Politics

R5 జోన్ ఇళ్లపై సుప్రీంకోర్టుకు ఏపీ సర్కార్

R5 జోన్ ఇళ్లపై సుప్రీంకోర్టుకు ఏపీ సర్కార్

పేదల ఇళ్ల నిర్మాణంపై న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆ మేరకు చర్యలు చేపట్టింది. హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టుకు వెళ్లింది రాష్ట్ర ప్రభుత్వం. హైకోర్టు ఉత్వర్తులపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌కు ప్రీంకోర్టు రిజిస్ట్రీ డైరీ నంబర్‌ను కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌ వేస్తే తమ వాదనలూ వినాలని రైతులు కోరారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో కేవియట్‌ దాఖలు చేశారు రాజధాని రైతులు.

కాగా, రాజకీయ కుట్రలు, కోర్టు కేసుల ఆటంకాలు దాటుకుని ఇటీవలే అమరావతిలోని ఆర్‌-5 జోన్‌లో సీఎం జగన్‌ చేతుల మీదుగా పట్టాలు అందజేయించి మరీ ఇళ్ల నిర్మాణం ప్రారంభించింది ప్రభుత్వం. అయితే ఇళ్ల నిర్మాణాన్ని ఆపేలా కుట్రపూరితంగా కొన్ని వ్యాజ్యాలు దాఖలయ్యాయి.

ఈ నేపథ్యంలో గురువారం హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇళ్ల నిర్మాణాలు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. స్టే ద్వారా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏపీ హైకోర్టు విధించిన స్టేను జగన్‌ సర్కార్‌ సవాల్‌ చేసింది.