DailyDose

TNI నేటి నేర వార్తలు

TNI  నేటి నేర వార్తలు

విశాఖ…

మద్యం తాగి వైసిపి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ భర్త సన్నీ వీరంగం.

విశాఖలో సుజాతనగర్ బిఆర్ టిఎస్ రోడ్ లో మద్యం తాగి వైసిపి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ భర్త సన్నీ హల్ చల్

నడి రోడ్డులో కూర్చొని వైసిపి జెండా పట్టుకుని పవన్ కళ్యాణ్ పై బూతులు

పోలీసులతో వాగ్వాదం

బీసీ కులానికి చెందిన వ్యక్తిని అంటూ పోలీసులతో వాగ్వాదం. వైసిపి జెండా పట్టుకుని పవన్ కళ్యాణ్ పై బూతులు.

అదుపులోకి తీసుకొన్న పోలీసులు.

విశాఖ

జనసేన నేత ఇంటి పై వైసీపీ అనుచరులు దాడి

విశాఖపట్నం జనసేన ముక్క శ్రీను ఇంటిపై దాడి చేసిన గాజువాక వైసీపీ అనుచరులు.

దాడిలో ముక్క శ్రీను భార్య కు గాయాలు
పోలీస్ లు ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదు అన్నటు ఆవేదన వ్యక్తం చేస్తున్న
ముక్కశ్రీనూ

సెల్ఫీ వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం చేసిన ముక్క శ్రీను

నెల్లూరు జిల్లా స్క్రోలింగ్.

కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం DCL ఫ్యాక్టరీ వద్ద నడీ రోడ్డుపై యువతిని కత్తితో విచక్షణ రహితంగా నరికిన గుర్తు తెలియని వ్యక్తి.

నార్త్ రాజుపాలెం నుండి మనేగుంటపాడు గ్రామానికి ఆటోలో వెళుతుండగా ఆటోను అపి ఆటోలో ఉన్న యువతిని, బైటకు లాగి కత్తితో నరికిన వ్యక్తి.

తీవ్రంగా గాయపడిన మనేగుంట గ్రామానికి చెందిన చెంచులక్ష్మీ ని వైద్యశాలకు తరలించిన, స్థానికులు.

గత ఏడాది దుర్గగుడిలో ఏసీబీ అధికారుల తనిఖీల్లో పట్టుబడ్డ పలువురు ఉద్యోగులు

పలువురు ఉద్యోగులపై చర్యలు చేపట్టాలని ఆదేశాలు

ఉత్తర్వులు జారీ చేసిన దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్

నిన్న కాక మొన్న ఒక ఉద్యోగికి ప్రమోషన్ ఇచ్చిన ఈవో

సదరు ప్రమోషన్ అందుకున్న ఉద్యోగి కి రివర్స్ ఇ చ్చే అవకాశం

ఏసీబీ నివేదికలు వెలువడుతున్న తరుణంలో ప్రమోషన్ ఇవ్వడం పై విమర్శలు

ఏసీబీ అధికారులు ఇచ్చిన నివేదికల మేరకు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని కమిషనర్ ఉత్తర్వులు

విజయవాడ

సర్పంచులు కరెంటు బిల్లులు కట్టొద్దు…

పంచాయతీరాజ్ ఛాంబర్ పిలుపు…

పాత పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వమే కరెంటు బిల్లును చెల్లించాలన్న ఛాంబర్ అధ్యక్షులు వై.వి.బి రాజేంద్రప్రసాద్…

15వ ఆర్థిక సంఘం నిధులు కరెంటు బిల్లులు చెల్లించమని ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమోను ఉపసంహరించుకోవాలి…

రాజకీయాలకతీతంగా సర్పంచులు ఉద్యమాన్ని ఉధృతం చేసి ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవాలన్న రాజేంద్రప్రసాద్…

రాష్ట్రంలో ఉన్నటువంటి 12,918 గ్రామ పంచాయతీల సర్పంచులు గత సంవత్సన్నర కాలంగా రావలసినటువంటి నిధులు, విధులు, అధికారాల కొరకై రాజకీయాలకతీతంగా పోరాటం చేస్తున్నారు…

వారిని లెక్కచేయకుండా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 14,15 వ ఆర్థిక సంఘం నిధులు 7,669 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించింది…

ఈడబ్బును ఓటు బ్యాంకు పథకాలకు వాడుకొని సర్పంచులు గ్రామీణ ప్రజానీకానికి సమాధానం చెప్పుకోలేని పరిస్థితులు కల్పించింది…

వారు వివిధ రూపాల్లో మండల సమావేశాల బహిష్కరణ, జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు, భిక్షాటనలు , పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ముట్టడి, రాష్ట్రపతికి, ప్రధాన మంత్రికి, కేంద్ర పంచాయతి రాజ్ శాఖ మంత్రికి వినతి పత్రాలు మరియు లేఖల ద్వారా నిరసన కార్యక్రమాలు చేపడుతుంటే అవి కూడా లెక్కచేయటం లేదు…

ఇటీవల 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రెండవ విడత 969 కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీల పి.ఎఫ్.ఎం.ఎస్ ఎకౌంటుకు వేయకుండా పి.డి అకౌంట్ కు జమ చేశారు…

అవికూడా కరెంటు బిల్లులు చెల్లించమని పంచాయతీరాజ్ కమిషనర్ అక్టోబర్ 14న మెమో ఇచ్చారు…

దీనిని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు రాష్ట్ర సర్పంచుల సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. ఆ మెమోని వెంటనే ఉపసంహరించు కోవాలి…

లేని పక్షంలో రాజకీయాలకతీతంగా సర్పంచులు ఆందోళనలను ఉదృతం చేసి తాడోపేడో తేల్చుకుంటామని ప్రభుత్వాన్ని వై.వి.బి రాజేంద్రప్రసాద్ హెచ్చరించారు.

విజయవాడ : రాష్ట్రంలో భారీగా అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టివేత

రూ.11 కోట్ల విలువైన బంగారం పట్టుకున్న కస్టమ్స్‌ అధికారులు

మొత్తం 13.189 కిలోల బంగారం పట్టుకున్న కస్టమ్స్ అధికారులు

రూ.4.24 కోట్ల అక్రమ నగదు పట్టుకున్న కస్టమ్స్‌ అధికారులు

విజయవాడ మీదుగా వెళ్తున్న బస్సులు, రైళ్లల్లో కస్టమ్స్‌ తనిఖీలు

పలు బస్సులు, రైళ్లల్లో తరలిస్తున్న బంగారం, నగదు పట్టివేత

చెన్నై నుంచి సూళ్లురుపేట వస్తున్న ఒక వ్యక్తి వద్ద 5 కిలోల బంగారం స్వాధీనం

ఏలూరు, కాకినాడ, నెల్లూరు, సూళ్లూరుపేట, చిలకలూరిపేటలో కస్టమ్స్ తనిఖీలు

100 మంది అధికారులతో 20 బృందాలుగా వేర్వేరు ప్రాంతాల్లో తనిఖీలు

ఆర్టీసీ బస్సుల్లోనూ తరలిస్తున్న అక్రమ బంగారం, నగదు పట్టివేత

నలుగురిని అరెస్టు చేసి ఆర్థికనేరాల కోర్టులో హాజరు పరిచిన కస్టమ్స్ విభాగం