Movies

సల్మాన్ ను సోదరుడిగా భావించడం నాకు నచ్చలేదు.. భూమిక

సల్మాన్ ను సోదరుడిగా భావించడం నాకు నచ్చలేదు.. భూమిక

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ను సోదరుడిగా భావించడం తనకు ఇష్టంలేదంటోంది నటి భూమిక చావ్లా. కొంతకాలంగా సపోర్టింగ్ క్యారెక్టర్లు చేస్తూ కెరీర్ నడిపిస్తున్న ఆమె రీసెంట్గా ఓ సమావేశంలో సల్మాన్, తనకు మధ్య జరిగిన ఓ సంఘటనను గుర్తుచేసుకుంది. 2003లో వచ్చిన ‘తేరే నామ్’ సినిమాలో సల్మాన్ సరసన నటించిన భూమికా ఈ మూవీ ఆడియో ఫంక్షన్ అందరిముందే ‘సల్మాన్ భాయ్’ అని పిలిచినట్లు చెప్పింది.

అయితే దేశం మొత్తం అతనిని ఈ పేరుతోనే గౌరవిస్తుంది కాబట్టి తాను అలాగే పిలిచానన్న నటి.. ‘ఆ రోజు తొందరలో అలా సంబోధించినందుకు తర్వాత చాలా ఫీల్ అయ్యాను. ఎందుకంటే అతనికి ప్రేయసిగా నటించినందుకు అన్నయ అని పిలవాలనిపించలేదు. అందుకే ఇంకెప్పుడూ అలా పిలవకూడదని ఫిక్స్ అయ్యాను’ అని చెప్పుకొచ్చింది.