Devotional

గోవుతో గృహప్రవేశం ఎందుకు?

గోవుతో గృహప్రవేశం ఎందుకు?

మనందరికీ సొంతింట్లో నివసించాలనిపిస్తుంది. ఆ స్వగృహ కల నెరవేరినప్పుడు బంధుమిత్రుల్ని పిలిచి గృహప్రవేశ వేడుక చేసుకుంటాం.

ఆ వేడుకలో మొదటి ఆచారం దూడతో సహా గోమాతను నూతన గృహంలోకి తీసుకెళ్లి మంత్రం జపిస్తూ ఇల్లంతా తిప్పడం. ఆ తర్వాతే ఇంటి యజమాని, ఇతర కుటుంబ సభ్యులు లోనికి వెళ్తారు. ఈ ఆచారం వెనుక ఉన్న ఆంతర్య మేమిటో చూద్దాం…

పురాణాలూ ఇతిహాసాలూ గోవును సకలదేవతా స్వరూపంగా వర్ణించాయి. గోవు ఉన్నచోట సకల దేవతలూ ఉంటారని పురాణేతిహాసాలు చెబుతున్నాయి. అందువల్ల ఆవును తీసుకెళ్తే.. దేవతలూ గృహంలో ప్రవేశిస్తారన్నమాట. అందుకే కొత్తింట్లో గోవును తిప్పటం ఆచారమయ్యింది. ఆ సమయంలో గోవు మూత్రం పోసినా, పేడ వేసినా మరింత శుభకరంగా భావిస్తారు. ప్రస్తుత కాలంలో బహుళ అంతస్తుల్లో గోవును తిప్పటం కుదరదు కనుక ఆ ప్రాంగణంలో ఆవూదూడలను అలంకరించి పూజిస్తారు. గోమయాన్ని, గోమూత్రాన్ని ఇంట్లో చిలకరిస్తారు.

ఓం నమః శివాయ