Movies

సంచలనాలు సృష్టించిన పోరాటం సినిమా గుర్తుందా??

సంచలనాలు సృష్టించిన పోరాటం సినిమా గుర్తుందా??

39 సంవత్సరాల క్రితం అంటే (09.12.1983 న విడుదలై విజయాన్ని సొంతం చేసుకొని  చిత్రం…”పోరాటం సినిమా”… S R ఫిలింస్ పై కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో విడుదలైన శత దినోత్సవచిత్రం  ఈ”.పోరాటం”..సినిమా…ఇందులో హీరో కృష్ణ,జయసుధ,శారద,మహేష్ బాబురావు గోపాలరావు,రాజేంద్రప్రసాద్,గొల్లపూడి,అంజలీదేవి,పూర్ణిమ, నటించారు….మహేష్ బాబు నటించిన మొదటిసినిమా (బాలనటుడిగా) ఇది…. మహా నటుడు NTR తో ఎదురీత సినిమా తీసిన శాఖమూరి రామచంద్రరావు(సహాయ దర్శకుడు)ఈ సినిమాకి నిర్మాత గా వ్యవహరించారు సంగీతం చక్రవర్తిగారు సాహిత్యం ఆత్రేయ,రాజశ్రీ,వేటూరి గారు.ఇందులో “ఏ దేవుళ్ళు దీవించినారో, మరియు పక్కకు వస్తావా అనే పాటలు హిట్ అయ్యాయి….ఈ సినిమాకి మొదట కోదండరామిరెడ్డి గారు ను దర్శకునిగా తీసుకొన్నారు కానీ నిర్మాతకు ,కోదండరామిరెడ్డి గారికి వచ్చిన అభిప్రాయభేదాలతో కోడి రామకృష్ణ గారిని తీసుకున్నారు…కృష్ణ,కోడి రామకృష్ణ గారి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా ఇదే.. ఇది హీరో కృష్ణ గారు నటించిన 213వ సినిమా