WorldWonders

ఆంధ్రలో పెరుగుతున్న మహిళల సంఖ్య

ఆంధ్రలో పెరుగుతున్న మహిళల సంఖ్య

రాష్ట్రంలో అమ్మాయిల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో దశాబ్దాల తరబడి అబ్బాయిలే అధికంగా ఉంటున్నారు. కానీ.. 2021 తర్వాత అమ్మాయిల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్టు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శా­ఖ తాజా నివేదిక వెల్లడించింది. శ్రామిక శక్తికి సంబంధించి 2021– 22 నివేదిక లో ఈ విషయాలను వెల్ల­డించింది. గతంలో వెయ్యి మంది అబ్బాయిలకు 977 మంది అమ్మా­యిలు మా­త్ర­మే ఉండేవారు. ఇప్పుడా సంఖ్య 1,046కు పెరిగినట్టు నివేదికలో వెల్లడించింది.రాష్ట్రంలో ఆరోగ్య కార్యక్రమాలు బాగా అమలు చేస్తుండటం వల్లే అమ్మాయిల సంఖ్య పెరుగుతున్నట్టు నివేదిక వెల్లడించింది. సాధారణంగా ఆరే ళ్లు నిండకముందే బాలికల్లో ఆరో­గ్య సమస్యలు తలెత్తి మృతి చెందేవారు. కానీ.. ఈ పరిస్థితులు తలెత్తకుండా అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు పౌష్టికాహారం అందించడం, క్రమం తప్పకుండా యాంటీనేటల్‌ చెక­ప్, వ్యాధి నిరో ధక టీకాల అమలు అద్భుతంగా ఉండటం వంటి పరిస్థితుల వల్ల మంచి ఫలితాలు వస్తున్నా యి. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌ల స్థాయిలోనే ఆరోగ్య సేవ­లు అందిస్తున్నారు. ఇటీవల చేపట్టిన ఫ్యామిలీ ఫిజీషియన్‌ వ్యవస్థ కూడా సత్ఫలితాలు ఇస్తోంది. అమ్మాయిల సంఖ్య పెరగడానికి ఇవి కూడా కారణాలని నివేదిక వెల్లడించింది.