Devotional

అంగరంగ వైభవంగా లాల్‌దర్వాజ బోనాలు – ఆధ్యాత్మిక వార్తలు

అంగరంగ వైభవంగా లాల్‌దర్వాజ  బోనాలు – ఆధ్యాత్మిక వార్తలు

హైదరాబాద్‌లో అమ్మవారి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆషాడమాసం చివరి ఆదివారం లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవం కన్నులపండువగా జరుగుతోంది. తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్దలతో అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు.కాగా, నేడు(ఆదివారం) బోనాల్లో భాగంగా అమ్మవారికి దేవేందర్ గౌడ్ కుమారుడు, కోడలు మొదటి బోనాన్ని సమర్పించారు.
HYD-14-V-jpg-816x480-3g
ఇక, తెలుగు కెరటం, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కూడా బోనమెత్తి అమ్మవారికి బోనం సమర్పించుకుంది. ఈ సందర్భంగా పీవీ సింధును ఆలయ కమిటీ సత్కరించింది. మరోవైపు.. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి దర్శనం కోసం తరలివచ్చారు. రద్దీ పెరగడంతో గంటలపాటు క్యూ లైనులో వేచి చూస్తున్నారు.ఇదిలా ఉండగా.. అమ్మవారి బోనాల నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌, గవర్నర్‌ తమిళిసై సౌందరారాజన్‌ ప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా జీవించేలా అమ్మవారి ఆశీస్సులు కలకాలం కొనసాగాలని సీఎం కేసీఆర్‌ ప్రార్థించారు.
lal-darwaza-bonalu-1
*బోనమెత్తిన వైఎస్ షర్మిల..
తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన మహంకాళి ఆషాఢ బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల బంగారు బోనమెత్తుకున్నారు. అయితే ఆమె ఆలయం లోపలికి వెళ్లి అమ్మవారిని దర్శించుకోలేదు. కేవలం ఆలయం వరకే వచ్చి.. తనతోపాటు తీసుకువచ్చిన బోనాలను లోపలికి పంపించి.. అక్కడకు వచ్చిన భక్తులను ఉద్దేశించి మాట్లాడి వెళ్లిపోయారు.
చరిత్రాత్మక హైదరాబాద్‌ లాల్‌దర్వాజా సింహవాహిని మాతా మహంకాళి ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున పూజల అనంతరం బోనాల సమర్పణతో వేడుకలు ఆరంభమయ్యాయి. గోల్కొండ కోటపై జగదాంబికా అమ్మవారికి మూడు వారాలుగా బోనాల ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఆషాఢ మాసం చివరి ఆదివారం లాల్‌దర్వాజాతో పాటు హరిబౌలి అక్కన్న మాదన్న మహంకాళి, చార్మినార్‌ భాగ్యలక్ష్మీ, గౌలిపురా కోటమైసమ్మ, ఆలియాబాద్‌ దర్బార్‌ మైసమ్మ దూద్‌బౌలి పయనీర్‌ ముత్యాలమ్మ, మీర్‌ ఆలం మండి మహంకాళేశ్వర మందిరంలో వేలాది మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, మహమూద్‌ అలీ, తలసాని.. లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి, ప్రధాన ఆలయాల్లో పట్టువస్త్రాలు సమర్పించారు.
lal-darwaza-bonalu-3
*కోదండరామస్వామివారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ
తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఇందులో భాగంగాసేనాధిపతి ఉత్సవం, మేధిని పూజ, మృత్సంగ్రహణం, అంకురార్పణ ఘట్టాలు నిర్వహించారు . యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక జరిగే దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు ఇవాళ్టి నుంచి 26వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తుంటామని వివరించారు.పవిత్రోత్సవాల్లో భాగంగా మొదటిరోజు ఆదివారం యాగశాలలో పవిత్ర ప్రతిష్ఠ, శయనాధివాసం, జూలై 25న పవిత్ర సమర్పణ, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. జూలై 26న యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగిస్తాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ‌ డిప్యూటీ ఈవో నాగ‌ర‌త్న‌, ఏఈవో దుర్గరాజు, ఆల‌య ప్రధాన అర్చకులు ఆనంద‌కుమార్ దీక్షితులు, సూపరింటెండెంట్‌ ర‌మేష్‌, అధికారులు పాల్గొన్నారు.
Whats-App-Image-2022-07-24-at-2-39-16-PM
*సింహవాహిని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి
ఆషాఢ బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా పాతబస్తీలోని లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారికి దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దంప‌తులు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు.అనంత‌రం అమ్మవారిని ద‌ర్శించుకుని ప్రత్యేక పూజ‌లు నిర్వహించారు. అంతకుముందు మీరాలం మండి శ్రీ మహంకాళేశ్వర అమ్మవారికి, శాలిబండలోని అక్కన్న మాదన్న, అనంతరం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవార్లను దర్శించుకొని ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను సమర్పించారు.ఈ సందర్భంగా మంత్రి మట్లాడుతూ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ బోనాల ఉత్సవాలకు అధిక నిధులు కేటాయిస్తున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వం కేటాయించిన నిధులతో బోనాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు.అమ్మవారి దయ వల్ల రాష్ట్రం సుభిక్షంగా ఉందని, సకాలంలో వర్షాలు కురిసి, పంటలు సంవృద్ధిగా పండుతున్నాయన్నారు. అలాగే మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మహమూద్‌ అలీ పాతబస్తీ లాల్‌దర్వాజ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజలు నిర్వహించారు
Whats-App-Image-2022-07-24-at-2-39-17-PM
Whats-App-Image-2022-07-24-at-2-39-18-PM
Whats-App-Image-2022-07-24-at-2-39-19-PM
Whats-App-Image-2022-07-24-at-2-39-20-PM
Whats-App-Image-2022-07-24-at-2-39-21-PM-1
Whats-App-Image-2022-07-24-at-2-39-21-PM
Whats-App-Image-2022-07-24-at-2-39-22-PM
Whats-App-Image-2022-07-24-at-2-39-23-PM
Whats-App-Image-2022-07-24-at-2-39-24-PM
what is jpg