Politics

కవిత కష్టాలపై గల్ఫ్ దేశాలలో నిరసన

కవిత కష్టాలపై గల్ఫ్ దేశాలలో  నిరసన

ఈడి విచారణను ఎదుర్కోంటున్న ఎమ్మెల్సీ కె. కవితకు గల్ఫ్ దేశాలలోని తెరాస అభిమానులు మరియు భారత జాగృతి సభ్యులు సంఘీభావంగా నిలుస్తున్నారు.
​విచారణకు ఒక రోజు ముందు బహ్రెయిన్ లో భారత జాగృతి సభ్యులు నిర్వహించిన కవితకు సంఘీభావంగా భారత జాగృతి గల్ఫ్ విభాగం అధ్యక్షుడు చెల్లంశెట్టి హరిప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జగిత్యాల శాసన సభ్యులు డాక్టర్ యం. సంజయ్ కుమార్ పాల్గోని ప్రజాదరణ కల్గిన ప్రతిపక్ష నేతలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కక్షపూరితంగా వేధిస్తుందని విమర్శించారు. గల్ఫ్ లోని అత్యధిక మంది తెలంగాణ ప్రవాసీయులు కవితకు మద్దతుగా ఉన్నారని హరిప్రసాద్ అన్నారు.
​శనివారం సాయంత్రం ఒమాన రాజధానిలో భారత జాగృతి ఒమాన్ శాఖ అధ్యక్షుడు గుండు రాజేందర్ అధ్యక్షత సమావేశమై బిజెపి తీరును నిరసించారు. ప్రధాన కార్యదర్శి వడియాల దేవేందర్ రెడ్డి, మోతే నరేష్, పుష్ప నరేశ్, శిరీష బాల రాజులు కవితకు పూర్తిగా మద్దతు పలికారు.
​కువైత్ లో భారత జాగృతి అధ్యక్షుడు వినయ్ కుమార్ అధ్యక్షత సమావేశమైన సభ్యులు కూడ కవితకు మద్దతుగా ఉంటామని ప్రతిజ్ఞ చేసారు.
​దుబాయి, షార్జాలలో కూడ భారస అభిమానులు సామాజిక మాధ్యమాలలో కవితకు అండగా ఉంటామని పోస్టలు చేసారు.