Movies

OG: పవన్ మూవీలో విలక్షణ నటుడు.. బద్రి రోజులు గుర్తు చేసేలా!

OG: పవన్ మూవీలో విలక్షణ నటుడు.. బద్రి రోజులు గుర్తు చేసేలా!

సాధారణంగా స్టార్ హీరోల నుంచి సినిమాలు రావాలంటే కనీసం ఒక ఏడాది అయినా సమయం పడుతుంది. కానీ, టాలీవుడ్‌లోని బడా హీరో మాత్రం ఏకధాటిగా సినిమాలు చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు. అతడే పవర్ స్టార్ పవన్ కల్యాణ్. గతంలో ఆలస్యంగానే సినిమాలు చేసిన అతడు.. రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రం జెట్ స్పీడుతో దూసుకెళ్తోన్నాడు. ఇలా ఇప్పటికే పలు చిత్రాలను అందించిన ఈ స్టార్ హీరో.. ఇప్పుడు చేతి నిండా చిత్రాలతో ఫుల్ బిజీగా గడుపుతోన్నాడు. ఇక, పవన్ ప్రస్తుతం నటిస్తోన్న సినిమాల్లో ‘OG’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) ఒకటి.

యంగ్ డైరెక్టర్ సుజిత్‌తో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేస్తున్న చిత్రమే ‘OG’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్). యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా ముంబై నేపథ్యంతో సాగే ఓ గ్యాంగ్‌స్టర్ స్టోరీతో తెరకెక్కబోతుందని తెలిసిందే. అంతేకాదు, వరుసగా అప్‌డేట్లు ఇస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తూనే ఉంది. ఇక, ఈ మూవీని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తోన్న చిత్ర యూనిట్.. ఏప్రిల్ 15వ తేదీ నుంచి ఈ సినిమా మొదటి షెడ్యూల్‌ను ముంబైలో మొదలు పెట్టింది. ఇందులో పవన్ కూడా పాల్గొన్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే న్యూస్ వైరల్ అవుతోంది.

పవర్‌ఫుల్ కాంబినేషన్‌లో రాబోతున్న ‘OG’ మూవీలో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇందులో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఫస్ట్ షెడ్యూల్‌లో ఆయన కూడా పాల్గొన్నారు. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్ – పవన్ కల్యాణ్ మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతో హైలైట్‌గా ఉంటాయట. వీళ్లిద్దరి ఎపిసోడ్స్ ‘బద్రీ’ సినిమా రోజులను గుర్తు చేసేలా డిజైన్ చేసినట్లు సమాచారం. దీంతో హిట్ కాంబో మరోసారి తెరపై కనిపించబోతుండడం ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పొచ్చు.

ఇక, పవన్ కల్యాణ్ హీరోగా సుజిత్ రూపొందించే ఈ సినిమాను RRR ప్రొడ్యూసర్ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అలాగే, ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కే చంద్రన్ పని చేస్తున్నారు. ఎస్ థమన్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది.