Politics

హుస్సేన్ సాగర్‌ను శుభ్రం చేయాలని గవర్నర్ తమిళిసై ప్రభుత్వాన్ని ఆదేశించారు

హుస్సేన్ సాగర్‌ను శుభ్రం చేయాలని గవర్నర్ తమిళిసై ప్రభుత్వాన్ని ఆదేశించారు

హుస్సేన్ సాగర్‌తో హైదరాబాద్ నగరానికే ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్నదని, దేశంలో మరే నగరానికి ఇంతటి అందమైన సరస్సు లేదని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ వ్యాఖ్యానించారు. ఏ రాష్ట్రంలోనూ కనిపించని ఈ సాగర్ నగర ప్రజలకు ఆహ్లాదాన్ని ఇవ్వడమే కాకుండా అంతర్జాతీయ స్థాయి సెయిలింగ్ పోటీలకు కేంద్రం కూడా అని అన్నారు.హైదరాబాద్ నగరానికి ఈ లేక ఒక గిఫ్ట్ లాంటిదని ప్రశంసించిన గవర్నర్.. ఈ నీటిని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రజలపైనే కాకుండా ప్రభుత్వానికి కూడా ఉన్నదని అన్నారు. ఒకప్పుడు ఇక్కడ సెయిలింట్ చేసేటప్పుడు పాములు, కప్పలు, చేపలు కనిపించేవని మిలిటరీ అధికారులు గుర్తుచేశాని ఉదహరించారు.

ఇప్పుడు కాలుష్యం కారణంగా అవన్నీ మాయమమయ్యాయని, దీన్ని పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ నీటిని శుభ్రపర్చడానికి, కాలుష్యాన్ని నివారించడానికి చొరవ తీసుకోవాలన్నారు. వచ్చే సంవత్సరం సెయిలింగ్ పోటీలు జరిగే సమయానికి మరోసారి ఇలాంటి కామెంట్లు రాకుండా ఉంటాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.వారం రోజుల పాటు జరిగిన 37వ సెయిలింగ్ వీక్ ముగింపు ఉత్సవాలకు చీఫ్ గెస్టుగా హాజరైన గవర్నర్‌పై వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో సెయిలింగ్ పోటీలు ఇక్కడ జరుగుతూ ఉంటాయని, ఎంతోమంది ప్రతిభ కలిగిన సెయిలర్లు ఇక్కడకు ప్రతి ఏటా వస్తూ ఉంటారని అన్నారు. ఇప్పటిదాకా జరిగిన అనేక అంతర్జాతీయ పోటీల్లో భారత్‌కు పతకాలు కూడా వచ్చాయన్నారు.సెయిలింగ్ ఈవెంట్ల ద్వారా హుస్సేన్ సాగర్‌కు ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు లభిస్తుందన్నారు. రాబోయే ఆసియా, ఒలింపిక్ క్రీడల్లో పతకాలు రావాలని ఆకాంక్షించారు. వారం రోజుల పాటు జరిగిన సెయిలింగ్ ఈవెంట్లలో రాణించిన క్రీడాకారులకు ఆమె పతకాలను ప్రదానం చేశారు.