NRI-NRT

యూకేలో పెరుగుతున్న దొంగతనాలు… కాస్ట్ అఫ్ లివింగ్ సమస్య?

యూకేలో పెరుగుతున్న దొంగతనాలు… కాస్ట్ అఫ్ లివింగ్ సమస్య?

ప్రస్తుతం యుకె పరిస్థితి చాలా దారుణంగా ఉంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో యూకే కొట్టుమిట్టాడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం సంభవించే అవక

ప్రస్తుతం యుకె పరిస్థితి చాలా దారుణంగా ఉంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో యూకే కొట్టుమిట్టాడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం సంభవించే అవకాశం ఉన్న దేశాలలో యూకే ముందు వరుసలో ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు కరోనా మహమ్మారి ఇంధన సంక్షోభం ఇలా అన్నీ కలిపి యూకే ఆర్థిక పరిస్థితిని దారుణంగా దిగజార్చాయి. ఇప్పుడు యూకే లో చాలామంది జీవన వ్యయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. దీంతో చాలామంది ఆర్థిక సంక్షోభం కారణంగా దొంగతనాలకు పాల్పడుతున్నారు.

ఈ కారణంగా రోజురోజుకీ యూకే లో దొంగతనాల కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. గత రెండేళ్లుగా యూకే ప్రాథమిక అవసరాల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వచ్చే జీతంతో పోల్చుకుంటే నిత్యవసరాలపై పెట్టే ఖర్చు అధికంగా ఉండడంతో కొన్ని కుటుంబాలు తినకుండా డబ్బును ఆదా చేయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నా. ఈ క్రమంలోనే బ్రిటిష్ పౌరులు జీవన వ్యయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా గృహాల అవసరాలను తీర్చడానికి కష్టపడుతున్నారు. 2021 – 22 మధ్య యూకే అంతటా జీవన వ్యయం బాగా పెరిగిన విషయం తెలిసిందే. దాంతో యూకేవ్యాప్తంగా దొంగతనాలు పెరిగిపోతున్నాయి.

ముఖ్యంగా నిత్యవసరాలు కొంటున్న సమయంలో రిటైల్ షాపుల నుంచి వస్తువులు దొంగలించే సంఖ్య పెరిగిపోతున్నట్లు మెట్రో సర్వేలో తేలింది. పదిమంది యువకుల్లో ఒకరు ఇలా షాపుల్లో దొంగతలకు పాల్పడుతున్నట్లు ఒప్పుకున్నట్లు తెలిపింది. యూకే లో ద్రవ్యోల్బణం అందరికి ఎలా స్థాయికి చేరుకుంది. దాంతో పెట్టితం అక్కడ ద్రవ్యోల్బణం 10.4 శాతంగా ఉంది. ఆహార పదార్థాలు అలాగే ఇంధన ఖర్చులు ఆకాశాన్ని అంటుతున్నాయి. దొంగలు ఎక్కువగా పాలు చీజ్ వంటివి దొంగతనం చేస్తున్నారు.