తిరువూరు : శ్రీ వాహిని పాలిటెక్నిక్ కళాశాలలో మెకానికల్ విభాగంలో బోధనా సిబ్బందిగా పనిచేస్తున్న తిరువూరు పట్టణ టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందిన శ్రీ తోట ప్రసాద్ గారి కుమారుడు శ్రీ వెంకట సాయి యశ్వంత్ మోహన్ ప్రముఖ అంతర్జాతీయ సంస్థ అయినటువంటి దస్సాల్ట్ సిస్టమ్స్ వారిచే మెకానికల్ డిజైన్ విభాగంలో సాలిడ్ వర్క్స్ లో సర్టిఫికేషన్ పూర్తి చేసినాడని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రంగా నాగేంద్రబాబు తెలియజేసినారు ఒక ప్రకటనలో తెలిపారు.
అతి చిన్న వయసులోనే అంతర్జాతీయ సర్టిఫికేషన్ పొందడం పట్ల యశ్వంత్ ని కళాశాల చైర్మన్ శ్రీ పసుమర్తి వెంకటేశ్వరరావు, సెక్రెటరీ శ్రీ ఊటుకూరి సుబ్రహ్మణ్యం, కరెస్పాండెంట్ శ్రీ పోట్రు నాగేశ్వరరావు, ట్రెజరర్ శ్రీ ముత్యాల కిషోర్ బాబు, వివిధ విభాగాధిపతులు మరియు సిబ్బంది అభినందించినారు.