DailyDose

TNI నేటి తాజా వార్తలు -ఐదు రాష్ట్రాల ఉప ఎన్నికల షెడ్యూల్‌ విడుదల..

TNI  నేటి తాజా  వార్తలు -ఐదు రాష్ట్రాల ఉప ఎన్నికల షెడ్యూల్‌ విడుదల..

వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఐదు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఐదు అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంట్‌ స్థానాలకు ఉప ఎన్నిక జరగనుంది. యూపీ, ఒడిశా, రాజస్థాన్‌, బీహార్‌, చత్తీస్‌గఢ్‌లో ఐదు అసెంబ్లీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈనెల 10న నామినేషన్‌, 17న నామినేషన్లకు చివరి తేదీగా ఖరారు చేశారు. డిసెంబర్‌ 5న పోలింగ్‌, 8న ఓట్ల లెక్కింపు, ఫలితాల ఉంటాయని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

*మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ జగన్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. జగన్ అండ్ కో పేదల బియ్యాన్ని పందికొక్కుల్లా తినేస్తున్నారని ఆరోపించారు. 5.66 లక్షల టన్నుల బియ్యానికి ఏపీ ప్రభుత్వం వద్ద లెక్కల్లేవని కేంద్రం చెప్పిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ.. జగన్ మూడున్నరేళ్ల పాలనలో రూ.7వేల కోట్ల విలువ చేసే బియ్యాన్ని ఇంటింటికి రేషన్ పేరుతో దోచేశాడని విమర్శించారు. నవరత్నాల పేరుతో పేద వాడి నవ నాడుల్ని పిండేస్తూ జేబులు నింపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

*ఉత్తరాంధ్ర జిల్లాల్లోని భూములను తనఖా పెట్టి రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల అప్పులు చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు (Somuveerraju) ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… ప్రభుత్వం మారితే అప్పులను ఎవరు తీరుస్తారని ప్రశ్నించారు. కేంద్ర నిధులతో కట్టిన ఇళ్లకు రాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్లు వేయడం సరికాదన్నారు. వందల కోట్లు విలువ చేసే హితకారిణి సమాజం ఆస్తులను స్వాధీనం సరికాదని… ఆస్తులను ప్రభుత్వపరం చేయటాన్ని వెనక్కి తీసుకోవాలని సోమువీర్రాజు(BJP Leader)డిమాండ్ చేశారు.

*రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, అందుకు టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) కాన్వాయ్ మీద దుండగుడు రాయి విసరడం, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌ గాయం కావడం దానికి తాజా ఉదాహరణ అని కాంగ్రెస్ (Congress) పార్టీ సీనియర్ నేత తులసీ రెడ్డి (Tulasi Reddy) వ్యాఖ్యానించారు. చంద్రబాబుపై దాడిని ఆయన ఖండిస్తూ.. దాడికి పాల్పడ్డ నిందుతుడిపై తక్షణమే చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో లాండ్, శాండ్, మైన్, వైన్, ఎర్రచందనం మాఫీయాలు వీరవిహారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. వీటికి తోడు రేషన్ (బియ్యం) మాఫీయా తోడైందన్నారు. ప్రతి నెల 1.5 లక్షల టన్నుల బియ్యం బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతోందని, నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేయకపోవడమే అందుకు కారణమన్నారు. సబ్సిడీ బియ్యం పథకం ద్వారా నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేయాలని తమ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో పేదల ఇళ్లను ప్రభుత్వం జేసీబీలతో కూల్చడం దుర్మార్గమని పేర్కొన్నారు.

*కర్నూలు నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహాన్ని గురువారం ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా పార్టీ కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, గౌరు వెంకటరెడ్డి, కర్నూలు, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జిలు టీజీ భరత్‌, గౌరు చరితారెడ్డితో పాటు నాయకులు, కార్యకర్తలు అభిమానులతో కలిసి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమిశెట్టి వెంకటేశ్వర్లు, గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ మొట్టమొదటి సారిగా కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మహానేత ఎన్టీ రామారావు అని, ఆయన పాలనలో ఎంతో మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారు రాజకీయంగా ఎదిగారని అన్నారు. అలాంటి మహానేత నెలకొల్పిన తెలుగుదేశం పార్టీ పచ్చజెండా కింద పని చేయడం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందన్నారు. ఈ నెల 12వ తేదీన పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చేతుల మీదుగా విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంటుందని సోమిశెట్టి వెంకటేశ్వర్లు ప్రకటించారు.

*చంద్రబాబు (Chandra Babu) డైరెక్షన్‌లోనే పవన్ (Pawan) నడుస్తున్నాడని మంత్రి రోజా ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం మంచిదికాదని, అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదన్నారు. పవన్‌ ఏం ఉద్ధరించడానికి ఇప్పటం గ్రామానికెళ్లారని ప్రశ్నించారు. ఆక్రమణల గురించి ఇప్పటం గ్రామస్థులకు అధికారులు 6 నెలల ముందే నోటీసులిచ్చారని చెప్పారు. లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు

*స్వతహాగా డాక్టర్ అయిన తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సందర్భం వచ్చిన ప్రతిసారి తానొక వైద్యురాలిననే విషయం గుర్తు చేస్తుంటారు. తాజాగా జరిగిన ఓ సంఘటనలో గవర్నర్ తమిళిసై మానవత్వాన్ని చాటుకున్నారు.పుదుచ్చేరి నుంచి హైదరాబాద్ కు వస్తుండగా చెన్నై సమీపంలో ఓ యువకుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.విషయం గమనించి కారును ఆపిన గవర్నర్ అతనికి ప్రాథమిక చికిత్స అందించారు.అనంతరం అంబులెన్స్‌ను అక్కడికి పిలిపించారు. ఆస్పత్రి వారితో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని కోరారు. అనంతరం గవర్నర్‌ తమిళిసై హైదరాబాద్‌కు చేరుకున్నారు.రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వారిని వీలైనంత త్వరగా ఆస్పత్రికి తరలించగలిగితే ప్రాణాలు నిలబెట్టిన వారమవుతామని గవర్నర్‌ అన్నారు. అదే విధంగా రోడ్డుపై ప్రయాణించేటప్పుడు కాస్త అప్రమత్తంగా ఉండాలని సూచించారు.మితి మీరిన వేగం మన ప్రాణాలకే కాదు ఎదుటి వారి ప్రాణాలకు కూడా ముప్పేనని అన్నారు.

*మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం అనే చిన్న గ్రామంలో తెదేపా, జనసేన సానుభూతిపరులు, కార్యకర్తలకు చెందిన 53 ఇళ్లు, ప్రహరీలు కూల్చివేసిన విషయం తెలిసిందే.జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చామనే కక్షతోనే ఇళ్లను కూల్చారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో ఇప్పటంలోని బాధితులను పరామర్శించి వారికి సంఘీభావం తెలిపేందుకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మంగళగిరిలోని పార్టీ కార్యాలయం నుంచి ఇప్పటం బయలుదేరారు. పవన్‌ పర్యటన దృష్ట్యా అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు పవన్‌ వెళ్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో ఆయన కారు దిగి కొద్ది దూరం కాలినడకన వెళ్లారు. కొద్ది దూరం వెళ్లాక తన వాహనంలో ఇప్పటం గ్రామానికి చేరుకున్నారు. పవన్‌కల్యాణ్‌ను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇప్పటం చేరుకున్న జనసేనాని.. అక్కడ కూల్చివేసిన నివాసాలను పరిశీలిస్తున్నారు. పవన్‌ పర్యటన దృష్ట్యా ఇప్పటం గ్రామాన్ని పోలీసులు తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

*జవహర్ నగర్ పరిధిలో ఈతకు వెళ్లి 6 గురు మృతిమల్కారo చెరువులో ఈతకు వెళ్లిన 5 గురు పిల్లలు
వారిని రక్షించడానికి వెళ్ళిన వ్యక్తి కూడా మృతి చెందినట్లు సమాచారంలోతు అంచనా వేయలేక , ఈత సరిగా రాక మృతి చెందినట్లు తెలుస్తోంది

*ప.గో.జిల్లా…. భీమవరం srkr ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ లో సెకండియర్ విద్యార్థులు మద్య ఘర్షణ
ఒక విద్యార్థిని దారుణంగా కొట్టిన నలుగురు విద్యార్థులు.ఆలస్యంగా వెలుగుచూసిన సంఘటన, సోషల్ మీడియాలో వీడియోస్ వైరల్.భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థి.విద్యార్థులు ఐదుగురు ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్.

* తీవ్రమైన వాయుకాలుష్య కోరల్లో చిక్కిన ఢిల్లీలో అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు ప్రారంభించింది. ఢిల్లీ పరిధిలోని అన్ని విద్యా సంస్థలకు శనివారం నుంచి సెలవులు ప్రకటించింది. పరిస్థితి మెరగయ్యేవరకు బంద్‌ పెట్టాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగుల్లో యాభె ౖశాతం మందికి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అమలు చేయనుంది. ప్రైవేటు సంస్థలు సైతం ఇందుకు సిద్ధం కావాలని కోరింది. మార్కెట్ల పనివేళలను కుదించింది. అత్యవసర రవాణా సేవలు, ఎలెక్ట్రిక్‌, సీఎన్‌జీ వాహనాలను తప్పించి అన్నిరకాల ట్రక్‌లను, డీజిల్‌ వాహనాలను నిషేధించింది. శుక్రవారం మీడియాకు ఈ వివరాలను రాష్ట్ర పర్యావరణశాఖ మంత్రి గోపాల్‌ రాయ్‌ వెల్లడించారు. సరిహద్దుల్లోని పంజాబ్‌లో పంట వ్యర్థాలను భారీఎత్తున తగలబెట్టడానికితోడు ఈ సారి దీపావళి మూడురోజులూ పెద్దఎత్తున బాణసంచా కాల్చడంతో ఢిల్లీలో గాలి నాణ్యత ప్రమాదకరస్థాయిలో పడిపోయింది.

* రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 7వ తేదీన ప్రైవేట్‌ వాటర్‌ ట్యాంకర్ల(Water tankers) లారీల సమ్మె జరుగనుంది. ఈ మేరకు లారీ యజమానుల సంఘం శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ఈ సంఘ సమావేశం పళ్ళిక్కరణైలోని కల్యాణమండపంలో శుక్రవారం ఉదయం జరిగింది. ఈ సమావేశంలో వాటర్‌ ట్యాంకర్‌ లారీలను తహసీల్దార్లు తరచూ అనుమతి లేకుండా నీరు తీసుకెళుతున్నారంటూ తప్పుడు కేసులు బనాయిస్తున్నారని సంఘం నిర్వాహకులు ఆరోపించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వాటర్‌ ట్యాంకర్‌ లారీల యజమానుల సంఘం అధ్యక్షుడు నిజలింగం మాట్లాడుతూ- రెవెన్యూ అధికారులు ట్యాంకర్‌ లారీలను తరచూ పట్టుకుని జరిమాన విధిస్తుండటాన్ని ఖండిస్తూ ఈ నెల 7న సమ్మెలో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఆ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 25 వేల వాటర్‌ ట్యాంకర్‌ లారీలతో నీటి సరఫరా నిలిపివేస్తున్నామన్నారు. ఈ సమ్మెను విజయవంతం చేయడానికి కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాలని కోరారు.

* ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో దోషికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ నాంపల్లి లోని 12వ ఆదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి కవిత శుక్రవారం తీర్పు నిచ్చారు. బాలికపై పలు మార్లు లైంగిక దాడికి పాల్పడిన చింతల్‌కు చెందిన ఏ.వినోద్‌రావుపై 2017లో సైదాబాద్‌ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. జడ్జి కేసు పుర్వాపరాలు పరిశీలించి శుక్రవారం అతడికి 20 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా విధించారు.

* పవిత్ర ధనుర్మాసంలో ఈ ఏడాది డిసెంబరు 17 నుంచి 2023 జనవరి 14వ తేదీ వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో తిరుప్పావై ప్రవచనాలు ప్రవచించేందుకు అర్హులైన విద్వాంసుల నుంచి అంగీకార పత్రాలను టీటీడీ ఆహ్వానిస్తోంది. నవంబరు 25వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ‘ప్రత్యేకాధికారి, ఆళ్వార్‌ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్‌, శ్వేత భవనం, టీటీడీ, తిరుపతి-517502’ చిరునామాకు అంగీకార పత్రాలను పంపాల్సి ఉంటుంది.

* సోషలిజమే అన్ని సమస్యలకూ సరైన పరిష్కారమని సీపీఐ రాష్ట్ర సమితి పేర్కొంది. ఈనెల 7న సోషలిస్టు దినోత్సవాన్ని పురస్కరించుకుని సోషలిస్టు విప్లవ ప్రాధాన్యాన్ని వివరిస్తూ అన్ని ప్రాంతాల్లో సభలు నిర్వహించాలని శుక్రవారం విజయవాడలో జరిగిన సీపీఐ రాష్ట్ర సమితి సమావేశం తీర్మానించింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు అజీజ్‌పాషా రాష్ట్ర, జాతీయ రాజకీయ పరిణామాలపై నివేదికలు సమర్పించారు.

* తనకు సంబంధం లేని విషయంలో కలగజేసుకుని ఓ మహిళను కడుపుపై తన్నిన ఓ ఎంపీటీసీ భర్త దాష్టీకమిది.బాధితురాలు అనురాధ(40) కథనం మేరకు….తొట్టంబేడు మండలం తాటిపర్తిలో అన్నదమ్ములైన కమలాకర నాయుడు, సుధాకర నాయుడు మధ్య తల్లికి చెందిన పొలం పంపకంపై వివాదం నడుస్తోంది. గురువారం సుఽధాకర్‌ పొలం దున్నేందుకు సిద్ధంకాగా కమలాకర్‌ అడ్డుకున్నాడు. ఈ దశలో సుధాకర్‌ తరపున ఓ ఎంపీటీసీ భర్త వకాల్తా పుచ్చుకుని కమలాకర్‌పై దాడికి దిగాడు. ఈ దశలో ఆయన భార్య అనురాధ దాడిని అడ్డుకునేందుకు యత్నించింది.దీంతో ఆ ఎంపీటీసీ భర్త తనను బూతులు తిడుతూ, పొత్తికడుపుపై కాలితో తన్ని, మెడ నులిమి చంపడానికి యత్నించినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అనురాధ పేర్కొన్నారు. ఈ క్రమంలో తన బంగారు మంగళసూత్రం కూడా కనిపించకుండా పోయిందని తెలిపారు. పొత్తికడుపుపై దాడి కారణంగా తీవ్రంగా రక్తస్రావం కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరినట్లు చెప్పారు. మెరుగైన చికిత్స నిమిత్తం వైద్యులు ఆమెను తిరుపతి రుయాకు తరలించినట్లు తెలిపారు. దాడి విషయమై ఫిర్యాదు అందిందని, కేసు దర్యాప్తులో వుందని ఎస్‌ఐ రాఘవేంద్ర తెలిపారు.

* వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మండల టీడీపీ అధ్యక్షుడు విశ్వనాథనాయుడు ఆరోపించారు. శుక్రవారం రాత్రి నందిగామలో చంద్రబాబు కాన్వాయ్‌పై జరిగిన రాళ్ల దాడికి నిరసనగా టీడీపీ నేతలు, కార్యకర్తలు శాంతిపురంలో ధర్నాకు దిగారు.

* శ రాజధాని ఢిల్లీలో వాతావరణ కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతున్నది. మహా నగరాన్ని దట్టమైన పొగ కమ్మేసింది. దీంతో వాయు నాణ్యత దారుణంగా పడిపోతున్నది. శనివారం ఉదయం ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (AIQ) 431గా నమోదయింది. ఇక రాజధాని ప్రాతంలో ఉన్న ధిర్పూర్‌లో అత్యధికంగా ఏఐక్యూ 534గా ఉండగా నోయిడాలో 529, గురుగ్రామ్‌లో 478 నమోదయింది. దీంతో ప్రజలు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందిపడుతున్నారు.

*భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ క్లియరెన్స్‌పై హైకోర్టు తీర్పునిచ్చిందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు తీర్పుపై కలెక్టర్, అధికారులతో సమీక్ష నిర్వహించామని చెప్పారు. తీర్పులోని అంశాలు ఒకటో, రెండో పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. రైతులను ఒప్పించి భూములను సేకరిస్తామన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి మార్గం సుగమమైంది. భూసేకరణ నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. ఆ నోటిఫికేషన్‌ చట్టబద్ధమైనదేనని తేల్చిచెప్పింది. ‘ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం మొత్తం 2700 ఎకరాలు సేకరించేందుకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. అందులో 2200 ఎకరాలను ఎయిర్‌పోర్టు అభివృద్ధికి వినియోగిస్తుండగా, మరో 500 ఎకరాలు అనుబంధ కార్యకలాపాలకోసం ఉపయోగిస్తున్నారు. భూమిని సేకరించినందుకు భూయజమానులకు ఇప్పటికే రూ.678 కోట్లు చెల్లించారు. ఎయిర్‌పోర్టు అభివృద్ధికి మొత్తం 2200 ఎకరాలు అవసరం కాగా, రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో 2064 ఎకరాలు ఉంది. 1959 మంది భూయజమానుల్లో 1937మంది భూసేకరణ అవార్డు పాస్‌ చేసేందుకు ఆమోదం తెలిపారు. వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉండగా భూమిని ఇచ్చేందుకు మరికొందరు అంగీకరించారు. కేవలం 37.15 ఎకరాలే ఇంకా సేకరించాల్సి ఉంది. వ్యాజ్యాల్లో జోక్యం చేసుకొనేందుకు న్యాయపరమైన అంశాలేమీ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో విస్తృత ప్రజాప్రయోజనాల దృష్ట్యా వ్యాజ్యాలను కొట్టివేస్తున్నాం’ అని హైకోర్టు పేర్కొంది.

*బీజేపీ (BJP) కార్యాలయంలో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లా నేతలతో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ (Bandi sanjay) కీలక సమావేశం నిర్వహించారు. ఈనెల 12న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra modi) తెలంగాణ పర్యటన ఏర్పాట్లపై చర్చించనున్నారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌ను జాతికి అకింతం చేసేందుకు మోదీ రామగుండం వస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీ బహిరంగ ఏర్పాటుకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది.

*రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి హైదర్‌గూడ సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదంలో బైకిస్ట్‌ మృతి చెందాడు. పీవీ ఎక్స్ ప్రెస్ వే 159 పిల్లర్ వద్ద బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ చక్రాల కింద పడి శంషాబాద్‌కు చెందిన పానుగంటి నరేందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

*భోలక్‌పూర్‌ ఇందిరానగర్‌లో అక్రమంగా నిల్వ చేసిన 500 కాల్షియం కార్బేట్‌ డబ్బాలను ముషీరాబాద్‌ పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. అందుకు బాధ్యులైన ఇద్దరు వ్యక్తులను అరెస్టుచేశారు. వాటి విలువ రూ.40 లక్షలు ఉంటుం దని అంచనా వేశారు. ఎక్స్‌ప్లోజ్‌ నిబంధనలకు విరుద్ధంగా వాటిని నిల్వచేశారని గుర్తించారు. ఇందిరానగర్‌లో నివ సిస్తున్న ఇషాక్‌ (31), ఖలీద్‌(34) గత 30 ఏళ్ల నుంచి గుజరాత్‌, రాజస్థాన్‌ నుంచి పేలుడు స్వభావం గల కాల్షియం కార్బేట్‌ను అక్రమంగా నిల్వచేసి వ్యాపారం సాగిస్తున్నారు. వెల్డింగ్‌ పనులకు ఉపయోగించే ఈ పదార్థాలను కేజీల చొప్పున విక్రయిస్తున్నారు. నీరు తగిలితే కెమికల్‌ రియాక్షన్‌ ఏర్పడే కాల్షియం విక్రయానికి కలెక్టర్‌ అనుమతి తప్ప నిసరి. అంతేకాకుండా జనావాసాలకు దూరంగా విక్ర యాలు సాగించాలి. అయితే వారిద్దరూ ప్రభుత్వ అనుమతి లేకుండా జనావాసాల మధ్య దర్జాగా వ్యాపారం సాగి స్తున్నారు. దీనిపై సమాచారం అందడం తో సీఐ జహంగీర్‌యాదవ్‌, ఎస్‌ఐ స్వప్న తమ సిబ్బందితో కలిసి గోడౌన్‌పై దాడిచేసి నిల్వచేసిన 500 కాల్షియం డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. ఎక్స్‌ప్లోజీవ్‌ చట్టంకింద కేసు నమోదు చేసి వారిద్దర్నీ అరెస్ట్‌ చేశారు.

*వానాకాలం వరిధాన్యం కొనుగోళ్లకు జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టింది. యాసంగిలో ధాన్యం కొనుగోలు వ్యవహారం రాజకీయ వివాదంగా మారడంతో పలు సమస్యలు ఉత్పన్నమైనా వానాకాలం కొనుగోళ్లు వరికోతలతోనే ప్రారంభమయ్యాయి. దీంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లావ్యాప్తంగా 350 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులు పండించిన ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగానే ఇప్పటికే 97 కేంద్రాలు ప్రారంభించి కోటి 38 లక్షల రూపాయల విలువచేసే 669 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలుతో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ వానాకాలంలో రైతులు జిల్లావ్యాప్తంగా 2.7 లక్షల ఎకరాల్లో వరినాట్లు వేశారు. వాతావరణం అనుకూలించడంతో ఎకరాకు దొడ్డు రకం వడ్లు 23 నుంచి 25 క్వింటాళ్లు, సన్నరకం వడ్లు 20 నుంచి 22 క్వింటాళ్లు దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. జిల్లాలో సాగైన వరి విస్తీర్ణంలో సుమారు 30 నుంచి 40 వేల ఎకరాల్లో సన్నరకాలను రైతులు సాగు చేశారు. ముందుగా వరినాట్లువేసిన హుజూరాబాద్‌ డివిజన్‌లో కోతలు ముందుగా ప్రారంభమయ్యాయి. ఈ నెలాఖరుకల్లా వరికోతలు ముమ్మరంగా సాగి మూడో వంతు పూర్తవుతాయని భావిస్తున్నారు.