Devotional

తిరుమల సమాచారం..!

తిరుమల సమాచారం..!

అంగప్రదక్షిణం

2023 సంవత్సరం జులై నెల కోటా ను ఏప్రిల్ 21 వ తేది శుక్రవారం ఉదయం 10:00 గంటలకు ఆన్ లైన్ లో టీటీడీ వారు విడుదల చేస్తున్నారు ప్రతి రోజు 750 టికెట్స్ విడుదల చేస్తారు ఈ టికెట్స్ ఉచితం (ప్రతి శుక్రవారం దర్శనం ఉండదు )అంగ ప్రదక్షిణం చేసిన తర్వాత దర్శనం చేసుకోవచ్చు
1 లడ్డు ఉచితం గా ఇస్తారు రాత్రి 12 గంటల కు స్వామి పుష్కరిణి
(కొనేరు)లో స్నానం చేసి తడి బట్టల తోనే రాత్రి 12 గంటల నుండి 1 గంటల లోపు
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 లో నుండి వెళ్ళాలి.
అంగ ప్రదక్షిణ చేసే వారు రాత్రి కొద్దిగా అల్పాహారం మాత్రమే తీసుకోవాలి. బోజనము చేస్తే ప్రదక్షిణం చేయడానికి ఇబ్బంది పడాల్సి వస్తోంది. ప్రదక్షిణం చేసే సమయంలో స్వామి వారి నామాన్ని స్మరించుకోవాలి
స్త్రీలు చీర, Punjabi డ్రెస్ మగ వారు పంచ, ప్యాంట్ దరించు కోవాలి( షర్ట్ వేసుకోకూడదు)
ముందుగా స్త్రీలను, తర్వాత పురుషులను పంపిస్తారు బంగారు బావి దగ్గర నుండి హుండీ వరకు ఆంగ ప్రదక్షిణం చేయాలి ఆ సమయంలో సుప్రబాత సేవా జరుగు తుoటుది తరువాత జయ విజయుల దగ్గర నుండి దర్శనం పంపిస్తారు టికెట్స్ ఉచితంగా ఇస్తున్నారు త్వరగా టిక్కెట్లు అయిపోతాయి .ఉదయం 5 గంటల వరకు దర్శనం చేసుకొని బయటకు వస్తాము.

గమనిక

సేవ ను మీరు 2వ తేది బుక్ చేసుకుంటే1 వ తేది రాత్రి 12 గంటల లోపు స్నానం చేసి
2వ తేది ఉదయం 1 గంట లోపు క్యు లో వెళ్ళాలి
మీరు సేవ బుక్ చేసుకున్న ఉదయం 1 గంటల సమయం అని గుర్తుంచుకోవాలి
కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ…