DailyDoseNRI-NRT

దుబాయిలో ఘనంగా కార్తీక వన సమారాధన

దుబాయిలో ఘనంగా కార్తీక వన సమారాధన

అన్ని మాసాలయందు కార్తీక మాసం ఉత్తం, దానికి సమానమైన మాసమేమి లేదు. ఆహ్లదకరమైన పచ్చని వాతవారణంలో ప్రకృతిను అస్వాధిస్తూ చేసే దేవుడి ఆరాధాన విశిష్ఠమైంది. కార్తీకంలో శివుడికి అలంకారాలతో, రాజోపరాచాలతో, నైవేద్యాలతో పనిలేదు. కార్తీకంలో తెలుగు కుటుంబాలు ఏ దేశమేగినా ఎందు కాలిడినా కార్తీక కర్తవ్యాన్ని పాటిస్తారు, అది నిస్సారమైన ఎడారయినా లేదా పచ్చని పొదల ఉద్యవనాలైనా మరో ప్రదేశమైనా భక్తి, ఆరాధానకు అడ్డంకి కాదు.సదా పని ఒత్తిడి మరియు కిక్కిరిసిన రోడ్లపై ట్రాఫీక్, నిద్ర లేమితో దుబాయి ఆకాశ హర్మ్యాల మధ్య యాంత్రిక నగర జీవనానికి దూరంగా ప్రశాంత వాతావరణంలో దుబాయి, రాస్ అల్ ఖైమాలలోని ప్రవాసీ తెలుగు కుటుంబాలు తెలుగు తరంగిణి మరియు తెలుగు అసోసియెషన్ సంఘాల అధ్వర్యంలో కార్తీక వనభోజనాలను ఆదివారం ఆత్మీయంగా, సంప్రదాయకబద్ధంగా అధ్యాత్మికతో నిర్వహించారు.
Whats-App-Image-2022-11-21-at-4-04-59-PM-1
Whats-App-Image-2022-11-21-at-4-04-59-PM
రాస్ అల్ ఖైమాలోని సువిశాలమైన అల్ సఖర్ పార్కులో జరిగిన ఈ కార్యక్రమంలో తులసి, ధాత్రి (ఉసిరి), మారేడు, అశ్వత్ద తదితర దేవత వృక్షాలను శోభారాణి సమకూర్చగా దానికి అందరు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. తులసీ మాతకు హారితి ఇచ్చి కార్తీక దీపాలను వెలిగించిన అనంతరం సురేశ్ – శోభారాణిల కూతరు పదిహెనళ్ళ కుమారి భార్గవి శ్లోక పఠనంతో మహిళలలో భక్తితో హృదయం పరివశించిపోయింది. అందరు కలిసి అరిటాకులలో చేసిన సహపంక్తి భోజనాలు ఆత్మీయుతను అలుకబోసాయి. అంతర్జాతీయ కృష్ణ తత్వ సమాఖ్య (ఇస్కాన్) ప్రతినిధులు కార్తీక మాసం ప్రాముఖ్యతను వివరించారు. తన వాకచతుర్యంతో మాటాల గారడిగా పేరోంది దుబాయిలో వివిధ తెలుగు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించె ముసునూరి మైథిలీ మోహాన్ ఇక్కడ కూడ తన చరుతతో సందర్భానుసారం వ్యాఖ్యాలు చేస్తూ అహుతులను ఉత్సహాపరిచారు. ఉండమ్మా బొట్టు పెడుతా అనే కార్యక్రమం అందర్ని ఆకర్షించగా అందులో కృష్ణ ప్రియ, శ్రీలత ప్రధమ, ద్వితియ బహుమతులను గెలుచుకోన్నారు. బాండ్ బంధన్ లో ఆశా రాణి, పావని విజయలక్ష్మి లు ఫ్యాన్సీ డ్రెస్ పోటిలలో సహాస్ర,పునవ్, జాస్వీన్ లు బెలూన్ పోటీలలో అంశులా, గోపాల్, రాణి, వెంకట్, సతీష్, దివ్య మరియు బాలుర బెలూన్ పోటీలలో అభినల్ ఇతర పోటీలలో విజేతలుగా నిలిచిన అఖిల, హేమ, భువనేశ్, మెహర్ శాశంక్ లకు బహుమతులు ప్రధానం చేసారు. లుగు తరంగిణి అధ్యక్షులు వక్కలగడ్డ వెంకట సురేశ్ ఉపాధ్యక్షులు యం.వి.యస్.కె. మోహాన్ కార్యదర్శి కోకా సత్యానంద కోశాధికారి చామర్తి రాజేశ్ దిరిశాల ప్రసాద్ తెలుగు అసోసియెషన్ పక్షాన దినేష్, మసీయోద్దీన్, బలుస వివేకానంద తదితరులు కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. హైద్రాబాద్ లోని శ్రీ వాసవి గ్రూప్, జాయ్ లుకాస్, మల్బార్ గోల్డ్ స్పాన్సర్లుగా వ్యవహరించారు.కార్తీక మాసం మోదలయినప్పటి నుండి ఏమిరేట్స్ లోని తెలుగు సంప్రదాయక తెలుగు కుటుంబాలన్ని కూడ తమ భక్తి పారవశ్యాన్ని ఆనందోత్సవాల మధ్య చాటుతున్నారు. వ్యక్తిగతంగా తమ తమ ఇళ్ళలో సహస్ర లింగార్చన తదితర ధార్మిక కార్యక్రమాలను జరుపుకోంటున్నారు.