వేడుకలకు సీవీ ఆనంద్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం సెయిలింగ్‌ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ట్రోఫీలు బహూకరించారు. కార్యక్రమంలో యాచ్‌ క్లబ్‌ అధ్యక్షుడు సుహీమ్‌ షేక్‌, తెలంగాణ సెయిలింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కేఎస్‌ రావు పాల్గొన్నారు.
*తెలంగాణ భాష, సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణకు పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వరంగల్‌ జానపద, గిరిజన విజ్ఞాన పీఠం డాక్టరేట్‌ను ప్రకటించింది. ఆచార్య భట్టు రమేష్‌ పర్యవేక్షణలో ‘‘తెలుగు సినిమాల్లో జానపద కఽథాంశాలు – అధ్యయనం’’ అనే అంశంపై ఆయన పీహెచ్‌డీ పూర్తిచేశారు. తొంభై ఏళ్ల తెలుగు సినిమా ప్రస్థానంలో…‘గులేబకావళి’ నుంచి ‘బాహుబలి’ వరకు వచ్చిన అన్ని జానపద చలనచిత్రాలపై సమగ్రమైన పరిశోధన చేశారు. ఆ సినిమాల చిత్రీకరణలో వాడిన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు 24క్రాఫ్టులకు సంబంధించిన అనేక అంశాల మీద ఈ అధ్యయనం సాగింది. ఈ నెల 20న జరిగే తెలుగు వర్సిటీ స్నాతకోత్సవంలో దీనిని ప్రదానం చేయనున్నారు.