Business

ఏప్రిల్ 1 నుంచి ఆ బంగారం అమ్మకంపై నిషేధం

ఏప్రిల్ 1 నుంచి ఆ బంగారం అమ్మకంపై నిషేధం

ఆరు అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య-HUID లేకుండా హాల్మార్క్ చేసిన బంగారు ఆభరణాలు, కళాఖండాల విక్రయాన్ని ఏప్రిల్ 1 నుంచి నిషేధించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కార్యకలాపాలపై సమీక్షించిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్.. 2023 ఏప్రిల్ 1 నుంచి 6 అంకెల HUID కలిగిన బంగారాన్ని మాత్రమే విక్రయించాలని ఆదేశించారు. వ్యాపారులు, కస్టమర్లు దీన్ని తప్పక పాటించాలని సూచించారు.