Devotional

TNI ఆధ్యాత్మికం. తిరుమలలో వైభవంగా మాఘ పౌర్ణమి వేడుకలు

TNI ఆధ్యాత్మికం. తిరుమలలో వైభవంగా మాఘ పౌర్ణమి వేడుకలు

వేడుకగా శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి

తిరుమల, ఫిబ్రవరి5: తిరుమల శేషాచల అడవుల్లోని పుణ్యతీర్థాల్లో ఒకటైన శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ఆదావారం వేడుకగా జరిగింది. ప్రతిఏటా మాఘ మాసంలో పౌర్ణమి నాడు శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలో శ్రీవారి ఆలయం నుంచి అర్చకులు మంత్రోచ్ఛారణ చేసుకుంటూ ఊరేగింపుగా బయలుదేరి ఉదయం 9 గంటలకు శ్రీరామకృష్ణ తీర్థానికి చేరుకున్నారు. అక్కడ కొలువై ఉన్న శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణ భగవానుల విగ్రహాలకు పాలు, పెరుగు, చందనం, తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు. రామకృష్ణ తీర్థానికి వెళ్లే భక్తులకు పాపవినాశనం డ్యాం వద్ద పొంగలి, ఉప్మా, సాంబారన్నం, పెరుగన్నం, పులిహోర పొట్లాలు, తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. పోలీసులు సమన్వయంతో టీటీడీ విజిలెన్స్‌, ఫారెస్ట్‌ మజ్దూర్‌లు భక్తులకు దారిపొడవునా భద్రత కల్పించారు. టీటీడీ, పోలీసు, ఆర్టీసీలోని సంబంధిత విభాగాల అధికారులందరూ సమన్వయంతో భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు పర్యవేక్షించారు. స్థానికులతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి వచ్చిన వందలాది మంది భక్తులు పాల్గొన్నారు.